హోమ్ /వార్తలు /బిజినెస్ /

Housing Realty: ఆ ఏడు నగరాల్లో తగ్గిన గృహ విక్రయాలు.. అసలు కారణం ఇదే..!

Housing Realty: ఆ ఏడు నగరాల్లో తగ్గిన గృహ విక్రయాలు.. అసలు కారణం ఇదే..!

తగ్గిన గృహ విక్రయాలు

తగ్గిన గృహ విక్రయాలు

వడ్డీరేట్ల పెంపు (Interst rates)తో దేశంలో ప్రాపర్టీల (Property) ధరలు పెరుగుతున్నాయి. 2022 జూన్ (June) త్రైమాసికంలో.. ఏడు ప్రధాన నగరాల్లో గృహాల విక్రయాలు 15 శాతం తగ్గి 84,930 యూనిట్లకు చేరుకున్నాయి. 2022 మార్చి త్రైమాసికంలో 99,550 యూనిట్లు ఉన్నాయి.

ఇంకా చదవండి ...

ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి జూన్ ప్రారంభంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలకమైన రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు (bps) పెంచింది. మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.04 శాతంగా ఉంది, ఇది ఆర్‌బీఐ (rbi) లక్ష్య పరిమితి 2- 6 శాతం కంటే ఎక్కువ. దీంతో ఆర్థిక సంస్థలు వివిధ వడ్డీ రేట్ల (Interest Rates)ను కూడా పెంచాయి. దీంతో దేశంలో ప్రాపర్టీల ధరలు (Properties Price) కూడా పెరుగుతున్నాయి. 2022 జూన్ త్రైమాసికంలో.. ఏడు ప్రధాన నగరాల్లో గృహాల విక్రయాలు 15 శాతం తగ్గి 84,930 యూనిట్లకు చేరుకున్నాయి. 2022 మార్చి త్రైమాసికంలో 99,550 యూనిట్లు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ నివేదిక ప్రకారం.. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్(MMR) 2022 రెండో త్రైమాసికంలో అత్యధికంగా దాదాపు 25,785 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఎన్‌సీఆర్‌లో దాదాపు 15,340 యూనిట్లు విక్రయించారు.

* ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో 56 శాతం తగ్గిన న్యూ సప్లై

2022 జూన్ త్రైమాసికంలో డెవలపర్లు న్యూ సప్లైను దాదాపు 82,150 యూనిట్లకు పరిమితం చేశారని, 2022 మొదటి త్రైమాసికంలో 89,150 యూనిట్లు ఉండగా, ఈ కాలంలో ఎనిమిది శాతం క్షీణత ఉందని నివేదిక పేర్కొంది. MMR, పూణే కొత్త లాంచ్‌లు మాత్రమే వరుసగా 26 శాతం, 14 శాతం క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ పెరిగాయి. మిగిలిన టాప్-ఐదు నగరాలు కొత్త లాంచ్‌లను తగ్గించాయి. 2022 రెండో త్రైమాసికంలో MMR 29,730 యూనిట్లను విక్రయించగా, పూణే దాదాపు 16,560 యూనిట్లను నమోదు చేసింది. జాతీయ రాజధాని ప్రాంతం (NCR) న్యూ సప్లైలో భారీగా 56 శాతం తగ్గుదల కనిపించింది. అంటే 2021 మొదటి త్రైమాసికంలో 9,300 యూనిట్ల నుంచి 2022 రెండో త్రైమాసికంలో దాదాపు 4,070 యూనిట్లకు పడిపోయింది.

ఇదీ చదవండి: వాట్సాప్ సూపర్ అప్‌డేట్.. ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ టైమ్ లిమిట్‌ పెంపు.. ఎన్ని రోజులంటే..?


* ప్రధాన నగరాల్లో ఏడు శాతం తగ్గిన విక్రయాలు

ఏడు ప్రధాన నగరాలు - NCR, MMR, బెంగళూరు, పూణే, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా 2022 మొదటి త్రైమాసికంలో 82,150 కొత్త యూనిట్లను ప్రారంభించాయి. 2022 మొదటి త్రైమాసికంలో 89,150 యూనిట్లు విక్రయించాయి. ఇది గత త్రైమాసికంతో పోలిస్తే 8 శాతం తక్కువ. 2022 రెండో త్రైమాసికంలో కొత్త యూనిట్ లాంచ్‌లకు కారణమైన ముఖ్య నగరాలు MMR(ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం), హైదరాబాద్, పూణే, బెంగళూరు, కలిపి 91 శాతం న్యూ స్లపై అదనంగా ఉంది. MMR, పూణే మాత్రమే కొత్త లాంచ్‌లను పెంచాయి.

ANAROCK గ్రూప్ ఛైర్మన్‌ అనూజ్ పూరి మాట్లాడుతూ..‘ఇన్‌పుట్ ఖర్చులపై ద్రవ్యోల్బణ ఒత్తిడితో డెవలపర్‌లను కొన్ని నెలలుగా ప్రాపర్టీ ధరలను పెంచాల్సి వచ్చింది. ఆర్‌బీఐ గృహ రుణ వడ్డీ రేట్లను పెంచే రెండు రేట్ల పెంపుదలను విడుదల చేసింది. ఈ రెండు కారకాలు కలిసి గృహ కొనుగోలుదారుల కోసం మొత్తం ఆస్తి ధరలను ఖర్చును పెంచాయి. ఇది గృహాల విక్రయాలలో తగ్గింపునకు కారణమైంది. రెండు సంవత్సరాల తర్వాత, పాఠశాల సెలవు నెలల్లో (ఏప్రిల్, జూన్ వరకు) కుటుంబ ప్రయాణ ప్రణాళికలకు అంతరాయం కలిగించే కొత్త కోవిడ్-19 వేవ్ కూడా అమ్మకాలను ప్రభావితం చేసి ఉండవచ్చు. డెవలపర్లు న్యూ లాంచ్‌లను నిలిపివేశారు. వారు పెరిగిన గృహ కొనుగోలు ఖర్చుల మధ్య ముగుస్తున్న మార్కెట్ సెంటిమెంట్‌లపై స్పష్టత కోరుతున్నారు. రెండు బ్యాక్-టు-బ్యాక్ త్రైమాసికాల్లో బలమైన హౌసింగ్ అమ్మకాలు, న్యూ లాంచ్‌లను (2021 నాలుగో త్రైమాసికం, 2022 మొదటి త్రైమాసికం) చూసినందున, తగ్గుదల ఆశించవచ్చు’ అని చెప్పారు.

ఇదీ చదవండి: జేఎన్‌టీయూలో స్పెషల్ సర్టిఫికెట్ కోర్సులు.. ఫుల్ డీటైల్స్ మీ కోసం


* పూణేలో కనిపించిన వృద్ధి

MMRలో దాదాపు 29,730 యూనిట్లు ప్రారంభమయ్యాయి. ఇది 2022 మొదటి త్రైమాసికంతో పోలిస్తే దాదాపు 26 శాతం ఎక్కువ. రూ.40 లక్షల నుండి రూ. 2.5 కోట్ల బడ్జెట్ విభాగంలో 66 శాతానికి న్యూ లాంచ్‌లు పెరిగాయి. పూణేలో 2022 రెండో త్రైమాసికంలో దాదాపు 16,560 యూనిట్లు మొదలయ్యాయి. ఇవి మునుపటి త్రైమాసికంతో పోలిస్తే 14 శాతం వృద్ధిని సూచిస్తున్నాయి. రూ.80 లక్షల బడ్జెట్ విభాగంలో 73 శాతానికి పైగా కొత్త యూనిట్లు వచ్చాయి.

2022 మొదటి త్రైమాసికంలో 21,550 యూనిట్లతో పోలిస్తే, 2022 రెండో త్రైమాసికంలో హైదరాబాద్ 15,780 కొత్త యూనిట్లను ప్రారంభించగా.. ఇది 27 శాతం తగ్గుదలను నమోదు చేసింది. రూ.40 లక్షలు- రూ.2.5 కోట్ల బడ్జెట్ విభాగంలో 92 శాతానికి పైగా న్యూ సప్లై లాంచ్‌ అయింది. 2022 రెండో త్రైమాసికంలో బెంగళూరు 12,510 యూనిట్లను ప్రారంభించగా.. ఇది స్వల్పంగా 5 శాతం తగ్గుదలను చూపించింది. న్యూ సప్లైలో దాదాపు 74 శాతం మిడ్, అప్పర్ మిడ్ సెగ్మెంట్ (రూ.40 లక్షలు- రూ.1.5 కోట్లు)లో ఉన్నాయి.

2022 రెండో త్రైమాసికంలో దాదాపు 4,070 యూనిట్లు ప్రారంభించడంతో, అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే ఎన్‌సీఆర్‌ కొత్త లాంచ్‌లలో 56 శాతం గణనీయంగా తగ్గింది. 2022 రెండో క్యూ2లో చెన్నైలో సుమారు 1,480 యూనిట్లను ప్రారంభించగా.. ఇది గత త్రైమాసికంతో పోలిస్తే 52 శాతం తగ్గింది. రూ.1.5 కోట్ల బడ్జెట్ విభాగంలో దాదాపు 65 శాతం న్యూ సప్లై వచ్చింది. కోల్‌కతాలో 2022 రెండో త్రైమాసికంలో దాదాపు 2,020 యూనిట్లను ప్రారంభించగా.. ఇది 2022 మొదటి త్రైమాసికం కంటే 48 శాతం తగ్గింది. రూ.40 లక్షలు- రూ.1.5 కోట్ల బడ్జెట్ విభాగంలో దాదాపు 65 శాతం న్యూ లాంచ్‌ యాడ్‌ అయింది.

First published:

Tags: BUSINESS NEWS, Housing Loans, Interest rates, Real estate

ఉత్తమ కథలు