హోమ్ /వార్తలు /బిజినెస్ /

Hyderabad House sales: హైదరాబాద్ లో జోరుగా ఇళ్ల అమ్మకాలు.. నిర్మాణం పూర్తయిన వాటికే మస్తు డిమాండ్.. ఎందుకంటే

Hyderabad House sales: హైదరాబాద్ లో జోరుగా ఇళ్ల అమ్మకాలు.. నిర్మాణం పూర్తయిన వాటికే మస్తు డిమాండ్.. ఎందుకంటే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాలు ఆరు నెలలుగా జోరుగా సాగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. గతంలో నిర్మాణంలో ఉన్న గృహాలను కొనుగోలు చేయాలని అనేక మంది భావించే వారు అయితే.. ఇప్పుడు మాత్రం నిర్మాణం పూర్తయిన వాటికే అధిక డిమాండ్ ఉంది.

కరోనా మహమ్మారి మనందరికీ అనేక విషయాలను నేర్పించింది. లాక్ డౌన్ తో పాటు అనేక కొత్త పదాలను పరిచయం చేసింది. శానిటైజర్లు, మాస్కులను మన జీవితంలో భాగం చేసింది. అయితే వీటన్నితో పాటు సొంత ఇళ్లు ఉండాల్సిన అవసరాన్ని అందరికీ గుర్తు చేసింది ఈ మహమ్మారి. అనేక మంది ఇంటి యజమానులు కరోనా భయంతో అద్దెకు ఉండే వారిని ఖాళీ చేయించారు. మరి కొన్ని చోట్ల పాజిటీవ్ వచ్చిన వారిని ఇంట్లోకి రానివ్వని ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో సొంత ఇళ్లు ఉండాలన్న ఆలోచన అందరిలో పెరిగిపోయింది. దీంతో గత ఆరు నెలలుగా గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో భారీగా ఫ్లాట్ల అమ్మకాలు చోటు చేసుకున్నాయి. ఓ సంస్థ నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా ఫ్లాట్లు, ఇళ్లు కొనుగోళ్లు అధికంగా జరిగిన ఏడు మహా నగరాల్లో హైదరాబాద్‌ ఒకటిగా నిలిచింది. 2020 మొదటి త్రైమాసికంలో కేవలం 3,380 ఫ్లాట్లు, ఇళ్ల అమ్మకాలు జరిగితే.. అదే ఏడాది చివరి త్రైమాసికంలో అమ్మకాలు మూడు రెట్లు పెరిగాయి. ఆ సమయంలో మొత్తం 12,820 ఫ్లాట్లు, ఇళ్ల విక్రయాలు జరగడం విశేషం. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనూ అదే ఊపు కొనసాగింది. మొత్తం 12,620 ఫ్లాట్లు, ఇళ్ల అమ్మకాలు జరిగాయి.

ఇదిలా ఉంటే.. ఇళ్లు కొనేవారి ఆలోచనా విధానం రోజు రోజుకూ మారుతోంది. గతంలో తక్కువ ధరకు లభ్యమవుతాయని నిర్మాణంలో ఉన్న ఇళ్లనే కొనుగోలు చేయడానికి అనేక మంది అధికంగా ఆసక్తి చూపే వారు. అయితే ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. నిర్మాణం పూర్తయి సిద్ధమైన ఇళ్లను కొనడానికే అనేక మంది ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇతర ఏడు ప్రధాన నగరాల్లోనూ కొనుగోలుదారుల ఆలోచనా విధానం ఇలానే ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఇందుకు గల కారణాలను పరిశీలిస్తే నిర్మాణంలో ఉన్న ఇళ్లులు, నిర్మాణం పూర్తయిన ఇళ్లులకు మధ్య ధరలో తేడా బాగా తగ్గడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

గతంలో నిర్మాణం పూర్తయిన ఇంటి కంటే కూడా నిర్మాణంలో ఉన్న వాటి ధర 9 నుంచి 12 శాతం వరకు తక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు ఆ తేడా మూడు నుంచి ఐదు శాతానికే పరిమితమవుతుంది. దీంతో అనేక మంది నిర్మాణం పూర్తయిన ఇళ్లనే కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. వెంటనే ఇంట్లోకి వెళ్లవచ్చు అన్న భావనే ఇందుకు కారణం. ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్‌ తన తాజా నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది.

First published:

Tags: Low cost house, Real estate, Real estate in Hyderabad

ఉత్తమ కథలు