Hyderabad Real Estate: హైదరాబాద్ లో ఇళ్లు కొనాలనుకుంటున్నారా? అయితే, మీకో షాకింగ్ న్యూస్

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్ మహానగరంలో సొంత ఇళ్లు కొనాలనుకుంటున్నారా? అయితే, మీకో షాకింగ్ న్యూస్. ఇంటి నిర్మాణానికి కావాల్సిన ముడి సరుకుల ధరలు భారీగా పెరగడంతో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి.

  • Share this:
    కరోనా ఎఫెక్ట్ తో అనేక మంది నగరాలన నుంచి సొంత ప్రాంతాలకు వెళ్లి పోయారు. ఇంకా అనేక మంది ఉద్యోగం, ఉపాధి కోల్పోయారు. అనేక మంది జీతాల్లో సైతం యాజమాన్యాలు కోతలు విధించాయి. దీంతో డిమాండ్ తగ్గి జీహెచ్ఎంసీ పరిధిలో ఇళ్ల ధరలు భారీగా పడిపోతాయని, అద్దెలు తగ్గుతాయని అనేక మంది భావించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ప్రస్తుతం ఇళ్ల ధరలు చుక్కలను అంటుతున్నాయి. అద్దెలు ఎప్పటిలాగానే ఆకాశాన్ని తాకుతున్నాయి. భారీగా ముడి సరుకు ధరలు, డీజిల్ ధరలు పెరగడంతో నిర్మాణ రంగంపై ఆ ప్రభావం భారీగా పెరిగింది. దీంతో ఇళ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. లాక్‌డౌన్‌ అనంతరం భవన నిర్మాణానికి కావాల్సిన దాదాపు 80 రకాల వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. సిమెంట్ ధర గతంలో రూ.220 నుంచి రూ.250 వరకు ఉండగా అది ఇప్పుడు రూ.320 నుంచి రూ.350 వరకు చేరింది.

    డీజిల్ ధర భారీగా పెరగడంతో ఆ ప్రభావం కాంక్రీట్, ఇటుక, ఇసుక రవాణాపై పడింది. దీంతో వాటి ధరలు అమాంతం పెరిగాయి. ఇదిలా ఉంటే లాక్ డౌన్ సమయంలో అనేక వ్యయప్రయాసాలకు ఓర్చి సొంత ప్రాంతాలకు వెళ్లిన అనేక మంది భవన నిర్మాణ కార్మికులు మళ్లీ తిరిగి రాలేదు. వచ్చిన వారు అధిక మొత్తంలో కూలి డిమాండ్ చేస్తున్నారని నిర్మాణదారులు చెబుతున్నారు. ఈ కారణాలతో నిర్మాణ వ్యయం దాదాపు 20 నుంచి 25 శాతానికి పెరిగింది. దీంతో ఫ్లాట్ల ధరలు కూడా భారీగా పెంచేశారు.

    కరోనా నేపథ్యంలో అనేక కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం సదుపాయం కల్పించాయి. అనేక కంపెనీలు వర్క్ ఫ్రం హోంను కనీసం ఏడాది, రెండేళ్ల పాటు కొనసాగించే అవకాశం ఉన్నట్లు తమ ఉద్యోగులకు సూత్రప్రాయంగా తెలిపాయి. దీంతో ఉద్యోగులు ప్రత్యేక సదుపాయం ఉండే ఇళ్ల కోసం వెతుకుతున్నారు. ఇన్నాళ్లు డబుల్ బెడ్రూం ఇళ్లలో ఉన్న అనేక మంది వర్క్ ఫ్రం హోం నేపథ్యంలో మరో గది ఉండాలని కోరుకుంటున్నారు. ఇన్నాళ్లు చిన్న ఇళ్లల్లో ఉంటూ అడ్జస్ట్ అయిన వారు కూడా డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం వెతుకుతున్నారు. దీంతో ఇళ్లకు డిమాండ్ పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.
    Published by:Nikhil Kumar S
    First published: