హోమ్ /వార్తలు /బిజినెస్ /

House Buying: ఇల్లు కొంటున్నారా? కార్పెట్, బిల్ట్ అప్, సూపర్ బిల్ట్ అప్  ఏరియా అంటే ఏంటో తెలుసా?

House Buying: ఇల్లు కొంటున్నారా? కార్పెట్, బిల్ట్ అప్, సూపర్ బిల్ట్ అప్  ఏరియా అంటే ఏంటో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Home Buying: జీవితంలో మొదటి సారి ఇంటి కోసం వేట మొదలు పెట్టిన వారి మనసులో బోలెడు అనుమానాలు ఉండే ఉంటాయి. చాలా మందికి రియల్టర్లు, బ్రోకర్లు వాడే పదాలకు సరిగ్గా అర్థం తెలియక తికమక పడుతుంటారు. పూర్తిగా విషయం అర్థం కాకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రావచ్చు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

House Buying:  ప్రతి ఒక్కరికీ సొంతింటి కల (Own House) ఉంటుంది. ఇంటిని కొనుగోలు చేయాలని భావిస్తున్న అందరికీ పరిశీలించాల్సిన అంశాలపై అవగాహన ఉండకపోవచ్చు. జీవితంలో మొదటి సారి ఇంటి కోసం వేట మొదలు పెట్టిన వారి మనసులో బోలెడు అనుమానాలు ఉండే ఉంటాయి. చాలా మందికి రియల్టర్లు, బ్రోకర్లు వాడే పదాలకు సరిగ్గా అర్థం తెలియక తికమక పడుతుంటారు. పూర్తిగా విషయం అర్థం కాకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రావచ్చు. బ్రోకర్లకు అనుకున్న విషయాలను సక్రమంగా వ్యక్తపరచలేకపోవచ్చు. అందుకే ఇంటి కొనుగోలు (House Buying), అమ్మకాల విషయంలో రియల్టర్లు తరచూ వినియోగించే, ముఖ్యమైన కొన్ని పదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధరలు .. ఇవాల్టి రేట్లు ఇలా!

* కార్పెట్ ఏరియా

ఇంటిని నిర్మించిన బిల్ట్‌ అప్‌ ఏరియాలో ఈ కార్పెట్ ఏరియా (Carpet Area) 70 శాతం వరకు ఉంటుంది. అంటే ఇది ఇంట్లో నడిచేందుకు వీలుగా ఉన్న ప్రైవేట్‌ స్పేస్‌ మాత్రమే. కచ్చితంగా చెప్పాలంటే ఇది ఇంటి లోపల ఉండే నెట్ యూజబుల్‌ ఏరియా(NUA). ఇది లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్, బెడ్‌రూమ్, స్టడీ రూమ్‌, కిచెన్‌, బాత్‌రూమ్‌లలో నికరంగా వినియోగించే విస్తీర్ణాన్ని సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చట్టం ప్రకారం.. కార్పెట్ ఏరియా అంటే లోపలి గోడలతో సహా ఇంటికి లోపలి వైపు ఉండే ఏరియా మాత్రమే. బయటి గోడలు, బయటి సన్‌షేడ్‌ల కింద ఖాళీలు, బాల్కనీలు, వరండాలు, ఓపెన్ టెర్రస్లు వంటి ఏరియాలన్నీ దీని కిందికి రావు.

SBI Loan: టెన్యూర్‌ పూర్తయ్యే వరకు లోన్‌ కట్టాల్సిన అవసరం లేదు.. ఎస్బీఐ లేటెస్ట్‌ స్కీమ్‌ ఇదే!

* బిల్ట్ అప్ ఏరియా

యజమాని లేదా ఆ ఇంటి వారు మాత్రమే ఉపయోగించగలిగే ఇంటి బయటి ప్రాంతం అంతా ఈ బిల్ట్ అప్ ఏరియా(Builtup Area) కిందకి వస్తుంది. ఇందులో ఈ ఇంటి వారికి మాత్రమే పరిమితం అయి ఉండే ఖాళీలు, గోడలు, బాల్కనీలు, టెర్రస్‌లు వంటివి ఉంటాయి. ఇది ఇంటికి బయట, ఇంటి చుట్టూ ఉండే ప్రాంతం. బిల్డ్‌ అప్‌ ఏరియా పరిధిలోకి ఇంటి లోపల భాగాలు, అందరికీ కంబైన్డ్‌గా ఉండే స్థలాలు రావు. ఇది ప్రాపర్టీ మొత్తంలో దాదాపుగా 30 శాతంగా ఉంటుంది.

* సూపర్-బిల్ట్-అప్ ఏరియా

సూపర్‌ బిల్ట్‌ అప్‌ ఏరియా కిందకి అందరికీ కామన్‌గా ఉండే ఏరియాలకు సంబంధించిన ప్రాంత విస్తీర్ణం వస్తుంది. బిల్ట్‌ అప్‌ ఏరియాతో పాటుగా లిఫ్ట్‌లు, జిమ్‌లు, కారిడార్లు, క్లబ్‌హౌస్‌లు వంటి కామన్‌ స్థలాలుంటాయి. ఇవి మొత్తం యజమానికి సంబంధించినవి కాదు కానీ సూపర్‌ బిల్ట్‌ అప్ ఏరియా (Super built up Area)లో కలిపి లెక్కిస్తారు. ఇప్పటి వరకూ డెవలపర్లు ఈ సూపర్‌ బిల్ట్‌ అప్‌ ఏరియాను చూపించి ఛార్జీలను విధించే సంప్రదాయం ఉంది. అయితే రెరా యాక్ట్‌ ప్రకారం.. సూపర్‌ బిల్ట్‌ అప్‌ ఏరియా చూపించి అమ్మకాలు జరపడం చట్ట విరుద్ధం. కోట్ చేసే ధర తప్పనిసరిగా ఇంటి కార్పెట్ ఏరియాపై ఆధారపడి ఉండాలని పెద్ద రియల్టర్‌ సంస్థలకు చెందిన నిపుణులు సూచిస్తున్నారు.

First published:

Tags: Business, Home loan

ఉత్తమ కథలు