అప్పులన్నీ తీర్చేస్తా... తీసుకోండి: విజయ్ మాల్యా

ఎయిర్‌లైన్స్‌లో నష్టాలొచ్చాయని, ఇప్పటికీ బ్యాంకులకు అప్పులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానన్నాడు విజయ్ మాల్యా. అంతేకాదు... తనను ఎగవేతదారుడిగా చూపించారంటూ నేతలు, మీడియా ప్రతినిధులపైనా మండిపడ్డారు.

news18-telugu
Updated: December 10, 2018, 5:06 PM IST
అప్పులన్నీ తీర్చేస్తా... తీసుకోండి: విజయ్ మాల్యా
విజయ్ మాల్యా (File: Reuteres)
news18-telugu
Updated: December 10, 2018, 5:06 PM IST
బ్యాంకుల దగ్గర వేలకోట్లు అప్పులు చేసి ఎగ్గొట్టి లండన్‌ జీవితాన్ని గడుపుతున్న బిజినెస్ మ్యాగ్నెట్ విజయ్ మాల్యా మొత్తానికి దిగొచ్చాడు. 100 శాతం రుణాలు తీర్చేస్తానని ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులో జేమ్స్ మిషెల్‌ను దుబాయి నుంచి అధికారులు స్వదేశానికి రప్పించిన కొన్ని గంటల్లోనే విజయ్ మాల్యా ఈ ట్వీట్స్ చేయడం విశేషం. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులో అసలు రూ.5,500 కోట్లు చెల్లిస్తానని విజయ్ మాల్యా చెప్పాడు.

బ్యాంకుల్ని రూ.9,000 కోట్లు ముంచిన మాల్యా రెండేళ్లుగా లండన్‌లో ఉంటున్నాడు. మనీలాండరింగ్, ఛీటింగ్ కేసులు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యాను ఇండియాకు అప్పగించాలంటూ అధికారులు విశ్వప్రయత్నాలే చేస్తున్నారు. ఓసారి యూకే పోలీసులు అరెస్ట్ చేసినా మాల్యా వెంటనే బెయిల్‌పై విడుదలయ్యాడు. మాల్యాను ఇండియాకు అప్పగిస్తే ఏ జైలుకు తీసుకెళ్తారో ఆ జైలు ఫోటోలు, వీడియోలు ఇవ్వాలని బ్రిటన్ కోర్టులు కూడా అడిగాయి. మాల్యా అప్పగింత వ్యవహారం కొనసాగుతుండగానే ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్లు సంచలనంగా మారాయి.

ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ ధరలు పెరగడం వల్ల ఎయిర్‌లైన్స్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్ 140 డాలర్లు ఉన్నప్పుడు కింగ్‌ఫిషర్ కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంది. తీవ్రమైన నష్టాలను ఎదుర్కొన్నాం. ఆ డబ్బంతా బ్యాంకులదే. అసలు 100 శాతం చెల్లించేందుకు ఒప్పుకున్నా. దయచేసి తీసుకోండి.
Loading...
విజయ్ మాల్యా ట్వీట్ సారాంశం


మూడు దశాబ్దాల పాటు భారతదేశంలో అతిపెద్ద ఆల్కహాలిక్ బెవరేజ్‌ గ్రూప్ ద్వారా అన్ని రాష్ట్రాల ఖజానాకు వేలకోట్లు అందించామని, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కూడా రాష్ట్రాల ఖజానాను నింపిందన్నారు మాల్యా. ఎయిర్‌లైన్స్‌లో నష్టాలొచ్చాయని, ఇప్పటికీ బ్యాంకులకు అప్పులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానన్నాడు. అంతేకాదు... తనను ఎగవేతదారుడిగా చూపించారంటూ నేతలు, మీడియా ప్రతినిధులపైనా మండిపడ్డారు.

మాల్యా అప్పగింతపై లండన్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టులో డిసెంబర్ 10 విచారణ జరగనుంది. అంతకంటే ఐదు రోజుల ముందే అప్పులు చెల్లిస్తానని మాల్యా ట్వీట్ చేయడం విశేషం.

ఇవి కూడా చదవండి:

పేటీఎం వాడుతున్నారా? యాప్‌లో ఇక ఆ ఫీచర్ ఉండదు

సూపర్ ఆఫర్: షావోమీ పోకో ఎఫ్1 పై రూ.5,000 డిస్కౌంట్

వయస్సు 7 ఏళ్లు... నెల ఆదాయం రూ.12 కోట్లు... షాకైన సోషల్ మీడియా

ఓటర్ ఐడీ లేదా? ఈ కార్డు ఉంటే ఓటు వేయొచ్చు

జియో చేతికి సావన్ మ్యూజిక్... 90 రోజుల పాటు ఫ్రీ

వరుసగా మూడోసారి ఫోర్బ్స్‌ రిచెస్ట్ ఇండియన్ సెలబ్రిటీగా సల్మాన్ ఖాన్

 
First published: December 5, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...