హోమ్ /వార్తలు /బిజినెస్ /

Hop Oxo E-bike: 150 కి.మీ రేంజ్.. 90 kmph టాప్ స్పీడ్‌తో హాప్ ఆక్సో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ లాంచ్.. దీని ప్రత్యేకతలు ఇవే..

Hop Oxo E-bike: 150 కి.మీ రేంజ్.. 90 kmph టాప్ స్పీడ్‌తో హాప్ ఆక్సో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ లాంచ్.. దీని ప్రత్యేకతలు ఇవే..

Hop Oxo E-bike

Hop Oxo E-bike

Hop Oxo E-bike: ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ తయారీ సంస్థ హాప్‌ ఎలక్ట్రిక్ మొబిలిటీ నుంచి హాప్‌ ఆక్సో (Hop Oxo) పేరుతో కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ లాంచ్ అయింది. దీని లుక్ అచ్చం పెట్రోల్ బైక్స్‌ లాగానే ఉండి అందర్నీ ఆకట్టుకుంటోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

భారతదేశంలో ఎలక్ట్రిక్ బైక్స్ (Electric Bikes) కంటే ఈ-స్కూటర్లే ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. దీంతో బైక్ లవర్స్ బాగా నిరాశ పడిపోతున్నారు. అయితే వారందరికీ తాజాగా ప్రముఖ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ తయారీ సంస్థ హాప్‌ ఎలక్ట్రిక్ మొబిలిటీ (HOP Electric Mobility) గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ కంపెనీ తక్కువ ధరలోనే సరికొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. హాప్‌ ఆక్సో (Hop Oxo) పేరిట ఈ కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ (Electric Motorcycle)ను రిలీజ్ చేసింది. దీని లుక్ అచ్చం పెట్రోల్ బైక్స్‌ లాగానే ఉండి అందర్నీ ఆకట్టుకుంటోంది. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ బైక్ సిటీ రోడ్లపై బాగా పనికొస్తుందని కంపెనీ చెబుతోంది. మరి దీని స్పెసిఫికేషన్లు, ధర వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

* ధర ఎంత, ఎన్ని వేరియంట్లు, ఎక్కడ కొనాలి?

హాప్‌ ఆక్సో (Hop Oxo) ఎలక్ట్రిక్ బైక్ అనేది స్టాండర్డ్ హాప్ ఆక్సో, హాప్ ఆక్సో ఎక్స్ (Hop Oxo X) అనే రెండు వేరియంట్లలో రిలీజ్ అయింది. స్టాండర్డ్ హాప్ ఆక్సో రూ.1.25 లక్షల ధరతో లాంచ్ కాగా హాప్ ఆక్సో ఎక్స్ రూ.1.40 లక్షల ధరతో విడుదల అయ్యింది. కంపెనీ హాప్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, కంపెనీ వెబ్‌సైట్ ద్వారా వీటిని కొనవచ్చు. ఓలా, ఏథర్‌ వంటి ఈ-స్కూటర్ల లాగానే ఈ బైక్ తక్కువ ధరతో లాంచ్ కావడం విశేషం.

* డ్రైవింగ్ మోడ్స్, అందించిన బ్యాటరీ, రైడింగ్ రేంజ్

సరికొత్త ఈ-బైక్ ఎకో, పవర్, స్పోర్ట్ అనే 3 రైడ్ మోడ్స్‌లో వస్తుంది. హై-స్పెక్ X వేరియంట్‌లో మాత్రం టర్బో మోడ్ అని మరో మోడ్ అదనంగా కొనుగోలుదారులకు లభిస్తుంది. Hop Oxo X టర్బో మోడ్‌లో గంటకు 90 కిలోమీటర్ల మాక్సిమం స్పీడ్‌తో వెళ్తుంది. కేవలం 4 సెకన్లలో 0-40 km/h వేగానికి ఇది చేరుకోగలదని కంపెనీ తెలిపింది.

ఇది కూడా చదవండి : ఇండియాలో టాప్ 10 సురక్షితమైన కార్లు ఇవే... 3 టాటా మోడల్స్‌దే హవా

ఈ బైక్ 811 NMC సెల్స్‌తో లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఇందులో అందించిన 3.75 kWh బ్యాటరీ ప్యాక్‌ సింగిల్ ఛార్జ్‌పై 150 కిమీల రైడింగ్ రేంజ్ అందిస్తుంది. హాప్‌ ఆక్సో 6200 వాట్ పీక్ పవర్ మోటార్‌తో 200 Nm వీల్ టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలానే ఇది 72 V ఆర్కిటెక్చర్‌పై వర్క్ అవుతుంది.

* ఛార్జింగ్ టైమ్‌, స్పెసిఫికేషన్లు

స్టాండర్డ్ Hop Oxo బైక్‌లో 5.0-అంగుళాల డిజిటల్ డిస్‌ప్లేను అందించారు. IP67 రేటింగ్‌ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ దీని సొంతం. బైక్‌ను పోర్టబుల్ స్మార్ట్ ఛార్జర్‌తో ఏదైనా 16 Amp పవర్ సాకెట్‌లో ఛార్జ్ చేయవచ్చు. ఈ స్మార్ట్ ఛార్జర్‌తో కేవలం 4 గంటలలోపు 0 నుంచి 80% వరకు ఛార్జ్ చేయవచ్చు. ఈ బైక్‌లో మల్టీ-మోడ్ రీ-జెనరేటివ్ బ్రేకింగ్, 4G కనెక్టివిటీ, స్పీడ్ కంట్రోల్, జియో-ఫెన్సింగ్, యాంటీ-థెఫ్ట్ సిస్టమ్ రైడ్ స్టాటిస్టిక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులోని స్మార్ట్ ఫీచర్లను ఆక్సో అనే ఒక మొబైల్ అప్లికేషన్‌తో కంట్రోల్ చేయవచ్చు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Auto, Electric Bikes, Electric Vehicles

ఉత్తమ కథలు