హోమ్ /వార్తలు /బిజినెస్ /

Honda Year End offers: హోండా BS6 కార్లపై రూ.2.5 లక్షల వరకు ఆఫర్స్

Honda Year End offers: హోండా BS6 కార్లపై రూ.2.5 లక్షల వరకు ఆఫర్స్

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Honda Year End offers | హోండా కార్ కొనాలనుకునేవారికి శుభవార్త. బీఎస్6 కార్లపై ఆఫర్ ప్రకటించింది హోండా మోటార్ కంపెనీ.

ఇయర్ ఎండర్ సేల్స్ పేరుతో హోండా కార్లు ఊరించే డిస్కౌంట్లతో సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది. బయ్యర్లను ఆకట్టుకునేందుకు 2.5 లక్షల వరకూ ఆఫర్లు ఇచ్చేందుకు హోండా కార్స్ కంపెనీ సిద్ధమైంది. దీంతో హోండా కార్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీగా మారింది. బీఎస్6 వాహనాలను Honda Cars India సైతం ఆఫర్లలో అందించేలా హోండా సరికొత్త ఆకర్షణీయమైన సేల్స్ ను ప్రకటించింది. హోండా కార్లలోని వివిధ వేరియంట్లపై ఆఫర్లను ప్రకటించిన సంస్థ, క్యాష్ డిస్కౌంట్లను కూడా చేర్చింది. ఎక్స్ చేంజ్ బెనిఫిట్స్, ఎక్స్ టెండెట్ వ్యారెంటీ, అడిషనల్ బెనిఫిట్స్ అయిన లాయల్టీ బోనస్ కూడా కల్పిస్తోంది. ఎక్స్ చేంజ్ డిస్కౌంట్ కింద రూ.6000-10,000 వరకు ఈ ఆఫర్ కింద లభించనుండడం హైలైట్.

ఎక్స్ క్లూజివ్ ఎడిషన్ కూడా


ఇయర్ ఎండ్ బెనిఫిట్ కింద బీఎస్ 6 కార్ Jazz అయిన హోండా జాజ్ , Amaze, WR-V, all-new City, Civic కూడా ఉన్నాయి. విశేషం ఏమిటంటే Amaze Special Edition, Amaze Exclusive Edition, WR-V Exclusive Editionను కూడా ఈ ఆఫర్ల జాబితాలో హోండా చేర్చింది. 2020,డిసెంబర్ 31 వరకూ లేదా హోండా కార్లు స్టాక్ ఉన్నంత వరకూ ఈ ఆఫర్లు వర్తించనుండగా, మోడల్ లేదా వేరియంట్ ను బట్టి ఆఫర్లలో మార్పులు చేర్పులు ఉంటాయి.

IRCTC Ooty Tour: రూ.6,000 ఉంటే ఊటీ చుట్టేయొచ్చు... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

రోజూ 3జీబీ డేటా కావాలా? ఈ Jio, Airtel, Vi ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి తెలుసుకోండి

అమేజ్‌పై అమేజింగ్ ఆఫర్


జపనీస్ కార్ మేకర్ అయిన హోండా బీఎస్6 హోండా అమేజ్ పై ఏకంగా రూ.37,000 మొత్తం ఆఫర్ బెనిఫిట్లు ప్రకటించింది. ఇవి కాకుండా స్పెషల్, ఎక్స్ క్లూజివ్ ఎడిషన్స్ వేరే ఉన్నాయి. పెట్రోల్, డీజల్ 2 వర్షన్స్ లోనూ రూ.15,000 వరకూ క్యాష్ డిస్కౌంట్లు లభించనున్నాయి. ఎక్స్ చేంజ్ బెనిఫిట్ కింద రూ.10,000 లభించనుంది. 4, 5వ ఏడాదికి ప్రత్యేకంగా రూ.12,000 విలువైన ఎక్స్ టెండెడ్ వారెంటీ బెనిఫిట్ కూడా పొందవచ్చు. Amaze స్పెషల్ ఎడిషన్ సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్లు రూ.15,000 విలువైన క్యాష్ బెనిఫిట్, ఎక్స్ చేంజ్ ఆఫర్ పొందవచ్చు.

HDFC Bank: కొత్త క్రెడిట్ కార్డులు ఇవ్వకండి... HDFC బ్యాంకుకు RBI షాక్

HP Gas Booking: హెచ్‌పీ గ్యాస్ బుకింగ్ చాలా సింపుల్... చేయండి ఇలా

హోండా వెబ్ సైట్లో రూ.27,000 బెనిఫిట్లు పొందేలా హోండా అమేజ్ స్పెషల్ ఎడిషన్ ను పొందుపరచారు. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 12,000, ఎక్సేంజ్ బెనిఫిట్ కింద రూ.15,000ను పొందవచ్చని సంస్థ వివరిస్తోంది. 2020 హోండా జాజ్ హ్యాచ్ బ్యాక్ పై గరిష్ఠంగా రూ.40,000 వరకు బెనిఫిట్లు పొందేలా హోండా ఆఫర్ ను రోల్ అవుట్ చేసింది. ఇందులో భాగంగా క్యాష్ డిస్కౌంట్ కింద రూ. 25,000 లభించనుండగా, ఎక్స్ చేంజ్ బెనిఫిట్ కింద రూ. 15,000 పొందవచ్చు. న్యూ జనరేషన్ Cityను కూడా అఫిషియల్ వెబ్ సైట్లో హోండా కంపెనీ పొందుపరిచింది. గరిష్టంగా రూ. 30,000 బెనిఫిట్లు అందేలా హోండా సిటీ న్యూ జనరేషన్ మోడల్ పై ఆఫర్ ఉంది. కానీ కార్ ఎక్స్ చేంజ్ స్కీమ్ కింద దీన్ని ఉపయోగించుకోవచ్చు. Honda Civic Sedanపై ఏకంగా లక్ష రూపాయుల వరకు డిస్కౌంట్లు ప్రకటించారు. దీంతో అన్ని రకాల ఇతరత్రా బెనిఫిట్లతో కలిపి 2.5 లక్షల రూపాయల వరకు డిస్కౌంట్ బెనిఫిట్ పొందవచ్చన్నమాట.

హోండా WR-V డీజల్, పెట్రోల్ వర్షన్స్ రెంటిపైనా రూ.40,000 వరకు డిస్కౌట్ పొందవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్లు రూ. 25,000 కాగా ఎక్స్ చేంజ్ బెనిఫిట్ కింద మరో 15,000 రూపాయలు దక్కుతాయి. WR-V ఎక్స్ క్లూజివ్ ఎడిషన్ పై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్ కింద పొందవచ్చు. కార్ ఎక్స్ చేంజ్ కింద రూ.15,000 డిస్కౌంట్ వస్తుంది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Auto News, Automobiles, CAR, Cars, Honda

ఉత్తమ కథలు