హోమ్ /వార్తలు /బిజినెస్ /

Honda EM1 e: హోండా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌... హోండా EM1 e ప్రత్యేకతలివే

Honda EM1 e: హోండా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌... హోండా EM1 e ప్రత్యేకతలివే

Honda EM1: హోండా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌... హోండా EM1 e ప్రత్యేకతలివే

Honda EM1: హోండా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌... హోండా EM1 e ప్రత్యేకతలివే

Honda EM1 e | హోండా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌‌ను (Electric Scooter) ఆవిష్కరించింది హోండా EM1 e పేరుతో ఎలక్ట్రిక్ వాహనాన్ని పరిచయం చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ప్రస్తుతం వివిధ బ్రాండ్లు ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టి పెట్టాయి. వీటికి డిమాండ్ కూడా పెరగడంతో ప్రొడక్షన్‌ పెంచుతున్నాయి కొన్ని పెద్ద కంపెనీలు. ఈ నేపథ్యంలో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది ఆటోమొబైల్ దిగ్గజం హోండా (Honda). ఈ కంపెనీ మిలాన్‌లో జరిగిన EICMA- 2022 ఈవెంట్‌లో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘EM1 e’ని ప్రదర్శించింది. హోండా EM1 e ఈవీని ముందుగా యూరోపియన్ మార్కెట్‌లో రిలీజ్ చేయనుంది. అయితే ఈ వెహికల్‌ను ఇండియన్ మార్కెట్లో పరిచయం చేసే విషయంపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు.

బ్యాటరీ కెపాసిటీ

హోండా EM1 e ఎలక్ట్రిక్ స్కూటర్ పవర్‌ట్రెయిన్ వివరాలను కంపెనీ వెల్లడించలేదు. అయితే కొన్ని నివేదికల ప్రకారం, ఈ బైక్ యావరేజ్ బ్యాటరీ కెపాసిటీతో రానుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 కిమీల రేంజ్‌ను అందిస్తుంది. వివిధ ఉష్ణోగ్రతలు, ప్రభావాలు, కంపనాలు, తేమను తట్టుకునేలా మొబైల్ పవర్ ప్యాక్ (MPP) లేదా బ్యాటరీ ప్యాక్‌ను రూపొందించారు. MPP అనేది మార్చుకోగలిగిన బ్యాటరీ. ఛార్జింగ్ కోసం బైక్ నుంచి దీన్ని సులభంగా బయటకు తీయవచ్చు.

BSNL New Plan: బీఎస్ఎన్ఎల్ నుంచి ఏడాది వేలిడిటీతో కొత్త ప్లాన్... బెనిఫిట్స్ తెలుసుకోండి

డిజైన్ ఎలా ఉంది?

తాజా బైక్ ఒక ఎలక్ట్రిక్ మోపెడ్‌గా రోడ్లపైకి రానుంది. అర్బన్ ట్రాన్స్‌పోర్టేషన్ అవసరాల కోసం దీన్ని వినియోగించేలా, యూత్‌ను కంపెనీ టార్గెట్‌గా పెట్టుకుంది. EM1 e స్మూత్ స్టైలింగ్‌తో కాంపాక్ట్, ఫ్లాట్ ఫ్లోర్‌ను కలిగి ఉంది. స్కూటర్ టర్న్ ఇండికేటర్స్ హ్యాండిల్‌బార్‌పై ఉన్నాయి. అయితే LED హెడ్‌ల్యాంప్ యూనిట్ ఫ్రంట్ ఆప్రాన్‌లో ఉంది. వెనుకవైపు ఫుట్‌పెగ్స్ బాడీవర్క్‌తో బాగా కలిసిపోతాయి. కేవలం కాంపాక్ట్ ఈవీగా దీన్ని హోండా రూపొందించింది. షార్ట్ ట్రిప్స్ కోసం బెస్ట్ ఆప్షన్‌గా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. ఓవరాల్ డిజైన్ మాత్రం చాలా సాధారణంగా ఉంది. కంపెనీ డిజైన్ విషయంలో ప్రత్యేకంగా ఎలాంటి స్టాండర్డ్ తీసుకోలేదు.

ఆ మార్కెట్లో ఫస్ట్ ఇ-బైక్

హోండా EM1 e బైక్‌ను యూరోపియన్ మార్కెట్ కోసం రూపొందించింది. ఈ బ్రాండ్ నుంచి యూరప్‌లో రిలీజ్ కానున్న ఫస్ట్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ కూడా ఇదే కావడం విశేషం. లేటెస్ట్ ఇ-స్కూటర్ వచ్చే ఏడాది సమ్మర్‌లో మార్కెట్లోకి లాంచ్ కానుంది. దీని ధర వివరాలను కంపెనీ అప్పుడే అనౌన్స్ చేయనుంది.

UPI Scam: ఆన్‌లైన్ పేమెంట్స్‌లో పెరిగిన మోసాలు... ఇలా జాగ్రత్తపడండి

అయితే రానున్న రెండేళ్లలో గ్లోబల్ మార్కెట్లలో మరిన్ని ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను ప్రవేశపెట్టాలని హోండా యోచిస్తోంది. 2025 నాటికి 10 లేదా అంతకంటే ఎక్కువ ఎలక్ట్రిక్ టూవీల్స్‌ను మార్కెట్లోకి తీసుకొస్తామని హోండా గతంలో ప్రకటించింది. ఈ క్రమంలో కొత్త మోడళ్లను వరుసగా పరిచయం చేస్తోంది.

First published:

Tags: Electric Scooter, Electric Vehicles, Honda

ఉత్తమ కథలు