ఇండియాలో(India) ఎప్పటికప్పుడు సరికొత్త టూవీలర్లు లాంచ్(Two Wheelers Launch) చేస్తోంది హోండా మోటార్‌సైకిల్(Motor Cycle) అండ్ స్కూటర్ ఇండియా (HMSI) సంస్థ. తాజాగా ఈ సంస్థ రాబోయే సంవత్సరాల్లో ఇండియన్ మార్కెట్లోకి తీసుకురానున్న బైక్స్(Bikes) గురించి తన ప్లాన్స్‌ను ప్రకటించింది. జపాన్‌లోని హోండా మోటార్ కంపెనీకి అనుబంధ సంస్థ అయిన హెచ్ఎంఎస్ఐ (HMSl) హర్యానాలోని మనేసర్ (Manesar) ప్లాంట్‌ను గ్లోబల్ రిసోర్స్ ఫ్యాక్టరీగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. అతిపెద్ద టూవీలర్ తయారీ సంస్థ అయిన హోండా (Honda) ఇప్పుడు ఫ్యూయల్-ఎఫిషియంట్ (Fuel-Efficient) ప్రొడక్ట్స్‌ను అభివృద్ధి చేయడం, ఎగుమతులు విస్తరించడం, ప్రొడక్ట్స్‌లో ఫ్లెక్స్-ఫ్యూయల్ (Flex Fuel) టెక్నాలజీని దశల వారీగా విలీనం, అమలు చేయడం కోసం ప్లాన్స్‌ను దూకుడుగా కొనసాగిస్తోంది.
భారతదేశంలోని మొత్తం టూవీలర్స్(Two Wheelers) వాహనాల అమ్మకాల్లో ఎంట్రీ-లెవల్(Entry level) మోటార్‌సైకిల్ కేటగిరీ గణనీయమైన వాటాను కలిగి ఉందని హోండా భావిస్తోంది. అందుకే కమ్యూటర్ విభాగంలో కొత్త లో-ఎండ్ మోటార్‌సైకిల్‌ను ప్రవేశ పెట్టడానికి హోండా రెడీ అయ్యింది. అంతేకాదు ఇది ఒక ఫ్లెక్స్-ఫ్యూయల్ కమ్యూటర్ మోటార్‌సైకిల్‌ను త్వరలో దేశంలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇండియాలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కమ్యూటర్ బైక్‌లను ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజన్‌లతో ప్రవేశపెట్టడానికి హోండా రెడీ అయినట్లు ఆ కంపెనీ తెలిపింది. ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజన్‌లతో వచ్చేవి పెట్రోల్, ఇథనాల్‌తో నడుస్తాయి. రైడర్లు ఈ రెండు ఫ్యూయల్స్‌లో ఏదో ఒకటి వాడి ఈ బైక్‌లను నడపొచ్చు.
వీటితో పాటు ఎలక్ట్రిక్ టూవీలర్స్ కూడా విడుదల చేయనున్నట్లు హోండా తెలిపింది. ఇతర అనుబంధ సంస్థల మద్దతుతో రాబోయే సంవత్సరాల్లో పలు రకాల ఈవీ మోడళ్లను పరిచయం చేసే ప్రణాళికలపై కూడా వర్క్ చేస్తున్నట్లు హెచ్ఎంఎస్ఐ తెలిపింది. ప్రస్తుతం, కంపెనీ తన ఈవీ మోడల్ లైనప్‌ను సిద్ధం చేయడానికి.. భారతదేశంలో మొత్తం పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోంది. భారతదేశంలో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజన్ పవర్డ్ మోటార్‌సైకిల్‌ను టీవీఎస్ మోటార్ కంపెనీ లాంచ్ చేసింది. దీని తర్వాత ఇప్పటివరకు ఏ కంపెనీ ఈ తరహా బైక్‌ను ఇండియాలో రిలీజ్ చేయలేదు. దీంతో హెచ్ఎంఎస్ఐ వీటిని లాంచ్ చేసే రెండో బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకోనుంది.
హెచ్ఎంఎస్ఐ మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ & సీఈఓ Atsushi Ogata తాజాగా మాట్లాడుతూ... “బలమైన స్వదేశీ మద్దతుతో పాటు హోండా గ్లోబల్ నైపుణ్యాలను ఉపయోగించడం ద్వారా, హెచ్ఎంఎస్ఐ భారతదేశంలో తన పరిధులను మరింత విస్తరింపజేస్తుంది. భవిష్యత్తులో ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీ, మల్టిపుల్ ఈవీ మోడల్స్ పరిచయం చేసేందుకు హెచ్ఎంఎస్ఐ సర్వం సిద్ధం చేస్తోంది. ఈ జర్నీ ఎగ్జైటింగ్ గా సాగబోతోంది. దేశీయ మార్కెట్లలో తన కొత్త ఫన్ మోడల్స్ వ్యాపారాన్ని పెంచుకుంటూనే లో-ఎండ్ మోటార్‌సైకిల్ విభాగంలోకి ప్రవేశించాలని హెచ్ఎంఎస్ఐ యోచిస్తోంది" అని అన్నారు.
ఈ సంస్థ తమ బిజినెస్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫర్ ఫ్యూచర్ అండ్ ఆల్టర్నేటివ్ మొబిలిటీ కార్యాచరణ కింద భారతదేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చడానికి హర్యానాలోని మనేసర్ ప్లాంట్‌ను గ్లోబల్ రిసోర్స్ ఫ్యాక్టరీగా మార్చడాన్ని లక్ష్యంగా పెట్టుకుందని కంపెనీ సీఈఓ పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Electric bike, Flex, Honda, Motorcycle, Two wheelers