Flex-Fuel Motorcycle: భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారులలో హోండా (Honda) మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (HMSI) ఒకటి. ఈ కంపెనీ ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్‌తో నడిచే మోటార్ సైకిల్‌ను లాంచ్ చేసే యోచనలో ఉంది. దీనికి సంబంధించి తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. బుధవారం ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ బయో ఫ్యూయల్ కాన్ఫరెన్స్‌లో దీని గురించి ప్రకటించారు హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అట్సుషి ఒగాటా. కనీసం ఒక ఫ్లెక్సీ-ఫ్యూయల్ మోటార్‌సైకిల్ మోడల్‌ను 2024 చివరి నాటికి లాంచ్ చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ ఇంజిన్‌తో బ్రాండ్‌లోని ఏ మోడల్‌ను లాంచ్ చేస్తారనే వివరాలను ఆయన వెల్లడించలేదు.
Gold Price Today: ధంతేరాస్‌కు 3 రోజుల ముందు శుభవార్త... తగ్గిన గోల్డ్ రేట్
* మొదటి కంపెనీ టీవీఎస్
కొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్‌ను రెండేళ్లలో లాంచ్ చేయనున్నట్లు హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో ఫ్లెక్స్ ఫ్యూయల్ విభాగంలో బైక్‌ను లాంచ్ చేయనున్న కంపెనీల జాబితాలో హోండా కూడా చేరింది. అంతకు ముందు ఇండియాలో టీవీఎస్ కంపెనీ ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్‌తో ‘RTR 200 Fi E100’ బైక్‌ను లాంచ్ చేసింది.
* ప్రపంచంలో హోండానే మొదటి కంపెనీ
TVS మోటార్ భారతదేశంలో ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్ పవర్డ్ టూ వీలర్‌ను విడుదల చేసిన మొదటి కంపెనీగా నిలిచింది. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ మోటార్ సైకిళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన కంపెనీగా హోంగా ఘనత సాధించింది. హోండా CG150 టైటాన్ మిక్స్ 2009లో బ్రెజిల్లో లాంచ్ అయింది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ మోటార్‌సైకిల్. అనంతరం NXR 150 Bros Mix, BIZ 125 Flex వంటి ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్ పవర్డ్ మోటార్‌సైకిళ్లను కూడా బ్రెజిల్లో హోండా లాంచ్ చేసింది.
Bank Loan: లోన్ తీసుకొని కారు కొనే వారికి ఈ బ్యాంక్ బంపరాఫర్లు!
* పెట్రోల్, ఇథనాల్‌తో నడిచే బైక్
ఇంతకుముందు ముందే ఫ్లెక్స్-ఫ్యూయల్ కమ్యూటర్ మోటార్‌సైకిల్‌పై పని చేస్తున్నట్లు హోండా కంపెనీ తెలిపింది. జపాన్‌కి చెందిన ఈ ద్విచక్ర వాహన తయారీదారు ఇప్పటికే బ్రెజిల్ వంటి ఇతర దేశాల్లో ఫ్లెక్స్-ఫ్యూయల్ మోటార్‌సైకిళ్లను విక్రయిస్తోంది. భారతదేశంలో ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్లతో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కమ్యూటర్ మోటార్‌సైకిళ్లను లాంచ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ విభాగంలో అందుబాటులోకి తీసుకురానున్న మోటార్‌సైకిళ్లు పెట్రోల్, ఇథనాల్‌తో నడుస్తాయని సమాచారం.
పర్యావరణ హిత, ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ బేస్డ్ ద్విచక్ర వాహనాలను లాంచ్ చేయాలని కేంద్రం సూచనలు చేస్తోంది. తాజా సదస్సులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రత్యేకంగా మాట్లాడారు. ఖరీదైన చమురు దిగుమతులను తగ్గించడానికి భారతదేశంలో ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలను లాంచ్ చేయాలని సూచించారు. ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు టయోటా క్యామ్రీ హైబ్రిడ్ మోడల్‌ను ఆవిష్కరించారు. ఇథనాల్-మిక్స్డ్ ఫ్యూయల్ వినియోగాన్ని పెంచాల్సిన అవసరాన్ని వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.