Bike Offers | ప్రస్తుతం పండుగ సీజన్ నడుస్తోంది. మీరు కొత్త బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తే మాత్రం ఇది మీకు మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకని అనుకుంటున్నారా? టూవీలర్లపై దీపావళి (Diwali) సందర్భంగా అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. పలు రకాల కంపెనీలు వివిధ రకాల ఆఫర్లు అందిస్తున్నాయి. హీరో (Hero Motocorp) మోటొకార్ప్ దగ్గరి నుంచి టీవీఎస్ వరకు దాదాపు అన్ని కంపెనీలు కూడా ఫెస్టివ్ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకోవాలని చూస్తున్నాయి.
ఇప్పుడు మనం హోండా కంపెనీ అందిస్తున్న ఆఫర్ల గురించి తెలుసుకుందాం. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా 2022 సెప్టెంబర్ నెలలో విక్రయాల పరంగా బిగ్గెస్ట్ టూవీలర్ తయారీ కంపెనీగా అవతరించింది. హీరో మోటొకార్ప్ను వెనక్కి నెట్టేసింది. ఇప్పుడు కంపెనీ ఇదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. అందుకే పండుగ సీజన్లో కస్టమర్లకు అదిరే ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది.
క్రెడిట్ కార్డు బిల్లు టైమ్‌కి కట్టకపోయినా ఏం కాదు.. ఈ రూల్ తెలుసుకోండి!
హోండా కంపెనీకి చెందిన మోస్ట్ పాపులర్ బైక్ షైన్ మోడల్‌పై అదిరే డీల్స్ అందుబాటులో ఉంచింది. కొత్త డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. హోండా షైన్ బైక్ కొనుగోలు చేసే వారికి రూ. 5 వేల వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. అంతేకాకుండా జీరో డౌన్ పేమెంట్ సదుపాయం పొందొచ్చు. ఇంకా నో కాస్ట్ ఈఎంఐ వంటి ఫైనాన్స్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఈ ఆఫర్ అక్టోబర్ 31వరకు అందుబాటులో ఉంటుంది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అదిరిపోయే శుభవార్త.. ఇకపై కస్టమర్లకు..
ఫెస్టివ్ సీజన్లో ఈ ఆఫర్ అందుబాటులోకి తీసుకురావడం వల్ల కంపెనీ అమ్మకాలు మరింత పెరుగుతాయని హోండా అంచనా వేస్తోంది. కమ్యూటర్ బైక్ విభాగంలో షైన్ దూసుకుపోతోంది. ఇందులో 124 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ మోటార్ ఉంటుంది. కంపెనీ ఈ బైక్‌లో ఐదు గేర్లను అమర్చింది. డైమండ్ ఫ్రేమ్, టెలీస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, డ్యూయెల్ స్ప్రింగ్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫ్రంట్‌లో డిస్క్ బ్రేక్ ఉంటుంది. వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ ఉంటుంది. దీని ధర రూ. 78,414 నుంచి ప్రారంభం అవుతోంది. ఇది ఎక్స్‌షోరూమ్ రేటు. గరిష్ట రేటు రూ. 83,914గా ఉంది. ఇకపోతే ఆఫర్ అనేది డీలర్షిప్, ప్రాంతం, వేరియంట్ ప్రాతిపదికన మారొచ్చు. అందువల్ల దగ్గరిలోని షోరూమ్‌కు వెళ్లి ఆఫర్ వివరాలు పూర్తిగా తెలుసుకోండి. ఇకపోతే ఫైనాస్ స్కీమ్స్ అనేవి కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకున్న ఎన్బీఎఫ్సీలు, బ్యాంకుల ప్రాతిపదికన మారతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bike, Diwali, Honda, Latest offers, SCOOTER