భారతదేశం (India)లో ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్స్ (Bikes) అందుబాటులోకి వచ్చి బాగా పాపులర్ అయ్యాయి. ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు (Electric Auto rickshaws) కూడా రిలీజ్ అయ్యాయి. కానీ ఇవి అంతగా పాపులర్ కాలేదు. ఇందుకు కారణాలు అవి ఫుల్ ఛార్జ్‌పై అందించే రేంజ్, ఛార్జింగ్ టైమ్ అని చెప్పవచ్చు. ప్రజా రవాణా చేసే ఈ వాహనాలు ఏ సమయంలోనూ ఆగకుండా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఛార్జింగ్ అయిపోతే మళ్లీ రీఛార్జ్ చేయడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. దీనివల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవు. అయితే ఇలాంటి సమస్యకు తాజాగా జపాన్‌కు చెందిన ప్రముఖ వాహనాల తయారీ సంస్థ (Honda) పరిష్కారం చూపుతోంది. ఎలక్ట్రిక్ రిక్షాల కోసం బ్యాటరీ షేరింగ్ సర్వీస్ (Battery Sharing Service)ను ఇండియాలో తీసుకురావాలని యోచిస్తున్నట్లు హోండా కంపెనీ మంగళవారం ప్రకటించింది. ఈ ఏడాది చివరి నాటికి భారతదేశంలో ఈ సేవలను లాంచ్ చేయాలని భావిస్తున్నట్లు పేర్కొంది.
బ్యాటరీ షేరింగ్ సర్వీస్ అందుబాటులోకి వస్తే.. ఆటోరిక్షా డ్రైవర్లు సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్‌కి వెళ్లి ఛార్జింగ్ తక్కువగా ఉన్న లేదా పూర్తిగా ఛార్జింగ్ అయిపోయిన తమ బ్యాటరీని అందించి ఫుల్ ఛార్జింగ్ ఉన్న బ్యాటరీని తీసుకోవచ్చు. తద్వారా వారికి సమయం అసలు వృథా కాదు. అలాగే వారి వాహనం కంటిన్యూగా వర్కింగ్లోనే ఉంటుంది.
"ఇండియాలో 2022 చివరి నాటికి ఎలక్ట్రిక్ ట్రైసైకిల్ ట్యాక్సీలు (ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు) కోసం బ్యాటరీ షేరింగ్ సర్వీస్‌ను ప్రారంభించాలని హోండా యోచిస్తోంది," అని కంపెనీ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. హోండా సంస్థ ఇతర ఆసియా దేశాల్లో కూడా బ్యాటరీ షేరింగ్ సర్వీస్‌ను పాపులర్ చేయాలని.. ఈ మేరకు తన కార్యక్రమాలను విస్తరించాలని యోచిస్తోంది.
ఇటీవల యూరప్‌లోని బ్యాటరీ కన్సార్టియంలో పాల్గొన్న హోండా కంపెనీ స్వాపబుల్ బ్యాటరీలను ఒక స్టాండర్డ్‌గా తీసుకురావడానికి భారత్‌లోని ఓ పార్ట్నర్ కంపెనీతో కలిసి పని చేస్తున్నామని తెలిపింది. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు, ఇతర స్మాల్-సైజు ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రొడక్ట్స్ ఈ పద్ధతిని ఫాలో అయ్యేందుకు హోండా ఇప్పటికే స్వాపబుల్ బ్యాటరీస్ మోటార్‌సైకిల్ కన్సార్టియం (SBMC) ఏర్పాటు చేసింది. ఈ కన్సార్టియంలో భాగంగా బ్యాటరీ చార్జింగ్ సర్వీస్ తీసుకొస్తోంది. ఇక ఈ కంపెనీ ఎలక్ట్రిక్ టూవీలర్స్ తీసుకొచ్చే స్ట్రాటజీని కూడా వెల్లడించింది.
ఇది కూడా చదవండి : రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు రుణం.. 5-10 నిమిషాల్లో అకౌంట్లోకి డబ్బులు!
2050 నాటికి తన అన్ని ప్రొడక్ట్స్, కార్పొరేట్ యాక్టివిటీస్ కార్బన్ న్యూట్రాలిటీని చేరుకోవాలనే లక్ష్యంలో భాగంగా ఒక వ్యూహం రచిస్తోన్నట్లు కంపెనీ తెలిపింది. ఆ వ్యూహంలో భాగంగా 2023 నాటికి భారతదేశంలో ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్ మోడల్స్ విడుదల చేయనుంది. అలానే 2025లోగా ప్రపంచవ్యాప్తంగా 10 లేదా అంతకంటే ఎక్కువ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మోడళ్లను పరిచయం చేయనుంది.
రాబోయే ఐదేళ్లలో ఎలక్ట్రిక్ మోడళ్ల యాన్యువల్ సేల్స్‌ను ఒక మిలియన్ యూనిట్లకు పెంచాలని.. 2030 నాటికి యాన్యువల్ సేల్స్‌ను 3.5 మిలియన్ యూనిట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హోండా వెల్లడించింది. భారతదేశంలో ప్రభుత్వ సబ్సిడీలు, పెట్రో ధరల మంటలు వల్ల చాలామంది ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేస్తున్నారు. దాంతో ఇండియన్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ భారీగా విస్తరిస్తోంది. ఇలాంటి మార్కెట్లో ప్రతి కస్టమర్ అవసరాలకు అనుగుణంగా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను హోండా పరిచయం చేయడానికి సిద్ధమైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto, Battery, Electric Vehicles