హోమ్ /వార్తలు /బిజినెస్ /

Honda: ఇండియాలో నెం.1 టూ వీలర్ బ్రాండ్‌గా హోండా

Honda: ఇండియాలో నెం.1 టూ వీలర్ బ్రాండ్‌గా హోండా

 Honda

Honda

ఇప్పటి వరకు టూవీలర్ అమ్మకాల్లో టాప్ ప్లేస్‌లో ఉన్న హీరో మోటో‌కార్ప్ (Hero MotoCorp) స్థానాన్ని హోండా మోటార్స్ భర్తీ చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

భారత్‌లో మోటార్ సైకిళ్ల అమ్మకాల్లో హోండా మోటార్ సైకిల్ & స్కూటర్ ఇండియా (Honda Motorcycle & Scooter India) దూసుకుపోతోంది. సెప్టెంబర్ నెలలో రికార్డు స్థాయి బైక్ సేల్స్‌తో భారతదేశంలో నెంబర్ వన్ టూవీలర్ బ్రాండ్‌గా అవతరించింది. ఇప్పటి వరకు టూవీలర్ అమ్మకాల్లో టాప్ ప్లేస్‌లో ఉన్న హీరో మోటో‌కార్ప్ (Hero MotoCorp) స్థానాన్ని హోండా మోటార్స్ భర్తీ చేసింది. వాహన్ పోర్టల్(Vaahan Portal)లో లభించిన సమాచారం ప్రకారం సెప్టెంబర్‌లో హోండా మోటార్స్ 2,85,400 యూనిట్ల టూవీలర్ సేల్స్ నమోదు చేయగా, హీరో కంపెనీ 2,51,939 యూనిట్లను మాత్రమే అమ్మగలిగింది. గత నెల అమ్మకాల్లో హోండా సంస్థ పైచేయి సాధించింది.

హీరో, హోండా సంస్థలు భాగస్వామ్యం నుంచి 2011లో విడిపోయిన సంగతి తెలిసిందే. అలా ఒకప్పుడు భాగస్వాములుగా ఉన్న రెండు కంపెనీలు ప్రత్యర్థులుగా మారి మార్కెట్‌లో పోటీ పడుతున్నారు. అయితే ఉత్తరాది రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ , బిహార్, జార్ఖండ్‌లో హీరో మోటోకార్ప్ వెహికల్స్‌కు మంచి మార్కెట్ ఉంది. కానీ, ఇటీవల కాలంలో అక్కడ సేల్స్ పడిపోయాయి. ఆ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో హీరో వాహనాలు గతంలో బాగా అమ్ముడుపోయాయి. కాగా, ఈ సారి కంపెనీ మంత్ టు మంత్ సేల్స్ తగ్గిపోయినట్లు బిజినెస్ స్టాండర్డ్ తెలిపింది.

ఆ రాష్ట్రాల్లో తగ్గిన అమ్మకాలు

పవన్ ముంజల్ ఆధ్వర్యంలో నడుస్తున్న హీరో మోటోకార్ప్ ఆగస్టు నెలలో 3,04,713 యూనిట్ల సేల్స్ నమోదు చేసింది. కాగా, సెప్టెంబర్ నెలలో మాత్రం హీరో సేల్స్ 50,000 యూనిట్లు తగ్గాయి. ఉత్తరప్రదేశ్‌లో 36 శాతం, బీహార్‌లో 24 శాతం, జార్ఖండ్‌లో 21 శాతం హీరో వెహికల్ సేల్స్ తగ్గినట్లు పేర్కొంది.

ED Raids : ఢిల్లీ లిక్కర్ స్కామ్..హైదరాబాద్ సహా 35 చోట్ల ఈడీ సోదాలు..టైం వేస్ట్ అన్న కేజ్రీవాల్

స్కూటర్ మార్కెట్‌లో హోండా సత్తా

మార్కెట్‌లో హోండా సత్తా చాటడానికి కారణం, కంపెనీ నుంచి వచ్చిన స్కూటర్లకు మార్కెట్ పెరగడం అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. జపనీస్ కంపెనీ హోండా 2021 ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య 6,95,388 స్కూటర్ల అమ్మకాలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అదే కాలంలో 1,062,943 యూనిట్ల స్కూటర్లను అమ్మి అగ్రగామిగా నిలిచింది. అలా హోండా సంస్థ ఇయర్ టూ ఇయర్ గ్రోత్ 52 శాతం సాధించడం విశేషం. అయితే హీరో స్కూటర్ల అమ్మకాల్లో అంతటి గ్రోత్ కనిపించడం లేదు.

మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌లో హోండా 40.96 శాతం ఇయర్ ఓవర్ ఇయర్(YoY) గ్రోత్ నమోదు చేసుకుంది. 2021లో ఏప్రిల్ - ఆగస్టు మధ్య 5,37,851 యూనిట్ల అమ్మకాలు జరగగా, 2022లో అదే కాలానికి 7,58,157 యూనిట్ల సేల్స్ లిస్ట్ అయ్యాయి. ఇక హీరో మోటోకార్పొ విషయానికొస్తే.. మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌లో ఈ సంస్థ 23.53 శాతం ఇయర్ ఓవర్ ఇయర్(YoY) గ్రోత్ నమోదు చేసింది. 2021లో ఏప్రిల్-ఆగస్టు మధ్య 2,073,583 యూనిట్లు సేల్ చేయగా, ఈ ఏడాది అదే కాలానికి 16,78,605 యూనిట్ల సేల్స్ నమోదు చేసింది.

 పోటీలో హీరో మోటోకార్ప్ దూకుడు

మార్కెట్‌లో తాజాగా కోల్పోయిన తన స్థానాన్ని నిలుపుకునేందుకు హీరో మోటోకార్ప్(HMCL) సిద్ధమవుతుంది. సరికొత్త బైక్స్ ప్రవేశపెట్టి మళ్లీ టాప్ ప్లేస్‌కు చేరాలనుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే న్యూ ఎక్స్‌ట్రీమ్(Xtreme 160 R Stealth 2.0) ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ.1.30 లక్షలు(ఎక్స్-షో రూమ్). టూవీలర్ల అమ్మకాలు పెంచేందుకు సరికొత్త ప్రణాళికలతో ముందుకు వస్తామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

First published:

Tags: Hero moto corp, Honda, Two wheelers

ఉత్తమ కథలు