హోమ్ /వార్తలు /బిజినెస్ /

Honda Cars Recall: ఐదు లక్షల హోండా కార్లు రీకాల్.. ఆ మోడల్స్ కొన్నవారికి కంపెనీ హెచ్చరిక!

Honda Cars Recall: ఐదు లక్షల హోండా కార్లు రీకాల్.. ఆ మోడల్స్ కొన్నవారికి కంపెనీ హెచ్చరిక!

Honda Cars Recall: ఐదు లక్షల హోండా కార్లు రీకాల్.. ఆ మోడల్స్ కొన్నవారికి కంపెనీ హెచ్చరిక!

Honda Cars Recall: ఐదు లక్షల హోండా కార్లు రీకాల్.. ఆ మోడల్స్ కొన్నవారికి కంపెనీ హెచ్చరిక!

Honda Cars Recall: హోండా (Honda) భారీ ఎత్తున కొన్ని మోడల్ కార్లను రీకాల్ చేస్తోంది. ఫ్రంట్ సీటు బెల్టుల్లో ఉన్న సమస్య కారణంగా ఈ సంస్థ సుమారు ఐదు లక్షల వాహనాలను రీకాల్ చేస్తోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఈ మధ్యకాలంలో ఆటోమొబైల్ కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉన్న కార్లను పెద్ద ఎత్తున రీకాల్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాయి. తమ కస్టమర్ల శ్రేయస్సే తమకు ముఖ్యమని తక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. వీలైనంత త్వరగా రిపేర్లు కూడా చేస్తున్నాయి. అయితే తాజాగా దిగ్గజ కార్ల తయారీదారు హోండా (Honda) భారీ ఎత్తున కొన్ని మోడల్ కార్లను రీకాల్ చేస్తోంది. ఫ్రంట్ సీటు బెల్టుల్లో ఉన్న సమస్య కారణంగా ఈ సంస్థ యునైటెడ్ స్టేట్స్, కెనడాలో సుమారు ఐదు లక్షల వాహనాలను రీకాల్ చేస్తోంది. ఈ సమస్య ఉన్న మోడల్స్‌లో CR-V 2017- 2020 మోడల్ కార్లు.. అకార్డ్ 2018, 2019 మోడల్స్.. ఒడిస్సీ 2018, 2019, 2020 మోడల్స్, ఇన్‌సైట్ 2019 మోడల్, 2019-2020 అక్యురా RDX వంటి కొన్ని బెస్ట్ సెల్లింగ్ కార్లు ఉన్నాయి.

సాధారణంగా కార్లలో సీట్‌బెల్ట్ క్లిప్‌ను చొప్పించే భాగాన్ని ఒక మెటీరియల్ కవర్ చేస్తుంటుంది. ఇది సరిగా ఉంటేనే సీట్ బెల్ట్ బిగించడం సాధ్యమవుతుంది. అయితే U.S. సేఫ్టీ రెగ్యులేటర్స్ విడుదల చేసిన డాక్యుమెంట్స్‌ ప్రకారం, రీకాల్ చేసిన హోండా కార్లలోని ఆ మెటీరియల్ కొంత సమయం తర్వాత పాడైపోతుంది. ఫలితంగా సీట్‌బెల్ట్ రిలీజ్ బటన్ కుంచించుకుపోతుంది. అది ఛానెల్‌/చొప్పించే పార్ట్‌లో చిక్కుకుపోతుంది. అప్పుడు సీట్ బెల్ట్‌ను బిగించడం కష్టంగా లేదా అసాధ్యంగా మారుతుంది.

సీట్ బెల్ట్ కట్టు (Buckle) సరిగ్గా పట్టుకోకపోతే, ప్రమాద సమయంలో డ్రైవర్లు లేదా ప్రయాణికులు సీటుకు అతుక్కుపోయి ఉండరు. దీనివల్ల వారు కారులో చెల్లా చెదురుగా పడిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా వారు తీవ్రంగా గాయపడే అవకాశం ఉంది. అయితే, ఈ సమస్య కారణంగా గాయపడినట్లు ఎలాంటి నివేదికలు అందలేదని హోండా పేర్కొంది.

అవసరమైతే సమస్యను పరిష్కరించడానికి, హోండా ఫ్రంట్ సీట్ బెల్ట్ బకిల్ రిలీజ్ బటన్లు లేదా బకిల్ అసెంబ్లీలను భర్తీ చేస్తుంది. ప్రభావిత వాహనాల యజమానులు ఏప్రిల్ 17 నుంచి నోటిఫికేషన్ లెటర్స్ అందుకుంటారు. రిపేర్ అపాయింట్‌మెంట్ షెడ్యూల్ కోసం వారి స్థానిక డీలర్‌షిప్‌ను సంప్రదించవలసిందిగా వారికి కంపెనీ సూచిస్తుంది.

ఇది కూడా చదవండి : జాబ్‌ మారినప్పుడు PF అకౌంట్‌ మెర్జ్‌ చేశారా? లేకపోతే ఈ సమస్యలు తప్పవు!

ఇక హోండా ఇటీవలే ఇండియన్ మార్కెట్లో సిటీ సెడాన్ ఫేస్‌లిఫ్ట్‌ను మంచి చేసింది. కొత్త SUVని కూడా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది, ఇది ఈ సంవత్సరం పండుగ సీజన్‌లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

కొత్త సిటీ మాదిరిగానే, అప్‌కమింగ్ హోండా SUV డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌తో పాటు లేన్ వాచ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మొదలైన ఫీచర్లతో వస్తుందని సమాచారం. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ EV మార్కెట్‌ను ఉపయోగించుకునేందుకు, హోండా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్లను కూడా పరిచయం చేయనుంది. అయితే, ఎలక్ట్రిక్ కార్ల వివరాలను హోండా ఇంకా వెల్లడించలేదు.

First published:

Tags: Auto, Cars, Honda

ఉత్తమ కథలు