Honda Car Recall: ఏకంగా 7,61,000 వాహనాలు వెనక్కి పిలిపించిన హోండా.. కారణమేంటో తెలుసా?

Honda Car Recall: ఏకంగా 7,61,000 వాహనాలు వెనక్కి పిలిపించిన హోండా.. కారణమేంటో తెలుసా?

Honda Car Recall | వాహనంలో ఫ్యూయెల్ పంప్‌లో సమస్యలు ఉండటంతో హోండా 7,61,000 కార్లను వెనక్కి తీసుకుంది.

  • Share this:
సాధారణంగా కార్ల కంపెనీలు ఒక మోడల్‌ని విడుదల చేసినప్పుడు అందులో ఏవైనా లోపాలు ఎదురైతే వాటిని రీకాల్ చేసి.. తిరిగి ఆ లోపాలున్న భాగాలను మంచి భాగాలతో రిప్లేస్ చేసి యజమానులకు అప్పగిస్తుంటారు. అలా తాజాగా తరచూ పాడవుతున్న ఫ్యూయ‌ల్ పంప్‌ల‌ను మార్చ‌డానికి.. అలాగే ఈ పంపుల వ‌ల్ల ఇంజిన్ స‌మ‌స్య‌లు రాకుండా ఉండ‌టానికి హొండా కంపెనీ అమెరికాలోని 761,000 వాహ‌నాల‌ను రీకాల్ చేసింద‌ని హోండా మోటార్ కో వెల్ల‌డించింది. నేష‌న‌ల్ హైవే సేఫ్టీ అడ్మినిస్ట్రేష‌న్ వివరించిన దాని ప్ర‌కారం హోండా సంస్థ ఇలా ఉత్పత్తుల్లో లోపం వల్ల కార్లను రీకాల్ చేయడం ఇది మొదటిసారేమీ కాదు. అమెరికాలో 628,000 వాహనాల‌ను కూడా విక్ర‌యించారు. అయితే.. ఇలాంటి ఫ్యూయ‌ల్ పంపుల కారణంగా ఎలాంటి ప్ర‌మాదాలు, గాయాలు అయిన‌ట్లు ఇప్ప‌టివ‌ర‌కూ హోండా కంపెనీకి ఎలాంటి స‌మాచార‌మూ లేదు. వీటి గురించి ఇప్పటివరకూ ఎలాంటి ఫిర్యాదులు అందలేదట. కానీ వాటిలోని లోపాల గురించి కంపెనీ గుర్తించి వాటిని రీకాల్ చేసింది.

Realme 8 Pro: రూ.17,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.1,499 ధరకే కొనండి... ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వివరాలివే

PAN Aadhaar Link Status: మీ పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ అయిందా? ఒక్క నిమిషంలో తెలుసుకోండిలా

తాజాగా చేసిన ఈ రీకాల్‌లో ఆక్యూరా (Acura), హోండా (Honda) రెండింటికీ సంబంధించిన మోడ‌ల్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని 2019 మోడ‌ళ్లే. మిగ‌తా వాటిని 2020 మోడ‌ళ్లుగా కొన‌సాగిస్తున్నారు. ఆక్యూరా నుంచి ఐఎల్ ఎక్స్‌, ఎమ్ డి ఎక్స్‌, ఎమ్ డి ఎక్స్ స్పోర్ట్ హైబ్రీడ్‌, ఆర్ డి ఎక్స్‌, టిఎల్ ఎక్స్ లాంటి కొన్ని మోడ‌ళ్లు ఉన్నాయి. ఇక హోండా కార్లలోనూ కొన్నింటికి ఈ రీకాల్ వ‌ర్తిస్తుంది. వాటిలో అక్క‌ర్డ్ (హైబ్రీడ్‌తో క‌లిపి), సివిక్ (కౌప్‌, సిడెన్‌, హ్య‌చ్‌బ్యాక్ కాకుండా ఎస్ ఐ, టైప్ ఆర్‌తో కూడా క‌లిపి), ఇంకా ఫిట్‌, హెచ్ ఆర్ -వి, ఒడిస్సి, పాస్‌పోర్ట్, పైలెట్, రిడ్జ్‌లైన్‌. చివ‌రిగా 2018-19 మోడ‌ళ్ల‌లో కొన్ని హోండా సిఆర్‌-వి మోడ‌ళ్లు కూడా ఉన్నాయి.

Mashak Rakshak Policy: దోమల కారణంగా అనారోగ్యం పాలవుతున్నారా? రేపటి నుంచి ప్రత్యేక హెల్త్ పాలసీ

New Rules from April 1: సామాన్యులకు అలర్ట్... రేపటి నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే

ఒక సంవ‌త్స‌రం ముందు కూడా ఇలాగే అమెరికాలో ఫ్యూయ‌ల్ పంప్ ‌ల విష‌యంలో లోపాలను గమనించి.. 136,057 వాహ‌నాల‌ను హోండా రీకాల్ చేసింది. బ‌హుశా తాజాగా చేసిన రీకాల్‌లో పాత‌వి కొన్ని క‌లిసుండొచ్చు కూడా. 2019లో కూడా ఈ సంస్థ రెండు సార్లు కార్లు రీకాల్ చేసింది. ఇందులో అర మిలియ‌న్ వాహ‌నాల‌దాకా క‌వ‌ర్ అయ్యాయి. ఫ్యుయల్ పంప్‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల వ‌ల్ల వీటిని రీకాల్ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ సంస్థ తరచూ తమ మోడల్స్ ని రీకాల్ చేస్తూనే ఉంది కాబట్టి ఎక్కువ మంది యజమానులు ఈ సంస్థ వాహనాలు కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ రీకాల్ కి సంబంధించిన సమాచారం మీకు అందాలన్నా.. మీ వాహనం కూడా అందులో భాగమా? లేదా? తెలియాలన్నా ఈ కార్లు ఉన్న వారంతా హోండా రీకాల్ వెబ్ సైట్ లో VIN తో రిజిస్టర్ అవ్వడం మంచిది.
Published by:Santhosh Kumar S
First published: