కొత్త కారు కొనేవారికి గుడ్‌న్యూస్(Good News) చెప్పింది హోండా కార్స్ ఇండియా. మార్చి నెలలో హోండా కార్లు కొనేవారి కోసం అదిరిపోయే డిస్కౌంట్లు ప్రకటించింది. 2022 కొత్త ఏడాది ప్రారంభం నుంచి హోండా కార్స్ ఇండియా తన కార్ల మోడళ్లపై బ్యాక్ టు -బ్యాక్ డిస్కౌంట్లను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. జనవరి 2022లో సిటీ, అమేజ్ మోడళ్లపై భారీ డిస్కౌంట్(Discount), బోనస్‌లను(Bonus) అందించింది. ఫిబ్రవరిలో కూడా దాదాపు ఇలాంటి ఆఫర్లనే ప్రకటించింది. ఇప్పుడు మార్చి ప్రారంభంలోనే పలు హోండా(Honda) మోడళ్లపై రూ. 35,596 వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, లాయల్టీ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్ల(Corporate Discount) రూపంలో డిస్కౌంట్లను అందిస్తోంది. అయితే, ఈ ఆఫర్లు గ్రేడ్, వేరియంట్, లొకేషన్ బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి, ఆఫర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలకు కస్టమర్లు తమ సమీప డీలర్షిప్ సెంటర్లను సంప్రదించాలని హోండా కంపెనీ కస్టమర్లకు సూచించింది.
హోండా సిటీ సెడాన్ వేరియంట్లపై..
కాగా, అన్ని ఆఫర్లు మార్చి 31, 2022 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని కంపెనీ తెలిపింది. హోండా 4వ జనరేషన్ సెడాన్ సిటీ పెట్రోల్ వేరియంట్‌పై మొత్తం రూ. 20,000 డిస్కౌంట్ పొందవచ్చు. హోండా కస్టమర్లు అదనంగా రూ. 5,000 లాయల్టీ బోనస్‌ను పొందవచ్చు. అలాగే రూ. 7000 హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. మరోవైపు, రూ. 8,000 కార్పొరేట్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంటుంది.
కాగా, 5వ జనరేషన్ హోండా సిటీ సెడాన్ వేరియంట్‌పై గరిష్టంగా రూ. 35,596 వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్లో భాగంగా రూ. 10,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 10,596 వరకు విలువైన FOC యాక్సెసరీలను అందిస్తుంది. అదనంగా, రూ. 5,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 8,000 కార్పొరేట్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంటుంది. హోండా యజమానులు తమ పాత కారును ఎక్స్చేంజ్ చేస్తే రూ. 5,000 వరకు లాయల్టీ బోనస్, రూ. 7,000 వరకు హోండా ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు.
హోండా డబ్ల్యూఆర్వీ, అమేజ్ మోడళ్లపై..
అదే సమయంలో, హోండా సబ్ కాంపాక్ట్ క్రాస్ఓవర్ ఎస్యూవీ హోండా WR-V మోడల్‌పై కూడా భారీ తగ్గింపు పొందవచ్చు. దీనిపై రూ. 10,000 విలువైన ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ అందిస్తోంది. మరోవైపు, రూ. 7,000 బోనస్‌తో పాటు రూ. 5,000 లాయల్టీ బోనస్‌ను కూడా పొందవచ్చు. వీటికి అదనంగా రూ.4,000 కార్పొరేట్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంటుంది. హోండా జాజ్ని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్ లేదా రూ. 12,158 వరకు విలువైన ఎఫ్ఓసి యాక్సెసరీలు లభిస్తాయి.
అదనంగా, రూ. 5,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ. 4,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. హోండా యజమానులకు అదనంగా రూ. 5,000 లాయల్టీ బోనస్‌తో పాటు రూ. 7,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇక, హోండా తన అమేజ్ మోడల్‌పై కూడా భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ మోడల్‌పై మొత్తం రూ. 15,000 వరకు ఆదా చేసుకోవచ్చు. హోండా యజమానులకు రూ. 5,000 లాయల్టీ బోనస్, రూ. 6,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. అదనంగా, రూ. 4000 కార్పొరేట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.