హోమ్ /వార్తలు /బిజినెస్ /

Honda Activa: హోండా నుంచి కొత్త యాక్టివా 125 H-స్మార్ట్ స్కూటర్.. దీని ఫీచర్స్‌ అదుర్స్‌ అంతే..

Honda Activa: హోండా నుంచి కొత్త యాక్టివా 125 H-స్మార్ట్ స్కూటర్.. దీని ఫీచర్స్‌ అదుర్స్‌ అంతే..

Honda Activa: హోండా నుంచి కొత్త యాక్టివా 125 H-స్మార్ట్ స్కూటర్..

Honda Activa: హోండా నుంచి కొత్త యాక్టివా 125 H-స్మార్ట్ స్కూటర్..

Honda Activa: హోండా కంపెనీ ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ మోడల్స్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. లేటెస్ట్‌గా H-స్మార్ట్ సిరీస్‌లో హోండా యాక్టివా 125 H-స్మార్ట్ (Honda Activa 125 H-Smart) స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించిన అప్‌డేట్స్‌ ఇవే..

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

హోండా (Honda) సంస్థ నుంచి బైక్‌ ప్రియులకు అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చింది. అతిపెద్ద ద్విచక్రవాహన సంస్థ అయిన హోండా ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ మోడల్స్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. లేటెస్ట్‌గా H-స్మార్ట్ సిరీస్‌లో హోండా యాక్టివా 125 H-స్మార్ట్ (Honda Activa 125 H-Smart) స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించిన అప్‌డేట్స్‌ ఇవే..

* పోస్టర్‌లో ఏముంది?

రిమోట్ కీ వంటి అదిరిపోయే ఫీచర్లతో అప్‌డేట్ చేసిన సరికొత్త Activa 6G లక్షలాది మంది కస్టమర్ల హృదయాలను గెలుచుకుంది. అంతకుమించిన ఫీచర్లతో ఇప్పుడు భారత్‌ మార్కెట్‌లోకి Activa 125 H-Smart లాంచ్‌ చేసేందుకు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన విషయాలను అధికారికంగా చెప్పకపోయినా పోస్టర్లో బైక్‌ ఫీచర్లు చూపించి ఆకట్టుకుంటోంది. కంపెనీ షేర్ చేసిన ఫొటోస్‌లో స్కూటర్ ఇంధన సామర్థ్యం, మైలేజ్, ఆర్‌పీఎం వంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్‌ తెలుసుకోవచ్చు. పుష్ స్టార్ట్ బటన్, స్మార్ట్‌ ఫైండ్‌ ఫీచర్‌ వంటి టాప్-క్లాస్ ఫీచర్లను ఇందులో అందిస్తున్నట్లు తెలుస్తోంది.

* స్మార్ట్‌ ఫీచర్లు

యాక్టివా 125 హెచ్-స్మార్ట్ ఎలక్ట్రానిక్ కీ స్పెసిఫికేషన్‌తో వస్తుంది. ఇండికేటర్‌ ఫీచర్‌తో మీ బైక్‌ ఎక్కడ ఉందో ఈజీగా తెలుసుకోవచ్చు. పెద్ద పార్కింగ్‌ ఏరియాల్లో బండి పెట్టినప్పుడు దాన్ని వెతుక్కోవడం చాలా కష్టం. ఈ ఫీచర్‌తో వెంటనే తెలుసుకోవచ్చు. ఇందులో స్మార్ట్‌ స్టార్ట్‌ ఫీచర్‌ ఉంది. అంటే బైక్‌లో కీ పెట్టకుండానే స్టార్ట్‌ చేయవచ్చు.

యాక్టివా 125 హెచ్-స్మార్ట్‌లో స్మార్ట్‌ అన్‌లాక్ ఫీచర్‌ కూడా ఉంది. ఇది రైడర్‌కు ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్‌ను అన్‌లాక్ చేయడం, హ్యాండిల్‌ను అన్‌లాక్ చేయడం, అండర్-సీట్ స్టోరేజ్‌ను అన్‌లాక్ చేయడంలో సహాయపడుతుంది. దీని స్మార్ట్‌ సేఫ్‌ ఫీచర్‌తో బండిలో కీ పెట్టకుండానే ఈ పనులన్నీ చేయచ్చు. రియల్ టైమ్ మైలేజ్, ఫ్యుయల్‌ ట్యాంకు, సగటు మైలేజీ చూసుకునేందుకు స్మార్ట్‌ డిస్‌ప్లే ఉంటుంది.

* ధర వివరాలు

ఇన్ని ఫీచర్లు ఉన్నాయి కాబట్టి మిగిలిన వాటికంటే ఎక్కువ ధరే ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం యాక్టివా 125 మూడు వేరియేషన్లలో దొరుకుతోంది. డ్రమ్, అల్లాయ్, డిస్క్ వేరియంట్లు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. అయితే వీటిలో డ్రమ్‌ సిరీస్‌ ప్రారంభ ధర రూ.77,743 ఉంది. అల్లాయ్ ధర రూ.81,411, ఉండగా డిస్క్ ధర రూ.81,611 నుంచి రూ.84,916 మధ్య ఉంది. ప్రస్తుత టాప్-ఎండ్ వేరియంట్ (డిస్క్) ఆధారంగా రూ.10,000 నుంచి రూ.15,000 వరకు ఎక్కువ ధర ఉండే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

First published:

Tags: Auto, Honda, Honda Activa