Splendor | స్కూటర్ అనగాన హోండా గుర్తుకు వస్తుంది. ఎందుకంటే హోండా యాక్టివా బెస్ట్ సెల్లింగ్ స్కూటర్‌గా రికార్డ్‌కు ఎక్కింది. దేశీ మార్కెట్‌లో ఈ స్కూటర్‌ను (Scooter) కొట్టే స్కూటర్ ఇంకొకటి లేదు. జనాలు ఎక్కువగా ఈ స్కూటర్‌నే కొనుగోలు చేస్తున్నాయి. దీనికి పోటీగా హీరో (Hero) కంపెనీ కొత్త స్కూటర్‌ను లాంచ్ చేసింది. Xoom పేరుతో కొత్త స్కూటర్‌ను తెచ్చింది. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. లుక్ కూడా అదిరింది. ధర కూడా అందుబాటులోనే ఉంది. ఇలా హీరో కంపెనీ హోండాకు కౌంటర్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు.
అయితే ఇప్పుడు హోండా కూడా హీరోకు ఝలక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. హీరో బెస్ట్ సెల్లింగ్ బైక్‌గా స్ల్పెండర్ కొనసాగుతూ వస్తోంది. దేశంలోనే ఎక్కువగా సేల్ అవుతున్న టూవీలర్ ఇదే. దీని అమ్మకాలు ప్రతి నెలా ఏకంగా 2 లక్షల యూనిట్లకు పైగానే ఉంటాయి. అందుకే ఇది బెస్ట్ సెల్లింగ్‌గా కొనసాగుతూ వస్తోంది. దీన్ని టచ్ చేసే బైక్ మరొకటి లేదు. దీని దరిదాపుల్లో కూడా మరో బైక్ లేకపోవడం గమనార్హం.
ఎఫ్‌డీలపై 8 శాతానికి పైగా వడ్డీ అందిస్తున్న 5 బ్యాంకులు ఇవే!
హోండా కంపెనీ ఇప్పుడు స్ల్పెండర్‌కు పోటీగా కొత్త బైక్ తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. 110 సీసీ విభాగంలో కొత్త బైక్ లాంచ్ చేయడానికి రెడీ అవుతోందని నివేదికలు పేర్కొంటున్నాయి. త్వరలోనే హోండా కంపెనీ కొత్త బైక్‌ను లాంచ్ చేయబోతోందని తెలియజేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు చూస్తే.. కంపెనీ నుంచి ఇలాంటి బైక్‌పై అధికారిక ప్రకటన లేదు.
వడ్డీ రేట్లు పెంచిన ప్రైవేట్ బ్యాంక్.. కస్టమర్లకు గుడ్ న్యూస్!
కాగా హోండా కంపెనీ నుంచి మార్కెట్‌లో అందుబాటులో ఉన్న టూవీలర్లలో చూస్తే.. హోండా షైన్‌ను డిమాండ్ ఉంది. అయితే స్ల్పెండర్ బైక్‌కు ఉన్నంత డిమాండ్ మాత్రం లేదు. అందుకే కంపెనీ స్ల్పెండర్ టార్గెట్‌గా కొత్త మోడల్ లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. హోండా కంపెనీ సీడీ 110 పేరుతో ఒక టూవీలర్‌ను ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉంచింది. అయితే ఇది స్ల్పెండర్‌కు పోటీ ఇచ్చేంత స్థాయిలో లేదు.
అందుకు మరో కొత్త బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. కంపెనీ కొత్తగా మార్కెట్‌లోకి తీసుకురాబోయే కొత్త మోడల్ ధర కూడా అందుబాటులో ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. దీని ధర రూ. 75 వేల లోపు ఉండొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇటు ధర పరంగా, అటు ఫీచర్ల పరంగా హీరో స్ల్పెండర్‌కు గట్టి పోటీ ఇవ్వాలని హోండా కంపెనీ భావిస్తున్నట్లు తెలియజేస్తున్నాయి. కాగా హోండా నుంచి మార్కెట్‌లోకి వచ్చిన బైక్స్‌లో షైన్ మోడల్‌ను ఎక్కువగా కొంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hero moto corp, Honda, Honda Activa, Splendor plus