• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • HONDA MOTORCYCLE AND SCOOTER INDIA LAUNCHED NEW BIKE IN INDIA KNOW PRICE AND SPECS SS

Honda Hornet 2.0: హోండా హార్నెట్ 2.0 వచ్చేసింది... ధర, ఫీచర్స్ ఇవే

Honda Hornet 2.0: హోండా హార్నెట్ 2.0 వచ్చేసింది... ధర, ఫీచర్స్ ఇవే

Honda Hornet 2.0: హోండా హార్నెట్ 2.0 వచ్చేసింది... ధర, ఫీచర్స్ ఇవే (image: Honda 2 Wheelers India)

Honda Hornet 2.0 | మీరు కొత్త టూవీలర్ కొనాలనుకుంటున్నారా? హోండా హార్నెట్ 2.0 బైక్ వచ్చేసింది. ధరతో పాటు ఇతర వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    టూవీలర్ మార్కెట్లోకి మరో కొత్త బైక్ వచ్చేసింది. హోండా మోటార్ అండ్ స్కూటర్ ఇండియా సరికొత్త బైక్‌ను లాంఛ్ చేసింది. 180-200సీసీ మోటార్ సైకిల్ సెగ్మెంట్‌లో హోండా హార్నెట్ 2.0 మోటార్ సైకిల్‌ను పరిచయం చేసింది. డిజిటల్ ఈవెంట్‌లో ఈ బైక్‌ను రిలీజ్ చేయడం విశేషం. 2020 లో డిజిటల్ ఈవెంట్‌లో రిలీజ్ అయిన తొలి బైక్ కూడా ఇదే. హోండా హార్నెట్ 2.0 ఎక్స్ షోరూమ్ ధర రూ.1.26 లక్షలు. రైడింగ్ పట్ల ఈ తరం కస్టమర్ల కలల్ని, ప్యాషన్‌ను దృష్టిలో పెట్టుకొని హోండా హోర్నెట్ 2.0 రూపొందించామని కంపెనీ చెబుతోంది. అందుకే ఫ్లై అగెయిన్స్ట్ ద విండ్ అనే ట్యాగ్ లైన్‌తో ప్రమోట్ చేస్తోంది. హెచ్ఈటీ బీఎస్6 ఇంజిన్, గోల్డెన్ యూఎస్‌డీ ఫ్రంట్ ఫోర్క్స్, డిజిటల్ నెగిటీవ్ లిక్విడ్ క్రిస్టల్ మీటర్, పెటల్ డిస్క్ బ్రేక్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్, 200ఆర్ఎస్, 200ఎఫ్, టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 200, హీరో ఎక్స్‌పల్స్ 200 లాంటి బైకులకు పోటీ ఇవ్వనుంది హోండా హార్నెట్ 2.0.

    Work From Home Jobs: ఉద్యోగం లేదా? ఇంటి నుంచే పనిచేస్తూ డబ్బు సంపాదించండి ఇలా

    EPFO: మీ పీఎఫ్ అకౌంట్‌లో బ్యాలెన్స్ ఎంతో ఉమాంగ్ యాప్‌లో తెలుసుకోండిలా


    హోండా హోర్నెట్ 2.0 బైక్‌లో 184సీసీ PGM-FI HET ఇంజిన్ ఉండటం విశేషం. డ్యూయెల్, పెటల్ డిస్క్ బ్రేక్స్ సింగిల్ ఛానెల్ ఏబీఎస్‌తో ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌లో మొదటిసారి గోల్డెన్ అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్ ఉండటం విశేషం. ముందు వైపు 110ఎంఎం, వెనుకవైపు 140ఎంఎం ట్యూబ్‌లెస్ టైర్స్ ఉన్నాయి. డిజిటల్ నెగిటీవ్ లిక్విడ్ క్రిస్టల్ మీటర్‌లో గేర్ పొజిషన్ ఇండికేటర్, సర్వీస్ డ్యూ ఇండికేటర్, బ్యాటరీ వోల్ట్ మీటర్ లాంటి సమాచారం తెలుసుకోవచ్చు. బ్రైట్‌నెస్ 5 లెవెల్స్ అడ్జెస్ట్ చేసుకోవచ్చు. ఇక ఎల్ఈడీ లైటింగ్ ప్యాకేజీలో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, పొజిషన్ ల్యాంబ్, ఎల్ఈడీ వింకర్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ ఉంటాయి. హోండా హోర్నెట్ 2.0 మ్యాటీ యాక్సిస్ గ్రే మెటాలిక్, మ్యాటీ మార్వెల్ బ్లూ మెటాలిక్, మ్యాటీ సాంగ్రియా రెడ్ మెటాలిక్, పెరల్ ఇగ్నీయస్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. సెప్టెంబర్ మొదటి వారంలో షోరూమ్స్‌కు రానుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు