తక్కువ ధరలో కొత్త బైక్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. హీరో స్ప్లెండర్కు పోటీగా హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా-HMSI కొత్త బైక్ రిలీజ్ చేయనుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఓ బైక్ రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇది హోండా నుంచి తక్కువ ధరలో రాబోయే బైక్ కానుంది. దీంతో పాటు బైక్ పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని హోండా కసరత్తు చేస్తోంది. పట్టణ ప్రాంతాల కస్టమర్లతో పాటు గ్రామీణ ప్రాంతాలవారిని దృష్టిలో పెట్టుకొని సరికొత్త బైక్స్‌ని పరిచయం చేయనుంది.
ఎంట్రీ లెవెల్ బైక్స్‌ని గ్రామీణ ప్రాంతాల కోసం తీసుకొచ్చేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. అంతేకాదు 150సీసీ కన్నా ఎక్కువలో మిడ్సెగ్మెంట్ నుంచి సూపర్ బైక్ పోర్ట్‌ఫోలియో వరకు వేర్వేరు కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా బైక్స్ రూపొందించనున్నాం. ప్రస్తుతం ప్రత్యర్థి కంపెనీలకు పోటీ ఇచ్చేందుకు హోండా నుంచి ఎంట్రీ లెవెల్ బైక్స్ లేవు. గ్రామీణ ప్రాంతాలవారి కోసం కూడా బైక్స్ లేవు. అందుకే అలాంటి కస్టమర్ల కోసం ఎంట్రీ లెవెల్ మోడల్ అవసరం.
వీలైనంత త్వరగా తక్కువ ధరలో గ్రామీణ ప్రాంతాల కస్టమర్ల కోసం బైక్ రిలీజ్ చేయనుంది హోండా మోటార్ సైకిల్. ప్రస్తుతం హోండా బైకుల ధర రూ.60,000 కన్నా ఎక్కువే ఉంది. ఇటీవల రిలీజైన హోండా సీడీ110 ధర సుమారు రూ.65,000. హోండా నుంచి తక్కువ ధరలో ఉన్న బైక్ ఇదే. అందుకే హీరో స్ప్లెండర్, టీవీఎస్ రేడియాన్, బజాజ్ సీటీ100, టీవీఎస్ విక్టర్ లాంటి బైకులకు పోటీ ఇచ్చేందుకు తక్కువ ధరలో బైక్ రిలీజ్ చేయనుంది హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.