Home /News /business /

HONDA MOTORCYCLE AND SCOOTER INDIA HAS LAUNCHED THE 2022 HONDA GOLD WING TOUR MOTORCYCLE AND PRICE SPECIFICATIONS DETAILS HERE PRV GH

Honda Bike: హోండా నుంచి ప్రీమియం బైక్ లాంచ్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

హోండా కొత్త బైక్​

హోండా కొత్త బైక్​

హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (Honda Motorcycle and Scooter India) ఎప్పటికప్పుడు కొత్త బైక్స్ లాంచ్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది. హోండా కంపెనీ మంగళవారం 2022 హోండా గోల్డ్ వింగ్ టూర్ (2022 Honda Gold Wing Tour) మోటార్‌సైకిల్‌ను లాంచ్ చేసింది.

ఇంకా చదవండి ...
ప్రముఖ టూవీలర్ తయారీదారు హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (Honda Motorcycle and Scooter India) ఎప్పటికప్పుడు కొత్త బైక్స్ లాంచ్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది. హోండా కంపెనీ మంగళవారం 2022 హోండా గోల్డ్ వింగ్ టూర్ (2022 Honda Gold Wing Tour) మోటార్‌సైకిల్‌ను లాంచ్ చేసింది. ఈ లగ్జరీ బైక్ ధరను రూ.39.20 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది. ఇప్పటికే బైక్‌పై బుకింగ్‌లను కూడా ఇది ప్రారంభించింది. దీని డెలివరీలు (Deliveries) మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ మోటార్‌సైకిల్ జపాన్ (Japan) నుంచి కంప్లీట్లీ బిల్ట్-అప్ (CBU) యూనిట్‌గా ఇండియాకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త బైక్ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 బైక్‌లో ఎయిర్‌బ్యాగ్‌..

2022 హోండా గోల్డ్ వింగ్ బైక్ డ్యూయల్ ఎల్ఈడీ (LED) ఫాగ్ ల్యాంప్‌లతో సహా ఫుల్ ఎల్ఈడీ లైటింగ్‌తో వస్తుంది. ఈ ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ అనేవి రెండు వైపులా పాలిష్డ్ ఆప్టికల్ లెన్స్‌తో వస్తాయి. లో-డయల్స్‌లోని కాంట్రాస్ట్ కలర్స్, డార్క్ టోన్‌లు ఈ ప్రీమియం మోటార్‌సైకిల్‌కు మోస్ట్ విజువల్ అప్పీల్‌ను అందిస్తాయి. ఇందులో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌పై ప్రీమియం టచ్‌ను అందించారు. ఈ బైక్‌లో ఎయిర్‌బ్యాగ్‌ (Air bags)ను కూడా ఆఫర్ చేయడం విశేషం. కాగా ఇది గన్‌మెటల్ బ్లాక్ మెటాలిక్ (Gunmetal Black Metallic) అనే ఒకే వేరియంట్‌లో లభిస్తుంది.

స్మార్ట్ కీ, క్రూయిజ్ కంట్రోల్..

ఇందులో ఏడు-అంగుళాల ఫుల్-కలర్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, బ్లూటూత్‌ కనెక్టివిటీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు, కేవలం ఒక బటన్‌ను నొక్కడం ద్వారా ఇది రైడర్‌కు మొత్తం సమాచారాన్ని అందిస్తుంది. ఇందులోని స్క్రీన్ ఆటోమేటిక్ అడ్జెస్ట్‌మెంట్‌తో ఎనిమిది బ్రైట్‌నెస్ లెవెల్స్ తో వస్తుంది. స్మార్ట్ కీ, క్రూయిజ్ కంట్రోల్, 21-లీటర్ కెపాసిటీ గల ఫ్యూయల్ ట్యాంక్ వంటి బెస్ట్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ బైక్ రైడర్ కంఫర్ట్, హీట్ మేనేజ్‌మెంట్, ఎయిర్ మేనేజ్‌మెంట్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందని హోండా పేర్కొంది. ఈ బైక్ సీట్లు సింథటిక్ లెదర్‌తో కవర్ చేశారు.

బెస్ట్ టెక్నాలజికల్‌ ఫ్లాగ్‌షిప్‌ బైక్‌..

ఈ కొత్త గోల్డ్ వింగ్ బైక్ ప్రీవియస్ మోడల్‌కు ఇంప్రూవైస్డ్ & అప్‌డేటెడ్‌ వెర్షన్‌గా వస్తుంది. ఇది హోండా ప్రీమియం నెట్‌వర్క్ నుంచి ఫ్లాగ్‌షిప్ బైక్‌గా మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తుంది. గోల్డ్ వింగ్ హోండా నుంచి బెస్ట్ టెక్నాలజికల్‌ ఫ్లాగ్‌షిప్‌ బైక్‌గా గోల్డ్ వింగ్ సూపర్ పాపులర్ అయ్యిందని హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా సేల్స్ & మార్కెటింగ్ డైరెక్టర్ యద్వీందర్ సింగ్ గులేరియా తాజాగా మీడియాకి చెప్పుకొచ్చారు.

కొత్త గోల్డ్ వింగ్ లిక్విడ్-కూల్డ్ ఫోర్-స్ట్రోక్ 24 వాల్వ్ SOHC ఫ్లాట్-సిక్స్ 1,833 సీసీ ఇంజన్ సాయంతో నడుస్తుంది. ఇది 5,500 rpm వద్ద 126 bhp శక్తిని... 4,500 rpm వద్ద 170 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది కేవలం డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్‌ (DCT)తో అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది. రైడర్లు టూర్, స్పోర్ట్, ఎకాన్ (Econ), రెయిన్ అనే నాలుగు డిఫరెంట్ రైడింగ్ మోడ్‌ల నుంచి తమకు నచ్చిన దానిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో గైరోకాంపాస్‌తో కూడిన స్పీకర్లు, ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ (ISG), హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ రీడౌట్, నావిగేషన్, ప్యాసింజర్ సైడ్ ఆడియో కంట్రోల్ వంటి అనేక టెక్నాలజీలు అందించడం విశేషం.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Bike, Honda

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు