• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • HONDA MOTORCYCLE AND SCOOTER INDIA HAS INCREASED THE PRICES OF THE HONDA SHINE IN INDIA MK GH

Honda shine | కొత్త హోండా షైన్ కొంటున్నారా...అయితే ధర ఎంతో తెలుసా...

Honda shine | కొత్త హోండా షైన్ కొంటున్నారా...అయితే ధర ఎంతో తెలుసా...

ప్రతీకాత్మక చిత్రం

కొన్ని సంవత్సరాలుగా కమ్యూటర్ మోటార్ సైకిళ్లలో ఇది అత్యంత విజయవంతమైందిగా గుర్తింపు తెచ్చకుంది. లాంచ్ అయిన రెండేళ్లలోనే అత్యధిక విక్రయాలు అందుకున్న 125సీసీ బైక్ గా ఘనత సాధించింది. లాంచ్ అయిన మొదట 54 నెలల్లోనే 10 లక్షల వినియోగదారులు ఈ మోటార్ సైకిల్ ను కొనుగోలు చేశారు.

  • Share this:
హోండా బైక్స్ లో అత్యంత విజయవంతమైన మోడల్ షైన్. 2006లో ఈ మోటార్ సైకిల్ లాంచ్ అయినప్పటినుంచి వాహన ప్రియుల మనస్సు దోచింది. తాజాగా బీఎస్6 షైన్ బైక్ ధరను పెంచింది హోండా సంస్థ. రూ.1072ల వరకు ధర పెంచింది. గత రెండు నెలల కాలంలో ఈ బైక్ వెల పెంచడం ఇది రెండో సారి. ప్రస్తుతం ఎక్స్ షోరూంలో షైన్ ధర వచ్చేసి రూ.71,550లు. అదే డిస్క్ వేరియంట్ కావాలంటే రూ.76,346ల వరకు వెచ్చించాలి.

ఇదే సమయంలో ఈ మోటార్ సైకిల్ పై క్యాష్ బ్యాక్ ఆఫర్ ను కూడా ప్రకటించిందీ సంస్థ. ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు రూ.3,500ల వరకు క్యాష్ బ్యాక్ ఇచ్చింది. అయితే ఈ ఆఫర్ కేవలం 2021 జూన్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు కొనుగోలుదారులకు ఈఐఎంఐ ఆప్షన్ కూడా ఇచ్చింది.

వారంటీ పొడిగింపు..
ఈ బైక్ పై వారంటీ, ఉచిత సర్వీసింగ్ కూడా పొడిగించింది హోండా. దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల వద్ద జులై 31 వరకు ఈ సేవలు వినియోగించుకోవచ్చు. కస్టమర్లు, సహచరుల భధ్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోండా సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ వారంటీ పొడిగింపు భారత్ లోని హోండా ద్విచక్రవాహనదారులందరీ అందుబాటులో ఉంచిది. ఇంతకు ముందు 2021 ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు అందుబాటులో ఉంచిది. తాజాగా వినియోగదారులకు మద్దతు ఇచ్చేలా అన్నీ సర్వీసులను జులై 31 వరకు పొడిగించింది. లాక్డౌన్ కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఇంజిన్..
ఈ సరికొత్త బీఎస్6 హోండా షైన్ 125సీసీ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 7500 ఆర్పీఎం వద్ద 10.72 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 6000 ఆర్పీఎం వద్ద 10.9 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 5-స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది.

అత్యంత విజయవంతమైన బైక్ గా గుర్తింపు..
హోండా బైక్స్ లో అత్యంత పాపులరైన మోటార్ సైకిల్ షైన్. 2006లో తొలిసారి లాంచ్ అయిన ఈ షైన్ మోడల్ గతేడాది ముగిసేనాటికి 90 లక్షల విక్రయాలను అందుకున్నట్లు హోండా సంస్థ తెలిపింది. గత కొన్ని సంవత్సరాలుగా కమ్యూటర్ మోటార్ సైకిళ్లలో ఇది అత్యంత విజయవంతమైందిగా గుర్తింపు తెచ్చకుంది. లాంచ్ అయిన రెండేళ్లలోనే అత్యధిక విక్రయాలు అందుకున్న 125సీసీ బైక్ గా ఘనత సాధించింది. లాంచ్ అయిన మొదట 54 నెలల్లోనే 10 లక్షల వినియోగదారులు ఈ మోటార్ సైకిల్ ను కొనుగోలు చేశారు.
Published by:Krishna Adithya
First published:

అగ్ర కథనాలు