ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా (Honda) మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇన్ ఇండియా (HMSI) డిజిటల్ కస్టమర్ ఇంటర్‌ఫేస్‌పై దృష్టి సారించింది. ఇందులో భాగంగా సోమవారం హోండా ‘బిగ్‌వింగ్ వర్చువల్ షోరూమ్’ (Honda BigWing virtual showroom) ను ప్రారంభించింది. ఈ డిజిటల్ షోరూమ్ ద్వారా వినియోగదారులకు 360 -డిగ్రీ వర్చువల్ ప్రొడక్ట్ డెమో, ఆన్లైన్ డాక్యుమెంటేషన్, డైరెక్ట్ టు -హోమ్ డెలివరీ, వర్చువల్ చాట్ సపోర్ట్ వంటి అద్భుతమైన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఈ వర్చువల్ షోరూమ్స్ మీకు డైరెక్ట్‌గా హోండా షోరూమ్‌లో(Honda Showroom) వాహనాన్ని కొనుగోలు చేసిన అనుభూతిని ఇస్తాయి. కస్టమర్లు ఉన్న లొకేషన్ ఆధారంగా వారు డీలర్ల(Honda Dealer)ను ఎంచుకునే సౌకర్యం కూడా ఇందులో కల్పించారు. కస్టమర్లు తమ దగ్గర్లోని డీలర్షిప్ సెంటర్లను ఎంచుకొని వర్చువల్‌గా వాహనాలు కొనుగోలు చేయవచ్చు. ఈ కొత్త రకం సేవలపై హెచ్ఎంఎస్ఐ సేల్స్ & మార్కెటింగ్ డైరెక్టర్ యాద్వీందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ, ‘‘కస్టమర్ల భద్రత, సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఉత్పత్తులను వారికి మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.
కొత్తగా ప్రారంభించిన వర్చువల్ షోరూమ్‌తో (Virtual Platform) మా కస్టమర్లకు మరింత దగ్గరవుతాం. నూతన డిజిటల్ టెక్నాలజీతో (Digital Technology) కస్టమర్ల అవసరాలను తీర్చేందుకు మా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. హోండా బిగ్‌వింగ్ (Honda BigWing) కింద ప్రారంభించిన ఈ వర్చువల్ ఇంటర్ఫేస్ ఖచ్చితంగా మా కస్టమర్లను ఆనందపరుస్తుందని ఆశిస్తున్నాం.”అని అన్నారు.
Honda Monkey: మంకీ బైక్‌ను ఆవిష్కరించిన హోండా సంస్థ.. వచ్చే ఏడాది మార్కెట్లోకి విడుదల
త్వరలోనే వర్చువల్ షోరూమ్‌లోకి అన్ని ప్రీమియం వాహనాలు..
కాగా, ఈ వర్చువల్ ప్లాట్‌ఫారమ్ (Virtual Platform ) ద్వారా కస్టమర్లు తమ ఇంటి వద్ద కూర్చునే వాహనాలను కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు, వర్చువల్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా పొందవచ్చు. కొనుగోలుకు కావాల్సిన అన్ని వివరాలను ఇంటి నుంచే మీరు తెలుసుకోవచ్చు.”అని హెచ్ఎంఎస్ఐ తెలిపింది. కాగా, ప్రస్తుతం హోండా H'ness CB350 అన్ని అవతార్ వేరియంట్లు ఈ వర్చువల్ షోరూమ్‌లో అందుబాటులో ఉన్నాయి.
త్వరలోనే ఈ ప్లాట్‌ఫాం ద్వారా మిగతా ప్రీమియం మోడళ్ల (premium models) ను కూడా అందుబాటులోకి తేనున్నట్లు హోండా(Honda) పేర్కొంది. ఈ ఆల్ ఇండియా బిగ్‌వింగ్ నెట్వర్క్ ఇంటిగ్రేషన్‌తో ఆన్లైన్ వెహికిల్ బుకింగ్, అపెరల్, మర్చండైజ్ విభాగాలు సంబంధించిన సేవలు పొందవచ్చు. దీని కోసం ప్రత్యేకమైన 'మోటోజిపి వాల్' ('MotoGP Wall') సర్వీసులను హోండా ఏర్పాటు చేసింది. దశాబ్ధ కాలంగా హోండా సాధించిన గొప్ప మైలురాయిగా హోండా దీన్ని పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Honda, Motor Vehicles Act, Online service, Online shopping