HONDA MONKEY 2022 UNVEILED INTERNATIONALLY HERE FULL DETAILS NS GH
Honda Monkey: మంకీ బైక్‌ను ఆవిష్కరించిన హోండా సంస్థ.. వచ్చే ఏడాది మార్కెట్లోకి విడుదల
ప్రతీకాత్మక చిత్రం
ద్విచక్రవాహనాల తయారీలో అగ్రగామిగా ఉన్న హోండా సంస్థ నుంచి త్వరలో సరికొత్త మోటార్ సైకిల్ విడుదల కానుంది. అంతర్జాతీయ మార్కెట్లో వాటా పెంచుకోవడమే లక్ష్యంగా ‘హోండా మంకీ 2022’ బైక్‌ను సంస్థ ఆవిష్కరించింది.
ద్విచక్రవాహనాల తయారీలో అగ్రగామిగా ఉన్న హోండా సంస్థ నుంచి త్వరలో సరికొత్త మోటార్ సైకిల్ విడుదల కానుంది. అంతర్జాతీయ మార్కెట్లో వాటా పెంచుకోవడమే లక్ష్యంగా ‘హోండా మంకీ 2022’ బైక్‌ను సంస్థ ఆవిష్కరించింది. వచ్చే ఏడాదిలో ఇది వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఈ అధునాతన బైక్‌ను ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో పాటు 5-స్పీడ్ గేర్ బాక్స్ సిస్టమ్‌తో అభివృద్ధి చేశారు. అంతేకాకుండా యూరో5 కాంప్లయన్స్ ఎక్సాహాస్ట్ , మెరుగైన సస్పెన్షన్ సెటప్‌తో దీన్ని రూపొందించారు. Hero MotoCorp: హీరో మోటోకార్ప్ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.. జులై 1 నుంచి టూవీలర్ ధరల పెంపు
ఇంజిన్, ప్రత్యేకతలు..
ఈ సరికొత్త హోండా మంకీ బైక్.. 124సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 6.9 కిలోవాట్ శక్తిని, 11 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో గేర్ బాక్స్ షేప్‌ను మార్చారు. ఈ యూనిట్లో సింగిల్ ఛాంబర్‌తో ఎక్సాహాస్ట్ మఫ్లర్‌ను భర్తీ చేశారు. ఆఫ్ సెట్ సిలిండర్ ఇంజిన్, రోలర్ రాకర్ వాల్వ్ గేర్, అడ్వాన్సెడ్ ఇంటర్నల్స్ తో పాటు లో ఫ్రిక్షన్ కోటింగ్స్ లాంటి ప్రత్యేకతలు ఈ బైక్ సొంతం. దీని మైలేజీ కూడా మెరుగ్గా ఉంది. 1.5 లీటరుకు గరిష్ఠంగా 100 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని సంస్థ చెబుతోంది.
ఈ మోటార్ సైకిల్ బయట భాగాన్ని గమనిస్తే.. మొత్తం ఎల్ఈడీ లైటింగ్ సెటప్‌తో ఫినిషింగ్ చేశారు. ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, 'ఆన్సర్ బ్యాక్' అనే ఫీచర్ ద్వారా పుష్ బటన్ నొక్కగానే లైట్స్ ఫ్లాష్ అవుతాయి. డ్యుయల్ రియర్ షాక్స్, ట్వెక్డ్ సస్పెన్షన్ వల్ల రైడ్ చాలా మృదువుగా ఉంటుంది. ట్యూబులర్ స్టీల్ రాక్ కూడా ఈ బైక్ లో పొందుపరిచారు.
బ్రేకింగ్ సెటప్..
ఈ సరికొత్త హోండా మంకీ 2022 మోటార్ సైకిల్ ముందు భాగంలో స్టీల్ బ్యాక్ బోన్ ఫ్రేమ్ తో కూడిన యూఎస్డీ ఫోర్కులు ఉన్నాయి. వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్లను పొందుపరిచారు. బ్రేకింగ్ సెటప్ దగ్గరకొస్తే 220 ఎంఎం ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 190 ఎంఎం బ్యాక్ డిస్క్ బ్రేక్స్ ను కలిగి ఉన్నాయి. ABS సేఫ్టీ కిట్ తో పాటు ఇనర్షియల్ మెజర్మెంట్ యూనిట్(IMU) ఇందులో ఉంది. ఇంతకుముదు 107 కేజీల బరువుండే ఈ మోటార్ సైకిల్ వెయిట్‌ను ప్రస్తుతం 104 కేజీలకు తగ్గించింది. ఫలితంగా పవర్ వెయిట్ నిష్పత్తి 88.46hp/tonగా మారింది.
హోండా మంకీ 2022 మోటార్ సైకిల్.. హ్యాండిల్ బార్లు, ఫ్రేమ్ లను కలిగి ఉంది. స్వింగార్మ్, బాడీ కలర్ షాక్ అబ్జార్బర్లు, సింగిల్ సీట్, పీనట్ ఆకారంలో ఉన్న ఫ్యూయల్ ట్యాంకు ఉంది. ఇది మూడు కలర్ ఆప్షన్లలో లభ్యంకానుంది. పెరల్ గ్లిట్టరింగ్ బ్లూ, బనానా యెల్లో, పెరల్ నెబ్యులా రెడ్ అనే మూడు రంగుల్లో మంకీ బైక్ అందుబాటులోకి రానుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.