Honda H’Ness Bike: హోండా హైనెస్ లగ్జరీ బైక్ లాంచ్... రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి పోటీ

Honda H’Ness Bike: అత్యంత ప్రతిష్టాత్మకంగా తెచ్చిన హైనెస్ లగ్జరీ బైక్‌ను ఇండియాలో లాంచ్ చేసింది హోండా కంపెనీ. ఈ బైక్ విశేషాలు తెలుసుకుందాం.

news18-telugu
Updated: September 30, 2020, 2:27 PM IST
Honda H’Ness Bike: హోండా హైనెస్ లగ్జరీ బైక్ లాంచ్... రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి పోటీ
హోండా హైనెస్ లగ్జరీ బైక్ లాంచ్... రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి పోటీ (credit - twitter)
  • Share this:
Honda H’Ness Bike: లగ్జరీ బైకులకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిన రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీతో పోటీపడటానికి హోండా మోటర్స్ కంపెనీ సిద్ధమైంది. ఇప్పటికే ఈ విభాగంలో ఎన్‌ఫీల్డ్‌కి పోటీగా చాలా కంపెనీలు కొత్త మోడళ్లను తెచ్చాయి. తాజాగా నేడు భారత్‌లో లగ్జరీ బైక్‌ని విడుదల చేసింది హోండా కంపెనీ. శక్తిమంతమైన ఈ ద్విచక్ర వాహనానికి H’Ness అని పేరు పెట్టారు. ‘హైనెస్’(Highness) అనే అర్థం వచ్చేలా ఈ పేరు పెట్టినట్టు తెలుస్తోంది. ప్రమోషన్లలో కూడా హైనెస్ పేరునే వాడుతున్నారు. ట్రేడ్‌మార్క్ సమస్యలు రాకుండా Highnessకు బదులుగా, స్పెల్లింగ్ మార్చి H’Ness పేరును కొత్త బైక్‌కు పెట్టినట్టు ఈ జపాన్ కంపెనీ చెబుతోంది. ఇది రిట్రో క్లాసిక్ క్రూయిజర్లను పోలి ఉంది. ఈ కొత్త బైక్... 400cc సెగ్మెంట్‌కి చెందినది కావడం వల్ల... ఇది క్లాసిక్ సిరీస్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌కి పోటీగా నిలుస్తోంది.

హైనెస్ బైక్ ప్రత్యేకతలు చూస్తే... విదేశాల్లో అమ్ముతున్న హోండా రెబెల్‌ని పోలినట్లుగా ఈ బైక్‌ని తయారుచేశారు. రౌండ్ హెడ్‌ల్యాంప్ ఉండగా... అంతా లెడ్ యూనిట్ సెట్ అని తెలిసింది. ఫ్యూయల్ ట్యాంక్... వంపులతో ఉంది. దీన్ని సింగిల్ సీట్‌తో తయారుచేసిన కంపెనీ... వెనక సీటును ఆప్షనల్‌గా చేసింది. ఈ బైక్ ఇంజిన్ సామర్ధ్యం 300-350ccతో సింగిల్ సిలిండర్ యూనిట్‌తో వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇది హోండా CB300R అప్‌డేటెడ్ వెర్షన్ అంటున్నారు.

* ప్రమోషన్లలో జోరు:
కొత్త బైక్ కోసం సోషల్ మీడియాలో ప్రమోషన్ కూడా కొత్తగానే చేస్తున్నారు. దీని కోసం #YOURHIGHNESS అనే హ్యాష్ ట్యాగ్‌ని వాడుతున్నారు. దీని ప్రమోషన్ కోసం సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లలో ఒకటి ఇలా ఉంది... “ఇది చాలా శక్తివంతమైన బైక్. మేం ఇలా చెబుతున్నామంటే బైక్ ఎలా ఉంటుందో మీరు ఊహించవచ్చు. మొత్తానికి దీన్ని మార్కెట్లోకి విడుదల చేసే సందర్భం వచ్చింది. సెప్టెంబర్ 30న ఉదయం 11:55 నుంచి ఈ హైనెస్ బైక్ మీకు అందుబాటులోకి వస్తుంది” అని రాశారు. అలాగే దీన్ని లాంచ్ చేశారు కూడా.

* బిగ్ వింగ్ నెట్‌వర్క్ ద్వారా అమ్మకాలు:
హోండా బిగ్ వింగ్ డీలర్ నెట్‌వర్క్ ద్వారా దీన్ని అమ్మనున్నట్టు హోండా ప్రకటించింది. సాధారణంగా ప్రీమియం బైక్‌లనే బిగ్ వింగ్ డీలర్ నెట్ వర్క్ ద్వారా అమ్ముతారు. ఈ నెట్ వర్క్ ద్వారా మార్కెట్లోకి వచ్చిన బైక్‌లలో అతి తక్కువ ధరకు అభించేదిగా హైనెస్ నిలుస్తుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ బైక్ ఎక్స్ షోరూం ధర రూ.2.5 లక్షలకు తక్కువగా ఉండొచ్చంటున్నారు. బిగ్ వింగ్ నెట్ వర్క్‌ను దేశంలోని 75 నగరాలకు విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నామని హోండా గతంలోనే ప్రకటించింది. H’Nessను ఎక్కువ మందికి చేరువ చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఈ విస్తరణ పనులు చేపట్టినట్టు తెలుస్తోంది.

* మన దేశానికే పరిమితం:ఈ మోడల్‌ను భారత్‌కి మాత్రమే పరిమితం చేసినట్టు తెలుస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి ఇతర కంపెనీల మోడళ్లతో పోలిస్తే ఈ బైక్... ప్రీమియం బైక్లకు సరికొత్త ప్లాట్‌ఫామ్ అవుతుందని కొంతమంది వినియోగదారులు భావిస్తున్నారు.
Published by: Krishna Kumar N
First published: September 30, 2020, 2:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading