దేశీయ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన హోండా H'ness CB350, CB350RS బైకులు ఇకపై క్యాంటీన్ స్టోర్ డిపార్ట్మెంట్లలో (సీఎస్డీ) కూడా లభించనున్నాయి. ఈ మేరకు హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా గురువారం ప్రకటించింది.
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన హోండా H'ness CB350, CB350RS బైకులు ఇకపై క్యాంటీన్ స్టోర్ డిపార్ట్మెంట్లలో (సీఎస్డీ) కూడా లభించనున్నాయి. ఈ మేరకు హోండా(Honda) మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా గురువారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లోని సీఎస్డీ స్టోర్లలో ఈ బైకులను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. హోండా (Honda) బిగ్‌వింగ్ నుంచి విడుదలైన ఈ రెండు క్రూయిజర్ బైక్‌లు(Bikes) మొత్తం 35 సీఎస్డీ డిపోల్లో అందుబాటులోకి వచ్చాయి. క్యాంటిన్ డిపార్ట్మెంట్(Department) స్టోర్లలో వీటి ధరల విషయానికి వస్తే.. హోండా H'ness-CB350 DLX వేరియంట్ రూ.1.70 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ), DLX ప్రో వేరియంట్ రూ.1.74 లక్షలు, CB350RS మోనోటోన్ వేరియంట్ రూ.1.74 లక్షల ధర వద్ద అందుబాటులో ఉంటాయి.
సీడీఎస్ స్టోర్లలో ఈ బైకులను అందుబాటులోకి తీసుకురావడంపై హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా సేల్స్ & మార్కెటింగ్ డైరెక్టర్ యద్వీందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ “భారత రక్షణ వర్గాలతో హోండా టూవీలర్స్‌కు దీర్ఘకాలిక అనుబంధం ఉంది. అందులో భాగంగానే సీఎస్డీ స్టోర్ల ద్వారా ఈ కొత్త మోడల్స్‌ను జవాన్లకు చేరువయ్యేలా చేస్తున్నాం. మా నాణ్యమైన ఉత్పత్తులను వారికి అందించడం పట్ల మేము గర్విస్తున్నాం. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, భారతదేశం అంతటా సీఎస్డీ నెట్‌వర్క్‌లో మా కొత్త బిగ్‌వింగ్ బైక్‌లను అందుబాటులోకి తీసుకురావడం పట్ల మేము సంతోషిస్తున్నాం.’’ అని పేర్కొన్నారు.
సికింద్రాబాద్, వైజాగ్ సీఎస్డీ స్టోర్లలో కూడా..
కాగా, ఈ రెండు కొత్త బైక్‌లు ఆగ్రా, బరేలీ, డెహ్రాడూన్, జైపూర్, లక్నో, ముంబై, రామ్‌గఢ్, అహ్మదాబాద్, బరేలీ, ఢిల్లీ, జలంధర్, లేహ్, ముంబై బేస్ , సికింద్రాబాద్, అంబాలా, భటిండా, దిమాపూర్, ఖడ్కి, మసింపూర్, నారంగి, శ్రీనగర్, బాగ్డోగ్రా, బికనీర్, హిస్సార్, కొచ్చి, మీరట్, పఠాన్‌కోట్, ఉధంపూర్, బెంగళూరు, చెన్నై, జబల్పూర్, కోల్‌కతా, మిసామారి, పోర్ట్ బ్లెయిర్, విశాఖపట్నం నగరాల్లోని సీఎస్డీ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి.
ఇక, వీటిలోని ఫీచర్ల విషయానికి వస్తే.. హోండా H'Ness CB350 349 cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 5,500 rpm వద్ద 20.8 bhp శక్తిని, 3,000 rpm వద్ద 30 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలోని ఇంజిన్ 5 -స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేసి ఉంటుంది. స్పోర్టియర్ లుక్ కోసం విభిన్న బాడీ ప్యానెల్లు, కలర్ ఆప్షన్లు, వీల్స్‌ను చేర్చింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.