ఈ ఏడాది నవరాత్రుల సందర్భంగా ఆటోమొబైల్ ప్రొడక్ట్స్ సేల్స్ రికార్డు స్థాయిలో పెరిగాయి. ఫెస్టివల్ సీజన్ సెంటిమెంట్‌ను కంపెనీలు క్యాష్ చేసుకున్నాయి. అయితే కొనసాగుతున్న ఈ పండుగల సీజన్లో అమ్మకాలను మరింత పెంచుకోవాలని భావిస్తోంది హోండా కంపెనీ (Honda Company). ఇండియన్ మార్కెట్లో లభిస్తున్న వివిధ మోడళ్లపై ఈ సంస్థ రూ. 39,000 వరకు డిస్కౌంట్ బెనిఫిట్స్ ప్రకటించింది. క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్, ఉచిత యాక్సెసరీలు వంటి ప్రయోజనాలను అందిస్తోంది. ఈ నెలాఖరు లోపు కొనుగోలు చేసే వివిధ మోడళ్లపై (Car Models) హోండా అందిస్తున్న ఆఫర్ల వివరాలు చూద్దాం.
హోండా అమేజ్
గత ఏడాది ఈ కారు ఫేస్‌లిఫ్ట్ ఎడిషన్ రిలీజ్ అయింది. లేటెస్ట్ డిజైన్, ఇంటీరియర్ మార్పులతో కారు లాంచ్ అయింది. అక్టోబర్‌లో కాంపాక్ట్ సెడాన్ హోండా అమేజ్ (Honda Amaze) కారును కొనుగోలు చేసేవారు రూ. 8,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇందులో రూ. 3,000 కార్పొరేట్ డిస్కౌంట్, రూ. 5,000 లాయల్టీ ఇన్సెంటివ్ వంటి బెనిఫిట్స్ ఉన్నాయి.
Price Hike: కొత్త కార్ కొనాలంటే ఇప్పుడే కొనాలి... త్వరలో పెరగనున్న ధరలు
హోండా సిటీ నాలుగో జనరేషన్
హోండా సిటీ ఫోర్త్ జనరేషన్ (Honda City Gen 4) కారు 2014 నుంచి మార్కెట్లో ఉంది. 2022 డిసెంబర్ నాటికి దీని ఉత్పత్తిని కంపెనీ దశలవారీగా నిలిపివేయనుంది. ఈ కారుపై కంపెనీ రూ. 5,000 కస్టమర్ లాయల్టీ బోనస్ అందిస్తోంది. అయితే దీనిపై ఎక్స్ఛేంజ్ ఇంటెన్సివ్, కార్పొరేట్ డిస్కౌంట్లు వర్తించవు.
Diwali Car Offers: కారు కొంటే రూ.లక్ష తగ్గింపు.. కంపెనీ బంపరాఫర్!
హోండా సిటీ ఐదో జనరేషన్
సరికొత్త హోండా సిటీ ఐదో జనరేషన్ (Honda City Gen 5) కారుపై కంపెనీ రూ. 37,896 విలువైన ఆఫర్లను అందిస్తోంది. ఇందులో రూ. 10,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 10,896 వరకు విలువైన కాంప్లిమెంటరీ యాక్సెసరీలు వంటి బెనిఫిట్స్ ఉన్నాయి. హోండా కస్టమర్లు లాయల్టీ రివార్డ్‌లలో అదనంగా రూ. 5,000 తగ్గింపు పొందవచ్చు. వీటితో పాటు రూ. 5,000 కార్పొరేట్ డిస్కౌంట్, రూ. 7,000 ఎక్స్ఛేంజ్ ఇంటెన్సివ్, ఎక్స్ఛేంజ్పై రూ. 10,000 స్పెషల్ డిస్కౌంట్ వంటి ఆఫర్లను కంపెనీ అందిస్తోంది.
హోండా WR-V
పండుగ సీజన్లో ఈ కారును కొనుగోలు చేసేవారు రూ. 39,298 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. హోండా WR-V పై కస్టమర్లు రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 12,298 విలువైన కాంప్లిమెంటరీ యాక్సెసరీస్‌తో పాటు రూ. 7,000 ఎక్స్ఛేంజ్ బోనస్ వంటి బెనిఫిట్స్ ప్రయోజనం పొందవచ్చు. రూ. 5,000 లాయల్టీ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్‌తో కారు ధర మరింత తగ్గుతుంది,
హోండా జాజ్
హోండా జాజ్ కొనుగోలుదారులు రూ. 25,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇందులో రూ. 10,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, మరో రూ. 7,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3000 కార్పొరేట్ డిస్కౌంట్, రూ. 5,000 క్లయింట్ లాయల్టీ బోనస్ కూడా ఉంది.
ఫైనాన్స్ స్కీమ్
హోండా సిటీ, అమేజ్ కార్లను కొనే వారి కోసం హోండా కంపెనీ స్పెషల్ ఫైనాన్స్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ స్కీమ్ కింద, ఈ సంవత్సరం కారును కొనుగోలు చేసి, 2023లో పేమెంట్స్ ప్రారంభించవచ్చు. ఎంపిక చేసిన కస్టమర్లకు 'డ్రైవ్ ఇన్ 2022, పేమెంట్ ఇన్ 2023' పేరుతో ఈ ఫైనాన్స్ స్కీమ్‌ను కంపెనీ ప్రారంభించింది. దీని ద్వారా కారు ఆన్ రోడ్ ధరలో 85% వరకు ఫైనాన్స్ పొందవచ్చు. మూడు నెలల తర్వాత.. అంటే వచ్చే ఏడాది జనవరి నుంచే దీనిపై ఈఎంఐ స్టార్ట్ అవుతుందని కంపెనీ పేర్కొంది. అయితే అక్టోబర్ 31 వరకు చేసే కొనుగోళ్లపై మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.