హోమ్ /వార్తలు /బిజినెస్ /

Honda EVs: హోండా EV రూట్ ప్లాన్ మాములుగా లేదుగా.. 2025 నాటికి కంపెనీ టార్గెట్ అదే...!

Honda EVs: హోండా EV రూట్ ప్లాన్ మాములుగా లేదుగా.. 2025 నాటికి కంపెనీ టార్గెట్ అదే...!

 Honda

Honda

Honda EVs: ఎలక్ట్రిక్ వెహికల్స్ విభాగానికి సంబంధించిన ప్రణాళికలను వెల్లడించింది ఆటో దిగ్గజం హోండా. ఇండియాతోపాటు జపాన్‌, యూఎస్‌ వంటి పెద్ద మార్కెట్ల లక్ష్యంగా ప్లాన్లను రూపొందించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌(Electric Vehicles) సెగ్మెంట్‌ వేగంగా వృద్ధి చెందుతోంది. ఇండియన్‌ మార్కెట్‌లో (Indian Markets)కి కూడా చాలా కంపెనీలు తమ ప్రొడక్ట్స్‌ను లాంచ్‌ చేస్తున్నాయి. ఇండియాలో అతిపెద్దదైన ద్విచక్ర వాహనాల మార్కెట్‌ లక్ష్యంగా కొన్ని కంపెనీలు తమ ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్‌ బైకుల సెగ్మెంట్‌లో ఓలా కంపెనీ (Ola Company) రాణిస్తోంది. తాజాగా ఈ విభాగానికి సంబంధించి ఆటో దిగ్గజం హోండా (Honda) తమ ప్రణాళికలు వెల్లడించింది. ఇండియాతోపాటు జపాన్‌, యూఎస్‌ వంటి పెద్ద మార్కెట్ల లక్ష్యంగా ప్లాన్లను రూపొందించింది.

* మూడేళ్లలో 10 మోడళ్లు

హోండా(Honda) కంపెనీ తన గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌(EV) విస్తరణ ప్రణాళికలను రూపొందించింది. రాబోయే ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ పోర్ట్‌ఫోలియోలో కమ్యూటర్ మోడల్స్‌, స్కూటర్లు, ఆఫ్-రోడ్, స్ట్రీట్‌ బైక్స్‌ సహా వివిధ రకాల ద్విచక్ర వాహనాలు ఉంటాయని స్పష్టం చేసింది. వచ్చే ఐదేళ్లలో ప్రతి ఏడాది పది లక్షల యూనిట్ల ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అమ్మకాలను నమోదు చేయాలని.. 2030 నాటికి 35 లక్షల యూనిట్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. 2025 నాటికి కనీసం 10 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను లాంచ్‌ చేయాలని నిర్ణయించింది.

* 2024లో కమ్యూటర్‌ ఈవీ మోడల్స్‌

భారతదేశంలో 2023 నుంచి ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడళ్లను లాంచ్‌ చేస్తున్నట్లు హోండా వెల్లడించింది. వచ్చే ఏడాది ఫ్లెక్స్-ఫ్యూయల్ (E20), 2025లో ఫ్లెక్స్-ఫ్యూయల్ (E100) వేరియంట్లను విడుదల చేస్తుంది. ఆ తర్వాత బ్యాచ్‌లో బ్యాటరీతో నడిచే వాహనాలను కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది.

కంపెనీ 2024, 2025 మధ్య రెండు కమ్యూటర్ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ మోడళ్లను లాంచ్‌ చేయనున్నట్లు తెలిపింది. ఈ మోడళ్లు ఆసియా, యూరప్, జపాన్ మార్కెట్‌లలో అందుబాటులోకి తీసుకొచ్చే ప్లాన్‌లో ఉంది. 2024, 2025 మధ్య జపాన్, యూఎస్‌, యూరప్ మార్కెట్ కోసం ప్రత్యేకంగా మొత్తం మూడు బిగ్‌ సైజ్‌ FUN EV మోడళ్లు కూడా అందుబాటులోకి వస్తాయి.

* డెలివరీల కోసం ఎలక్ట్రిక్‌ మోపెడ్‌

చిన్న వెహికల్స్ కోసం హోండా ప్రస్తుతం థాయిలాండ్ పోస్ట్ కంపెనీ లిమిటెడ్‌తో జాయింట్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఈ నెలాఖరులో థాయ్‌లాండ్‌లో బ్యాటరీతో నడిచే మోపెడ్ ప్రొడక్షన్‌ను ప్రారంభిస్తుంది. ఈ స్కూటర్‌లో హోండా మొబైల్ పవర్ ప్యాక్ (MPP) స్వాపబుల్ బ్యాటరీలు ఉంటాయి. ఇది చిన్న ప్యాకేజీల డెలివరీకి ఉపయోగపడుతుంది.

రేంజ్, ఛార్జింగ్ సమయం వంటి సమస్యలను పరిష్కరించామని, వ్యాపార వినియోగానికి సరిపోతుందని కంపెనీ తెలిపింది. దీన్ని కార్గో, డెలివరీ ప్రయోజనాల కోసం విభిన్న విభాగాలకు సరిపోయే, మల్టిపుల్‌ బెనిఫిట్స్‌ అందించే యుటిలిటీ స్కూటర్‌గా పేర్కొంది. ఈ స్కూటర్ ప్రాథమికంగా చిన్న తరహా వ్యాపారాలు, వాణిజ్య అవసరాలు తీర్చడం లక్ష్యంగా రూపొందుతోంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Auto, Auto mobile, Electric Vehicles, Honda

ఉత్తమ కథలు