news18-telugu
Updated: November 24, 2020, 9:41 PM IST
ప్రతీకాత్మకచిత్రం
Honda City hatchback కొత్త లుక్ ఎలా ఉందో మీకు తెలుసా? థాయ్ ల్యాండ్ లో లాంచ్ అయిన ఈ కారు లుక్ ఇలా ఉంటుంది. త్వరలో మన మార్కెట్లో అడుగుపెట్టనున్న ఈ హాచ్ బ్యాక్ కార్ కోసం చాలా మంది కస్టమర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
3 వేరియంట్లలో..మొత్తం 3 వేరియంట్లలో ఈ కారు లభిస్తుంది. S+, SV, RS అనే వేరియంట్లుగా వీటిని పిలుస్తారు. థాయ్ ల్యాండ్ లో రిలీజ్ అయిన హోండా సిటీ కార్ ను చూస్తుంటే కొన్ని ఫీచర్లపై స్పష్టత వస్తోంది. హోండా సిటీ సెడాన్ ను పోలినట్టే ఇది స్పష్టంగా కనిపిస్తోంది. లార్జ్ గ్రీన్ హౌస్ ఏరియా, మోర్ స్పోర్టీ రేర్ బంపర్, రివైజ్డ్ టెయిల్ ల్యాంప్స్ వంటివి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. 2020 Honda City hatchback లోపల 8 ఇంచిల టచ్ స్క్రీన్ తో ఇన్ఫోటైన్ మెంట్ (infotainment) సిస్టం ఉండగా ఇది యాండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే సపోర్ట్ చేసేలా ఉంది.
హోండా ప్రామిస్ ఇదే..
1.0లీటర్ VTEC ఇంజిన్ సామర్థ్యంతో ఉన్న ఈ కారుకు గరిష్ఠ ఔట్ పుట్ 120bhp, peak torque 173Nmగా ఉంటుందని హోండా ప్రామిస్ చేస్తోంది. 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, CVT చాయిస్ తో ఉన్న హ్యాచ్ బ్యాక్ చాలా ఆకర్షణీయంగా ఉంది.
హోండా కారుకు తిరుగులేదు
ఎగ్జిక్యుటివ్ సెడాన్ (sedan) సెగ్మెంట్లో హోండా సిటీకి మనదేశంలో తిరుగులేదు. మారుతి సుజుకి సియాజ్, హ్యూండాయ్ వర్నా కంటే ఎక్కువ సేల్స్ ఉన్న హోండా సిటీ మార్కెట్లో తన పైచేయి సాధించింది. ఈ సెగ్మెంట్లో 44శాతం మార్కెట్ షేర్ సొంతం చేసుకున్న హోండా మన మార్కెట్లో హాచ్ బ్యాక్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అయింది. కోవిడ్ టైంలో కూడా హోండా సేల్స్ మన మార్కెట్లో పెద్దగా తగ్గకపోవడంతో పాటు వీటి రీ సేల్ కూడా చాలా బాగుంటోంది.
కార్ లవర్స్ కు పండగే
హోండా జాజ్ మన మార్కెట్లో బ్రహ్మాండంగా క్లిక్ అవ్వగా మరోవైపు హోండా సిటీ హాచ్ బ్యాక్ కూడా లాంచింగ్ కు రెడీ కావడం ఆటో ప్రియులకు గుడ్ న్యూస్ గా మారింది. హోండా Amaze, హోండా Jazz, Honda WR-V Facelilft, Honda City, Honda Civic, Honda CR-V అనే 6 వేరియంట్లు భారత విపణిలో మంచి హాట్ కేకులుగా మారాయి. వివిధ బడ్జెట్లకు అనువుగా వీటిని డిజైన్ చేశారు. మనదేశంలో మధ్యతరగతి వారు కూడా ఈ జపనీస్ కారంటే ఎంతో ఇష్టపడి సొంతం చేసుకుంటారంటే హోండాకున్న ఆదరణ ఇట్టే అర్థమవుతుంది. అందుకే హోండా కార్లలో మరో వేరియంట్ వస్తోందంటే అందరిలోనూ ఆసక్తి కలిగిస్తుంది.
Published by:
Krishna Adithya
First published:
November 24, 2020, 9:41 PM IST