Home /News /business /

HONDA CITY E HEV LAUNCHED IN INDIA CHECK THE HYBRID CAR FEATURES AND PRICE IN INDIA BA GH

Honda City e:HEV: ఇండియాలో హోండా సిటీ e:HEV కారు లాంచ్.. ఈ హైబ్రిడ్ వెహికల్ ప్రత్యేకతలు ఇవే..

Honda City e:HEV

Honda City e:HEV

Honda City e:HEV Price in India | 2022 హోండా సిటీ హైబ్రిడ్ eHEV కార్లను దాని లాంచ్ కు ముందే విడుదల కావడంతో దీని ప్రత్యేకతలను తెలిసిపోయాయి. సరికొత్త హోండా సిటీ హైబ్రిడ్ eHEV స్పోర్టియర్ లుక్‌లో కనువిందు చేస్తోంది. కంపెనీ ఈ కారు సాలిడ్ వింగ్ ఫేస్ ను అప్‌డేట్ చేసింది.

ఇంకా చదవండి ...
పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వెహికల్స్ కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. వినియోగదారుని అవసరాలకు అనుగుణంగా తయారీ సంస్థలు సైతం విద్యుత్తు, హైడ్రోజన్, తదితర చౌకైన ఇంధనాలతో నడిచే వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. ప్రముఖ జపనీస్ కారు తయారీ సంస్థ హోండా (Honda) కూడా ఇండియాలో ఇలాంటి ఓ కారును మే 4న ఇండియాలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఐతే హోండా కార్స్ ఇండియా లాంచ్ డేట్ కు ముందే సరికొత్త హోండా సిటీ హైబ్రిడ్ eHEV (Honda City Hybrid eHECV) కారును లాంచ్ చేసింది. ఈ కంపెనీ రాజస్థాన్‌లోని తపుకరా ఫెసిలిటీలో తన కొత్త హైబ్రిడ్ మోడల్ యూనిట్‌లను ఉత్పత్తి చేస్తోంది.

2022 హోండా సిటీ హైబ్రిడ్ eHEV కార్లను దాని లాంచ్ కు ముందే విడుదల కావడంతో దీని ప్రత్యేకతలను తెలిసిపోయాయి. సరికొత్త హోండా సిటీ హైబ్రిడ్ eHEV స్పోర్టియర్ లుక్‌లో కనువిందు చేస్తోంది. కంపెనీ ఈ కారు సాలిడ్ వింగ్ ఫేస్ ను అప్‌డేట్ చేసింది. ఇందులో ఫాగ్ ల్యాంప్‌ల కోసం క్లా-టైప్ గార్నిష్‌ను అందించారు. హోండా సిటీ హైబ్రిడ్ eHEV కారు ముందు, వెనుక భాగంలో బ్లూ షేడ్‌లో 'H' లోగో ఉంటుంది. ఈ కారు హైబ్రిడ్‌ అని చెప్పేలా ట్రంక్ మూతపై 'eHEV' అక్షరాలు కూడా ఇచ్చారు. హోండా సిటీ హైబ్రిడ్ eHEV వెనుక భాగంలో, ట్రంక్ ఇలిప్ స్పాయిలర్, వెనుక బంపర్ డిఫ్యూజర్ ఉన్నాయి. ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, ఒక 1.5-లీటర్ పెట్రోల్ మోటారును ఆఫర్ చేశారు. ఒకటి జనరేటర్‌గా పనిచేస్తుంది, మరొకటి ప్రొపల్షన్‌కు బాధ్యత వహిస్తుంది. ఈ కారులోని కంబైన్డ్ సెట్-అప్ పవర్ అవుట్‌పుట్ ఇంజన్ 96 hp, 124 hp ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కొత్త కారు 26.5 kmpl మైలేజ్ ఆఫర్ చేస్తోంది. ఇందులో ఆల్-ఎలక్ట్రిక్, హైబ్రిడ్, ఇంజన్ పవర్ అనే మూడు డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి.

కారు ఇంటీరియర్‌లు టూ-టోన్ ఐవరీ, బ్లాక్‌ కలర్లలో వస్తాయి. హోండా సిటీలో ఇంటీరియర్ కలర్ థీమ్ హైబ్రిడ్. ఇది యాంబియంట్ లైటింగ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేకి సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ పాయింట్‌లతో కూడిన 8-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను దీనిలో ఆఫర్ చేయడం విశేషం. ఈ హైబ్రిడ్ కారులోని ఏడు-అంగుళాల HD TFT స్క్రీన్‌ డ్రైవ్-సంబంధిత మొత్తం సమాచారాన్ని అందిస్తుంది. ఇది హైబ్రిడ్ సన్‌రూఫ్‌తో లభించనుంది. సన్‌రూఫ్‌ను వన్-టచ్ స్క్రీన్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. ఎల్ఈడీ హెడ్‌లైట్‌లు, కీలెస్ ఎంట్రీ అండ్ గో, లెదర్ సీట్స్ వంటివి ఆన్‌బోర్డ్‌లోని కొన్ని ముఖ్య కంఫర్ట్ ఫీచర్లు.

హోండా నుంచి వచ్చిన కొత్త హైబ్రిడ్ మోడల్ ఇంటీరియర్లలో ప్రీమియం లెదర్ పార్ట్స్ ఉన్నాయి. ఇది ప్రయాణికులకు తగినంత స్థలాన్ని కూడా అందిస్తుంది. eHEV ADAS, హోండా సెన్సింగ్ టెక్నాలజీ వంటి అనేక సేఫ్టీ ఫీచర్లు ఇందులో అట్రాక్టివ్ గా నిలుస్తున్నాయి. ఈ సేఫ్టీ ఫీచర్లలో కొలిషన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్, రోడ్ డిపార్చర్ మిటిగేషన్, ఆటో హై బీమ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ ఉన్నాయి. ఇది ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, మల్టీ-యాంగిల్ రియర్‌వ్యూ కెమెరా, హిల్ హోల్డ్ అసిస్ట్, పార్కింగ్‌ హోల్డ్ వంటి మరెన్నో ఫెర్టిలిటీ లతో అందుబాటులోకి వస్తోంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Cars, Electric Car, Electric cars, Honda

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు