HONDA CB200X ADV LAUNCHED IN INDIA AT 1 44 LAKH RUPEES HERE FULL DETAILS NS GH
Honda CB200X ADV: భారత్ లోకి హోండా CB200X అడ్వెంచర్ బైక్.. స్టైలిష్ లుక్ తో అదిరిపోయే ఫీచర్లు.. ధర ఎంతంటే..?
ప్రతీకాత్మక చిత్రం
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ).. తాజాగా సీబీ 200 ఎక్స్ అడ్వెంచర్ మోడల్‌ను భారత్‌లో విడుదల చేసింది. భారతీయ మార్కెట్లో రూ.1.44 లక్షలుగా ఈ బైక్ ధర ఉంది.
ద్విచక్ర వాహన రంగంలో అగ్రగామిగా ఉన్న హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ).. తాజాగా సీబీ 200 ఎక్స్ అడ్వెంచర్ మోడల్‌ను భారత్‌లో ఆవిష్కరించింది. భారతీయ మార్కెట్లో రూ.1.44 లక్షలు (గురుగ్రామ్, ఎక్స్-షోరూమ్) వద్ద ఈ కొత్త అడ్వెంచర్ బైక్ విడుదలైంది. ఇప్పటికే దీని బుకింగ్స్‌ను సైతం ప్రారంభించింది. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ షోరూమ్‌లో రూ.2,000 చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు సెప్టెంబర్‌లో బైక్ డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలపింది. ఈ బైక్ పెర్ల్ నైట్‌స్టార్ బ్లాక్, మ్యాట్ సెలీన్ సిల్వర్ మెటాలిక్, స్పోర్ట్స్ రెడ్ అనే మూడు అద్భుతమైన కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. రోజువారీ అవసరాలతో పాటు ఆఫర్ రోడ్ రైడింగ్‌కు అనుగుణంగా ఈ బైక్‌ను తీర్చిదిద్దారు. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్, హీరో ఎక్స్‌ప్లస్ 200 రేంజ్ అడ్వెంచర్ బైక్‌లకు గట్టిపోటీనివ్వనుంది. Honda Amaze 2021: భారత్‌లో న్యూ హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్..జస్ట్ రూ.21 వేలతో బుకింగ్... Honda U-BE: సింగిల్ సీట్ ఈ-స్కూటర్.. ఫీచర్లు మాత్రం సూపర్.!
ఈ కొత్త బైక్‌పై హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ & సీఈఓ అట్సుషి ఒగాటా మాట్లాడుతూ ‘‘హోండా సిబి బైక్‌లు భారత్‌లో విశేషమైన ఆదరణ పొందాయి. ఇదే సిరీస్ నుంచి కొత్త బైక్‌ను పరిచయం చేయడం సంతోషంగా ఉంది. భారతీయ యువత అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ అర్బన్ ఎక్స్‌ప్లోరర్ - సీబీ200 ఎక్స్ బైక్‌ను డిజైన్ చేశాం. నూతన టెక్నాలజీకి అనుగుణంగా అనేక ఫీచర్లను అందించాం. నేటి యువతకు ఇది అద్భుతమైన రైడింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది” అని చెప్పారు.
రూ. 1.44 లక్షల ధరలో అందుబాటులోకి..
ఈ బైక్‌లో అనేక అప్డేటెడ్ ఫీచర్లను అందించింది హోండా సంస్థ. బీఎస్ 6 ప్రమాణాలకు అనుగుణంగా 184 సీసీ ఇంజిన్‌తో దీన్ని ఆవిష్కరించింది. ఈ ఇంజిన్ 8,500 ఆర్పీఎమ్ వద్ద 17 బీహెచ్పీ, 6000 ఆర్పీఎం వద్ద 16.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్‌ను కూడా దీనిలో అమర్చింది. గతంలో విడుదలైన హార్నెట్ 2.0 మోడల్లోనూ ఇదే ఇంజిన్‌ను చేర్చింది. సీబీ 200ఎక్స్‌లో ఎల్ఈడీ లైట్ సెటప్, ఫుల్ డిజిటల్ లిక్విడ్ క్రిస్టల్ మీటర్, స్ప్లిట్ సీట్, సింగిల్ ఛానల్ ఏబీఎస్, ఫ్రంట్, బ్యాక్ డిస్క్ బ్రేకులను అందించింది. ఈ బైక్‌కు ఎల్ఈడీ హెడ్లైట్లు, ఇండికేటర్స్‌ను అమర్చింది. ఈ బైక్ మైలేజీని మెరుగుపర్చేందుకు 8 ఆన్‌బోర్డ్ సెన్సార్లతో పాటు ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను చేర్చింది. దీని ముందు భాగంలో అప్‌సైడ్ డౌన్ పోర్క్, వెనుక భాగంలో మోనోషాక్ సెటప్ వంటివి అందించింది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.