రికార్డు స్థాయిలో Honda CB Shine అమ్మకాలు..కేవలం ఒక్క నెలలోనే ఎన్ని అమ్ముడుపోయాయంటే...

Honda CB Shine గత నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన మూడవ బైక్ గా నిలిచింది. 125 సిసి ఇంజన్ తో పనిచేసే Honda CB Shine నెలవారీ అమ్మకాల్లో ఇప్పటివరకు నమోదుచేసిన వాటిలో ఇదే అత్యధికమని హోండా సంస్థ పేర్కొంది.

news18-telugu
Updated: October 26, 2020, 10:59 PM IST
రికార్డు స్థాయిలో Honda CB Shine అమ్మకాలు..కేవలం ఒక్క నెలలోనే ఎన్ని అమ్ముడుపోయాయంటే...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
కరోనా మహమ్మారి అన్ని రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిన విషయం తెలిసిందే. అయితే, దీనికి భిన్నంగా ఆటోమొబైల్ పరిశ్రమ మాత్రం ఊహించిన దాని కంటే ఎక్కువ వృద్ధిని సాధించింది. దీనికి నిదర్శనమే భారత మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన Honda CB Shine బైక్లు గత నెలలో 1,18,004 అమ్ముడవడం. దీంతో Honda CB Shine గత నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన మూడవ బైక్ గా నిలిచింది. 125 సిసి ఇంజన్ తో పనిచేసే Honda CB Shine నెలవారీ అమ్మకాల్లో ఇప్పటివరకు నమోదుచేసిన వాటిలో ఇదే అత్యధికమని హోండా సంస్థ పేర్కొంది. కాగా, గత ఏడాది ఇదే నెలలో నమోదు చేసిన అమ్మకాలతో పోల్చితే, సిబి షైన్ 33 శాతం వృద్ధిని సాధించినట్లుగా చెప్పవచ్చు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో 88,893 యూనిట్ల బైక్ ను మాత్రమే విక్రయించగలిగిన హోండా ఈ ఏడాది 1.18 లక్షల యూనిట్ల విక్రయంతో కరోనా సమయంలోనూ గొప్ప అమ్మకాలను నమోదు చేసింది. Honda CB Shine - డ్రమ్ మరియు డిస్క్ అనే రెండు వేర్వేరు వేరియంట్లతో అందుబాటులో ఉంటుంది. భారత మార్కెట్లో డ్రమ్ వేరియంట్ ధర రూ .69,415లుగా ఉండగా, డిస్క్ వేరియంట్ ధర రూ .74,115 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ బైక్ 124 సిసి, సింగిల్ సిలిండర్, ఫోర్-స్ట్రోక్ ఇంజన్ తో పని చేస్తుంది. ఇది 7500 ఆర్పిఎమ్ వద్ద 10.7 పిఎస్ గరిష్ట శక్తినిస్తుంది. అలాగే 6000 ఆర్పిఎమ్ వద్ద 11 ఎన్ఎమ్ పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాక దీనిలోని ఇంజన్ 5- స్పీడ్ గేర్ బాక్స్ తో జతచేయబడుతుంది.

టూవీలర్ మార్కెట్లో 27.08 వాటా..

దీనిలో 130 ఎంఎం ఫ్రంట్ మరియు రియర్ డ్రమ్ బ్రేకింగ్ అందుబాటులో ఉంది. ముందు భాగంలో 240 ఎంఎం ఆప్షనల్ డిస్క్ బ్రేక్ వస్తుంది. జపాన్కి చెందిన ఈ వాహన తయారీ సంస్థ టూవీలర్ మార్కెట్లో మొత్తం 27.08 శాతం వాటాను కలిగి ఉంది. 2020 సెప్టెంబరులో హోండా కంపెనీ ఆటోమొబైల్ పరిశ్రమలో రెండవ స్థానాన్ని దక్కించుకోవడానికి సిబి షైన్ ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. హోండా కంపెనీ ఇటీవల భారతీయ మార్కెట్లో సరికొత్త హన్నెస్ సిబి 350 బైక్ను విడుదల చేసింది. ఈ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, బెనెల్లి ఇంపీరియేల్ 400, జావా బైక్ల మాదిరిగానే సబ్ 400 మోడ్రన్ క్లాసిక్ విభాగంలో చేరింది. ఇది 348.36 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ మోటారుతో పని చేస్తుంది. 5,500 ఆర్పిఎమ్ వద్ద 21 పిఎస్ శక్తిని మరియు 3,000 ఆర్పిఎమ్ వద్ద 30 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. హోండా హన్నెస్ సిబి 350 డిఎల్ఎక్స్ మరియు డిఎల్ఎక్స్ ప్రో అనే రెండు ట్రిమ్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ .1.85 లక్షలు మరియు రూ .1.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి.
Published by: Krishna Adithya
First published: October 26, 2020, 11:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading