హోమ్ /వార్తలు /బిజినెస్ /

Car Offers: కారు కొంటే రూ.40 వేల డిస్కౌంట్! పండుగ ఆఫర్ అదిరింది!

Car Offers: కారు కొంటే రూ.40 వేల డిస్కౌంట్! పండుగ ఆఫర్ అదిరింది!

Honda Offers | పండుగకు కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకని అనుకుంటున్నారా? ప్రస్తుతం కార్లపై అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 40 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Honda offers | దసరా లేదా దీపావళికి కొత్త కారు కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకని అనుకుంటున్నారా? కారు (Car) కొనుగోలు చేయాలని భావించే వారికి భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు పలు మోడళ్లపై డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించాయి. ఇప్పుడు వీటి సరసన హోండా (Honda) కార్స్ కూడా వచ్చి చేరింది.

  ప్రముఖ కార్ల తయారీ కంపెనీల్లో ఒకటైన హోండా కార్స్ కూడా తాజాగా పలు మోడళ్లపై తగ్గింపు ఆఫర్లు ప్రకటించింది. పండుగ సీజన్‌లో కార్లపై రూ. 39,298 వరకు తగ్గింపును అందిస్తోంది. మోడల్, వేరియంట్, లొకేషన్, షోరూమ్ ప్రాతిపదికన మారుతూ ఉంటాయని గుర్తించుకోవాలి. అందువల్ల కారు కొనాలని భావించే వారు దగ్గరిలోని డీలర్‌షిప్ వద్దకు వెళ్లి ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

  ఎస్‌బీఐ శుభవార్త.. రూ.40 వేల భారీ తగ్గింపు!

  హోండా కార్ ఆఫర్లు ఈ నెల చివరి వరకు అంటే అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటాయి. ఏ ఏ మోడళ్లపై ఎంత డిస్కౌంట్ ఉందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. హోండా డబ్ల్యూఆర్ వీ మోడల్‌పై ఎక్కువ బెనిఫిట్ పొందొచ్చు. రూ. 39,298 తగ్గింపు ఉంది. క్యాష్ డిస్కౌంట్ రూ. 10 వేల వరకు పొందొచ్చు. లేదంటే రూ. 12,298 విలువైన యాక్ససిరీస్ ఉచితంగా తీసుకోవచ్చు. ఇంకా ఎక్స్చేంస్ బోనస్ కింద రూ.10 వేల తగ్గింపు ఉంది. కార్పొరేట్ తగ్గింపు రూ. 5 వేలు పొందొచ్చు. అలాగే ప్రస్తుత హోండా కాస్టమర్లు లాయల్టీ బోనస్ కింద మరో రూ. 5 వేలు పొందొచ్చు. వీరికి ఎక్స్చేంజ్ బోనస్ రూ. 7 వేలు ఉంటుంది.

  30 నిమిషాల్లో రుణం.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అదిరిపోయే శుభవార్త!

  హోండా సిటీ కారుపై రూ. 37 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు ఉన్నాయి. క్యాష్ డిస్కౌంట్ రూ. 10 వలే వరకు, ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10 వేల వరకు, లాయల్టీ బోనస్ కింద రూ. 5 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 5 వేలు, ప్రస్తుత హోండా కస్టమర్లకు ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ. 7 వేలు తగ్గింపు వంటి బెనిఫిట్స్ ఉన్నాయి. హోండా జాజ్ కారుపై రూ. 25 వేల వరకు తగ్గింపు పొందొచ్చు.

  హోండా అమేజ్ కారుపై కూడా ఆఫర్ ఉంది. ఈ కారుపై రూ.8 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. లాయల్టీ బోనస్ రూ. 5 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 3 వేలు ఇందులో ఉన్నాయి. హోండా సిటీ నాల్గవ జనరేషన్ కారుపై రూ. 5 వేల లాయల్టీ బెనిఫిట్ పొందొచ్చు. అయితే ఈ కారుపై ఎక్స్చేంజ్ ఆఫర్, క్యాష్ డిస్కౌంట్ వంటివి లేవు.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Cars, Diwali, Honda, Latest offers, Offers

  ఉత్తమ కథలు