జపాన్‌కు చెందిన ఆటో దిగ్గజం హోండా కార్స్ ( Honda Cars) ఇండియన్ మార్కెట్‌లో సేల్స్ పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ఏడాదికి ఒక లేటెస్ట్ మోడల్‌తో మార్కెట్‌లోకి వచ్చేలా ప్లాన్ చేస్తోంది. ఈ కంపెనీ లాంచ్ చేసిన వాటిల్లో హోండా సిటీ మోడల్ బాగా పాపులర్ అయింది. డీసెంట్ లుక్, బెస్ట్ ఫీచర్స్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ మోడల్ సెడాన్ టైప్‌లో ఐదో జనరేషన్ కారుగా 2020లో భారత్‌లోకి అడుగు పెట్టింది. తాజాగా హోండా సిటీ అప్‌గ్రేడ్ వెర్షన్-2023 ఫేస్‌లిఫ్ట్‌ను హోండా లాంచ్ చేసింది. మరి, తాజా అప్ గ్రేడ్ మోడల్ ఫేస్‌లిఫ్ట్ ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం.
* రెండు వెర్షన్స్‌లో లభ్యం
హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ -2023 పెట్రోల్-ఓన్లీ, e:HEV అనే రెండు వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. పెట్రోల్-ఓన్లీ వెర్షన్ నాలుగు ట్రిమ్స్ SV, V, VX, ZX ల్లో లభిస్తుంది. e:HEV వెర్షన్ V, ZX అనే రెండు ట్రిమ్స్‌లో ఉంటుంది.
* ఎక్స్‌టీరియర్ కాస్మెటిక్ అప్‌డేట్స్
కొత్త సెడాన్ ఎక్స్‌టీరియర్‌లో అనేక కాస్మెటిక్ అప్‌డేట్స్ పొందింది. డైమండ్ చెకర్డ్ ఫ్లాగ్ ప్యాటర్న్‌తో కొత్తగా డిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్ ఉంది. ఫ్రంట్ బంపర్ కార్బన్ ర్యాప్డ్ లోయర్ మోల్డింగ్‌తో కొత్తగా కనిపిస్తోంది. ఇది స్పోర్టి ఫాగ్ ల్యాంప్ గార్నిష్‌తో అనుబంధంగా ఉంది. హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్-2023 న్యూ 16-అంగుళాల డ్యూయల్-టోన్ డైమండ్-కట్ మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్‌పై రన్ అవుతుంది. కారు వెనుక వైపు కార్బన్-ర్యాప్డ్ డిఫ్యూజర్, బాడీ కలర్ బూట్ లిప్ స్పాయిలర్‌తో కొత్త బంపర్ ఉంది. అబ్సిడియన్ బ్లూ పెర్ల్ రూపంలో ఫేస్‌లిఫ్ట్‌తో కంపెనీ సరికొత్త కలర్‌ను పరిచయం చేసింది.
ఇది కూడా చదవండి : చెన్నై రైల్వే స్టేషన్‌లో ‘యువర్ అటెన్షన్ ప్లీజ్’ ఇక వినపడదు.. ఎందుకంటే..
* క్యాబిన్ కలర్స్ , ఇతర ఫీచర్స్
ఫేస్‌లిఫ్ట్ క్యాబిన్.. పెట్రోల్ వేరియంట్‌లో డ్యూయల్-టోన్ బ్లాక్ అండ్ బీగీ (లేత గోధుమరంగు) థీమ్‌లో ఉంటుంది. e:HEV వెర్షన్‌లో ఐవరీ అండ్ బ్లాక్‌లో ఫినిష్డ్ డ్యూయల్-టోన్ అప్హోల్స్టరీగా ఉంటుంది. ఇతర ఫీచర్స్‌గా వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో, PM 2.5 క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్, స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ ద్వారా రిమోట్ కంట్రోల్ ఆపరేషన్, వన్-టచ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్ వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.
* హోండా సెన్సింగ్ డ్రైవర్ అసిస్ట్ సేఫ్టీ సిస్టమ్
హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్-2023లో హోండా సెన్సింగ్ డ్రైవర్ అసిస్ట్ సేఫ్టీ సిస్టమ్ ఉంటుంది. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ సమయంలో హోండా సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా ‘లో-స్పీడ్ ఫాలో’ రూపంలో మరో కొత్త ఫీచర్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. లీడ్ కార్ డిపార్చర్ నోటిఫికేషన్ సిస్టమ్ అనే మరో కొత్త ఫీచర్ కూడా హోండా సెన్సింగ్ సూట్ ఆఫ్ సేఫ్టీ ఫీచర్‌గా ఫేస్‌లిఫ్ట్‌లో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా సాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్‌గా 6 ఎయిర్‌బ్యాగ్స్, హోండా లేన్-వాచ్, మల్టీ-యాంగిల్ రియర్ వ్యూ కెమెరా, డిఫ్లేషన్ వార్నింగ్‌తో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎజైల్ హ్యాండ్లింగ్ అసిస్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్‌తో వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్ వంటివి ఉన్నాయి.
* 1.5L i-VTEC ఇంజన్
పెట్రోల్-ఓన్లీ వేరియంట్స్‌లో RDE-కంప్లైంట్ 1.5L i-VTEC ఇంజన్ ఉంటుంది. ఇది 6,600 rpm వద్ద 119 bhp పవర్‌ను, 4,300 rpm వద్ద 145 Nm గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. 17.8 kmpl, 18.4 kmpl మైలేజీ అందించే 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ CVT గేర్‌బాక్స్‌లతో ఇంజిన్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ఇంజన్ E5, E20 ఫ్యూయల్‌కు అనుగుణంగా డెవలప్ చేశారు.
e:HEV వేరియంట్స్‌లో హోండా యూనిక్ సెల్ఫ్- చార్జింగ్ డ్యూయల్ మోటార్ e-CVT హైబ్రిడ్ సిస్టమ్‌తో 1.5L అట్కిన్సన్-సైకిల్ i-VTEC పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. పవర్ అవుట్‌పుట్ 124 bhpగా ఉంది. మైలేజ్ 27.13 kmplను అందిస్తుంది. హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్-2023 ప్రారంభ ధర రూ.11,49,000 నుంచి గరిష్టంగా రూ.20,39,000గా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.