Home /News /business /

Honda Cars joins hands with IndusInd Bank: చౌక‌గా కార్‌లోన్‌.. ఇండ‌స్ ఇండ్ బ్యాంక్‌తో హోండా కార్స్ ఒప్పందం

Honda Cars joins hands with IndusInd Bank: చౌక‌గా కార్‌లోన్‌.. ఇండ‌స్ ఇండ్ బ్యాంక్‌తో హోండా కార్స్ ఒప్పందం

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ప్ర‌ముఖ వాహ‌న తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా(Honda Cars India) లో త‌న వినియోగ‌దారుల కోసం కొత్త ఫైనాన్స్ స్కీమ్‌(Finance Scheme) అందిస్తోంది. ఈ స్కీం అందించేందుకు ఇండ‌స్ ఇండ్ బ్యాంక్‌(IndusInd Bank)తో ఒప్పందం కుదుర్చుకొంది. దీని ద్వారా సులభంగా ఫైనాన్సింగ్‌, చెల్లింపులు చేసేలా వినియోగదారులకు అవకాశం కల్పించనుంది.

ఇంకా చదవండి ...
    క‌రోనా త‌రువాత ప్ర‌జా రవాణాలో(Public Transport) చాలా మార్పులు వ‌చ్చాయి. చాలా మంది సొంత వాహ‌నాల‌ను ఎక్కువ‌గా వినియోగిస్తున్నారు. నిత్యం అందుబాటులో ఉండే బ‌స్‌లు, ట్రైన్‌ల సంఖ్య మున‌ప‌టితో పోలిస్తే చాలా త‌క్కువ‌గా ఉన్నాయి. ప్ర‌జా రవాణా గతంలో మాదిరిగా న‌డిచినా.. జ‌నం వాటిని వినియోగించేందుకు ఎక్కువ‌గా ఆస‌క్తి చూప‌డం లేదు. చాలా మంది సొంత వాహ‌నాల‌పై దృష్టి పెడుతున్నారు.
    ఈ నేప‌థ్యంలో ఆటో మొబైల్ రంగం ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేందుకు కొత్త స్కీం ల‌ను తీసుకొస్తున్నాయి. వీలైనంత‌గా త‌మ మార్కెట్‌(Market)ను గ్రామీణ ప్రాంతాల‌కు చేరువ‌య్యేలా ప్ర‌య‌త్నిస్తున్నాయి. పండుగ సీజ‌న్‌ను దృష్టిలో పెట్టుకొని ఆటోమొబైల్ సంస్థ‌లు పీఎస్‌యూ(PSU), ప్రైవేటు బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకొంటున్నాయి.

    PayU to buy out BillDesk : ‘పే యూ’గా మారిన బిల్ డెస్క్.. రూ.34,376 కోట్ల ఒప్పందం




    వ‌డ్డీరేట్లు త‌గ్గించి ఈఎంఐ(EMI)లో వాహ‌నాల‌ను అందిస్తున్నాయి. ముఖ్యంగా సెమీ అర్బ‌న్‌(Semi Urban), గ్రామీణ ప్రాంత వాసులు కొనుగోలు చేసేందుకు వీలుగా చెల్లింపు స్కీంల‌ను త‌యారు చేస్తున్నాయి. రీ పేమెంట్(Re payment) ఆప్ష‌న్‌ల‌లో వినియోగ‌దారుల‌కు అనుకూల‌మై విధానాల‌ను అవ‌లంభించేలా ప్ర‌య‌త్నిస్తున్నాయి. కోవిడ్‌ 19(Covid 19) నేప‌థ్యంలో క‌స్ట‌మ‌ర్లు సుల‌భంగా కోనుగులు చేసేలా వ్య‌క్తిగ‌త మొబిలిటీ పేమెంట్ ఆప్ష‌న్‌ల‌ను అందింస్తున్నాయి.
    100 శాతం ఎక్స్ షోరూం లోన్‌..
    అందులో భాగంగానే ప్ర‌ముఖ వాహ‌న తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా(Honda Cars India) లో త‌న వినియోగ‌దారుల కోసం కొత్త ఫైనాన్స్ స్కీమ్‌(Finance Scheme) అందిస్తోంది. ఈ స్కీం అందించేందుకు ఇండ‌స్ ఇండ్ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకొంది. ఈ విష‌యాన్ని హోండా ప్ర‌క‌టించింది. ఈ భాగ‌స్వామ్యం ద్వారా క‌స్ట‌మ‌ర్ల ఫైనాన్సింగ్‌, చెల్లింపు అవ‌స‌రాల‌ను తీర్చేందుకు వీల‌వుతుంద‌ని కంపెనీ తెలిపింది. అంతే కాకుండా హోండా మోడ‌ళ్ల కొనుగోలు చేసే వారికి ఇండ‌స్ ఇండ్ బ్యాంక్(IndusInd Bank) ద్వారా త‌క్కువ ఈఎంఐ(EMI) అందించ‌నుంది. చెల్లింపుల్లో కూడా వినియోగదారుల‌కు అనుకూల విధానాన్ని అందిస్తుంది. ఈ స్కీంలో ముఖ్య‌మైంది 100 శాతం ఎక్స్‌షోరూం లోన్(Loan) పొంద‌డం. ఇది వినియోగ‌దారుల‌కు ఎంతో ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని సంస్థ తెలిపింది. ఈ స్కీం రెగ్యుల‌ర్(Regular) ఆదాయం ఉన్న‌ ఉద్యోగ‌స్తుల‌తోపాటు స్వ‌యం ఉపాధి ఉన్న వారు సొంత వాహ‌నాల‌ను(own Vehicle) సుల‌భంగా కొనుగోలు చేయ‌గ‌ల‌ర‌ని హోండా సంస్థ పేర్కొంది.
    ముఖ్యంగా పండుగ స‌మ‌యాల్లో ఉండే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని వినియోగ‌దారుల‌కు మ‌రింత సుల‌భంగా ఉండే కొనుగోలు విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టిన‌ట్టు హోండా కార్స్ ఇండియా మార్కెటింగ్‌, సేల్స్ సీనియ‌ర్ వైస్‌-ప్రెసిడెంట్ రాజేశ్ గోయ‌ల్ తెలిపారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Cars, Finance, Honda

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు