భారత్ లో అత్యుత్తమ వాహనాలను విడుదల చేస్తున్న సంస్థల్లో హోండా(Honda) ముందు వరుసలో ఉంటుంది. ఈ కంపెనీకి గ్రేటర్ నోయిడా కార్ల తయారీ ప్లాంట్ ఉంది. తాజాగా ప్లాంట్ నుంచి ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు బుధవారం హోండా కార్స్ ఇండియా(Honda cars India) ప్రకటించింది. అంతేకాకుండా హోండా సివిక్(Honda Civic), సీఆర్-వీ(Honda CR-V) మోడళ్లను భారత్ లో నిలిపివేయనున్నట్లు స్పష్టం చేసింది. గ్రేటర్ నోయిడా నుంచి రాజస్థాన్ లోని తపుకారా ప్లాంట్ ను మారుస్తున్నట్లు ఈ జపాన్ కార్ల(Japan Automaker) తయరీ సంస్థ తెలిపింది.
ఇది స్థుస్థిర, సమర్థవంతమైన కార్యకలాపాను భారత్ లో ఏకీకృతం చేస్తోందని, ఇక్కడ కేవలం నాలుగు మోడళ్లకే కదిస్తున్నట్లు హోండా స్పష్టం చేస్తుంది. తపుకారా ప్లాంట్లో ప్రస్తుతం 5500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అంతేకాకుండా 1.8 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉండి ఉత్పత్తి అవసరాన్ని తీర్చగలదు. హోండా నెలకు 9500 యూనిట్ల రిటైల్ చేస్తుంది. గ్రేటర్ నోయిడా ప్లాంట్లో హోండా సివిక్, సీఆర్-వీ యూనిట్లను తయారు చేస్తుంది. ఇప్పటికే హోండా సిటీ(Honda City) మోడల్ తయారీని తపుకారా ప్లాంట్ కు మార్చారు. సివిక్, సీఆర్-వీ మోడళ్లను తక్షణమే అమ్మకానికి తీసుకొచ్చారు.
హోండా మార్కెట్లో 70 శాతం హోండా సిటీ, డబ్ల్యూఆర్-వీ(WR-V), అమేజ్(Amaze), జాజ్(Jazz) లో ఉన్నాయి. కాబట్టి వాటితోనే ముందుకుసాగాలని నిర్ణయించింది. సివిక్, సీఆర్-వీ 3 నుంచి 4 శాతం మాత్రమే మార్కెట్ ను కలిగి ఉన్నాయి. అయినప్పటికీ మార్కెట్ ప్రీమియం విభాగంలో సంస్థ తన పరిధిని నెలకొల్పడానికి అవి ఇప్పటికీ ముఖ్యమైనవిగా పరిగణించబడుతున్నాయి. వాహన తయారీదారు ఇటీవలే సివిక్, సీఆర్-వీకి చెందిన బీఎస్6 వేరియంట్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. సివిక్, సీఆర్-వీ మెరుగైన అమ్మకాలను కలిగి ఉన్నప్పటికీ గ్రేటర్ నోయిడాలో ఉత్పత్తి వ్యయం భారీగా పెరగనుంది.
హోండా కార్స్ ఇండియా మార్కెట్ వాటా కూడా ఈ ఆర్థిక సంవత్సరం 3.7 శాతానికి పడిపోయింది. గతేడాది 5.5 శాతముంది. ఆర్థికసంవత్సరం 2015లో హోండా కార్స్ ఇండియా దాదాపు 7 శాతం వాటాను కలిగి ఉంది. ఈ విషయాన్ని సంస్థ ఉపాధ్యక్షుడు రాజేశ్ గోయల్ తెలియజేశారు.
"మేము ఉత్పత్తిని తపుకారా ప్లాంట్ నుంచి చేయాలనుకుంటున్నాం. గ్రేటర్ నోయిడా ప్లాంటును మూసివేయాలనుకుంటున్నాం. మార్కెట్లో దూసుకుయే విషయంలో కంపెనీకి ఇప్పటికే పెద్ద సంక్షోభం నెలకొంది. మార్కెట్ విభాగంలో 70 శాతం మాత్రమే పనిచేస్తోంది. దీంతో ఇది మరింత తగ్గుతుంది. భారత్ లో సిటీ, డబ్ల్యూఆర్-వీ, అమేజ్, జాజ్ అనే నాలుగు మోడళ్ల మాత్రమే ఉంటాయి" అని రాజేశ్ గోయల్ తెలిపారు.