Car Offer | మీరు కొత్త కారు కొనేందుకు రెడీ అవుతున్నారా? అయితే శుభవార్త. ప్రస్తుతం మార్కెట్‌లో భారీ డిస్కౌంట్ (Discount) అందుబాటులో ఉంది. ప్రముఖ వాహన తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా అదిరే ఆఫర్ (Offer) అందుబాటులోకి తీసుకువచ్చింది. తన మోడళ్లపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంచింది. కారు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు.
హోండా కార్లపై ఏకంగా రూ. 26 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. అమేజ్, డబ్ల్యూఆర్ వీ, హోండా సిటీ 5వ జనరేషన్ మోడళ్లపై తగ్గింపు అందుబాటులో ఉంది. ఇందులో లాయల్టీ బోనస్, కారు ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ తగ్గింపు, క్యాష్ డిస్కౌంట్ వంటివి అన్నీ కలిసి ఉంటాయి. ఈ కారు తగ్గింపు ఆఫర్లు కేవలం మార్చి 31 వరకే అందుబాటులో ఉంటాయని గుర్తించుకోవాలి.
రేపటి నుంచి డిస్కౌంట్‌లో బంగారం.. మార్కెట్ రేటు కన్నా రూ.1,000 తక్కువకే..
హోండా అమేజ్ కారుపై క్యాష్ డిస్కౌంట్ రూ. 5 వేల వరకు ఉంది. లేదంటే రూ. 6198 విలువైన యాక్సిసిరీస్ ఉచితంగా పొందొచ్చు. ఇంకా ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10 వేల వరకు ఉంది. లాయల్టీ బోనస్ రూ. 5 వేల వరకు ఉంది. ఇంకా కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 6 వేల వరకు లభిస్తుంది. ఇంకా డబ్ల్యూఆర్ వీ, హోండా సిటీ 5వ జనరేషన్ కారు విషయానికి వస్తే.. ఈ మోడళ్లపై లాయల్టీ బోనస్ రూ. 5 వేల వరకు వస్తుంది. హోండా కారు ఎక్స్చేంజ్ బోనస్ రూ. 7 వేల వరకు ఉంది. ఇంకా కార్పొరేట్ తగ్గింపు రూ. 5 వేల వరకు వస్తుంది.
బజాజ్ ఫైనాన్స్ కస్టమర్లకు భారీ శుభవార్త.. కంపెనీ కీలక నిర్ణయం!
కాగా మరోవైపు రెనో ఇండియా కంపెనీ కూడా మార్చి నెలల తగ్గింపు ఆఫర్లు ప్రకటించింది. ఏకంగా రూ. 60 వేలకు పైగా డిస్కౌంట్ అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్లు కూడా ఈ నెల చివరి వరకే అందుబాటులో ఉంటాయి. అందువల్ల రెనో కారు కొనే వారు కూడా ఈ ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. ఇకపోతే కారు ఆఫర్లు అనేవి ప్రాంతం, కారు మోడల్, వేరియంట్, డీలర్ షిప్ ప్రాతిపదికన మారుతూ ఉంటాయని గుర్తించుకోవాలి. అందువల్ల మీరు కారు కొనుగోలు చేయడానికి ముందు దగ్గరిలోని డీలర్ షిప్ వద్దకు వెళ్లి ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకోవాలి. తర్వాతనే కారు కొనాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాలి. మరిన్ని కంపెనీలు కారు ఆఫర్లు ప్రకటించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Best cars, Budget cars, Cars, Honda, Offers