Home /News /business /

HONDA ANNOUNCED CASHBACK OFFER ON HONDA SHINE BS 6 HERE FULL DETAILS NS GH

Honda Shine BS6: బీఎస్6 హోండా షైన్ బైక్‌ కొనుగోలుపై భారీ క్యాష్ బ్యాక్.. ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే.. క్యాష్ బ్యాక్ ఎంతంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హోండా బైక్ కొనాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. బీఎస్6 షైన్ మోడల్ పై క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి.

భారత మార్కెట్లో అత్యుత్తమ వాహనాలను విడుదల చేస్తోన్న సంస్థ హోండా. సరికొత్త మోటార్ సైకిళ్లు, స్కూటర్లను లాంఛ్ చేస్తూ బైక్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ కంపెనీ ఇప్పటికే తన వినియోగదారుల కోసం యాక్టివా 6జీ, గ్రేజియా 125, డియో బీఎస్6 లాంటి స్కూటర్లపై మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్లు, రాయితీలను కల్పించింది. తాజాగా ఈ జాబితాలో హోండా షైన్ కూడా చేరింది. తన బీఎస్6 షైన్ మోడల్ పై క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ప్రకటించింది. వినియోగదారులకు 5 శాతం క్యాష్ బ్యాక్ ఇచ్చింది. కార్డుపై రూ.3,500 వరకు రాయితీనిచ్చింది. ఈ ఆఫర్ కేవలం ఈఎంఐ ద్వారా లావాదేవీలు చేసేవారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు హోల్డర్లు ఈ ఆఫర్ పొందాలంటే కనీసం 40 వేల రూపాయల లావాదేవిని నిర్వహించాలి. ఈ రాయితీ మే 1 నుంచి జూన్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
SBI Offers: కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఆఫర్ ఇచ్చిన SBI.. ఆ వస్తువుల కొనుగోళ్లపై భారీ క్యాష్‌బ్యాక్.. వివరాలివే

90 లక్షల విక్రయాలు..
హోండా బైక్స్ లో అత్యంత పాపులరైన మోటార్ సైకిల్ షైన్. 2006లో తొలిసారి లాంచ్ అయిన ఈ షైన్ మోడల్ గతేడాది ముగిసేనాటికి 90 లక్షల విక్రయాలను అందుకున్నట్లు హోండా సంస్థ తెలిపింది. గత కొన్ని సంవత్సరాలుగా కమ్యూటర్ మోటార్ సైకిళ్లలో అత్యుత్తమంగా విజయవంతమైంది. లాంచ్ అయిన రెండేళ్లలోనే అత్యధిక విక్రయాలు అందుకున్న 125సీసీ బైక్ గా గుర్తింపు తెచ్చుకుంది. లాంచ్ అయిన మొదట 54 నెలల్లోనే 10 లక్షల వినియోగదారులు దీన్ని కొనుగోలు చేశారు.
Hero MotoCorp: భారత్​లో విడుదల కానున్న మొదటి హీరో ఎలక్ట్రిక్ స్కూటర్‌.. ఎప్పుడో తెలుసా?

రెండు వేరియంట్లలో లభ్యం..
బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా లాంచ్ అయిన ఈ బైక్ ప్రస్తుతం రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. డ్రమ్, డిస్క్ వేరియంట్లలో దీన్ని సొంతం చేసుకోవచ్చు. బేసిక్ డ్రమ్ వేరియంట్ ధర వచ్చేసి రూ.71,550(ఎక్స్ షోరూం)లుగా సంస్థ నిర్దేశించింది. డిస్క్ బ్రేక్ కలిగి ఉన్న హైయర్ వేరియంట్ ధర వచ్చేసి రూ.76,346లుగా నిర్ణయించింది కంపెనీ. ఈ ధరలన్నీ దిల్లీ ఎక్స్ షోరూంకు చెందినవి. ఈ సరికొత్త షైన్ బీఎస్6 మోడల్ 124సీసీ సింగిల్ సిలీండర్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 7500 ఆర్పీఎం వద్ద 10.59 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 6000 ఆర్పీఎం వద్ద 11 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 5-స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. మైలేజ్ గరిష్టంగా లీటరుకు 55 కిలోమీటర్లు ఇస్తుంది. అంతేకాకుండా దీని బరువు 114 కేజీలు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Bike, Cash, Honda, Two wheeler

తదుపరి వార్తలు