హోమ్ /వార్తలు /బిజినెస్ /

Honda Amaze: ఇదెక్కడి దూకుడు రా మామ.. ఇండియన్ మార్కెట్‌లో హోండా అమేజ్ సూపర్ రికార్డు..

Honda Amaze: ఇదెక్కడి దూకుడు రా మామ.. ఇండియన్ మార్కెట్‌లో హోండా అమేజ్ సూపర్ రికార్డు..

Honda Amaze

Honda Amaze

Honda Amaze: 2013లో మొదటిసారి ఇండియాలో లాంచ్ అయిన ఈ కారు, కొనుగోలుదారులకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందించి సూపర్ సక్సెస్ అయింది. అమేజ్ నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు మార్కెట్లో ఉంది. అయితే ఈ కారు అమ్మకాల పరంగా ఒక రికార్డు సాధించింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఆటోమొబైల్ (Automobile) కంపెనీల ప్రొడక్ట్స్ అమ్మకాలు గత కొంత కాలంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం SUVలకు డిమాండ్ ఉన్నా, అన్ని రకాల వెహికల్స్‌ అమ్మకాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక మార్కెట్‌ (Market)లో సక్సెస్ టాక్ వచ్చిన మోడళ్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అలాంటి వాటిలో హోండా అమేజ్ (Honda Amaze) ఒకటి. 2013లో మొదటిసారి ఇండియాలో లాంచ్ అయిన ఈ కారు, కొనుగోలుదారులకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందించి సూపర్ సక్సెస్ అయింది. అమేజ్ నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు మార్కెట్లో ఉంది. అయితే ఈ కారు అమ్మకాల పరంగా ఒక రికార్డు సాధించింది. హోండా అమేజ్ ఏకంగా ఐదు లక్షల యూనిట్ల సేల్స్ నమోదు చేసింది. ఈ వివరాలను హోండా కార్స్ ఇండియా బుధవారం వెల్లడించింది.2013లో ఇండియాలో లాంచ్ అయిన అమేజ్.. మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ ఆరా మోడళ్లతో పోటీ పడి మార్కెట్‌లో దూసుకుపోతోంది. ఈ క్రమంలో అమేజ్ కాంపాక్ట్ సెడాన్ ఐదు లక్షల యూనిట్ల సేల్స్‌ను క్రాస్ చేసినట్లు హోండా ఇండియా ప్రకటించింది. వివిధ ప్రైస్ రేంజ్‌లో SUVల హవా కొనసాగుతున్న ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో, ఇది అద్భుతమైన విజయమని కంపెనీ వెల్లడించింది.
* పెరిగిన అమ్మకాలు
గత కొన్ని సంవత్సరాల్లో హోండా అమేజ్ పెట్రోల్ వేరియంట్‌ అమ్మకాలు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా మొత్తం అమ్మకాల్లో ఈ మోడల్ చాలాసార్లు టాప్‌లో నిలిచింది. కంపెనీ అమ్మకాలలో దీని వాటా ఏకంగా 40% కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. టైర్ 1 మార్కెట్లలో అమేజ్ సేల్స్ ట్రెండ్ దాదాపు 40 శాతం ఉండగా, టైర్ 2, టైర్ 3 మార్కెట్లలో దీని కాంట్రిబ్యూషన్ 60 శాతంగా ఉంది.


ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు సేల్స్‌ చూస్తే కారు పెట్రోల్ వేరియంట్ మొత్తం సేల్స్‌లో 93 శాతంగా నమోదైంది. హోండా కంపెనీకి రాజస్థాన్‌లో ఉన్న టపుకరా ప్లాంట్‌లో అమేజ్ వెహికల్స్‌ను తయారు చేస్తున్నారు. ఈ మోడల్‌ను సంస్థ దేశీయ, విదేశీ మార్కెట్లలో కూడా అమ్మింది.
* మార్కెట్లో సెకండ్ జనరేషన్
అమేజ్ సెడాన్ సెకండ్ జనరేషన్ వెర్షన్‌ను హోండా గత ఏడాది ఆగస్టులో లాంచ్ చేసింది. బ్రాండ్ నుంచి ఎక్కువ సేల్స్ నమోదు చేస్తున్న మోడళ్లలో అమేజ్ ఒకటి. పెద్ద, చిన్న నగరాల్లో పాపులారిటీ, యాక్సెప్టెన్స్ అమేజ్ సొంతమని తెలిపారు హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ టకుయా సుమురా. ప్రీమియం సెడాన్, కస్టమర్ అవసరాలకు సరిపోలడమే కాకుండా, వారి అంచనాలను మించిపోతుందనడానికి తాజా రికార్డు నిదర్శనమని చెప్పారు.
ఇది కూడా చదవండి : Tata Motors: టాటా మోటార్స్ నుంచి ఫస్ట్ CNG ట్రక్కు లాంచ్.. పూర్తి వివరాలివే..


* ఫస్ట్ టైమ్ కారు కొనేవారే ఎక్కువ..
అమేజ్ కస్టమర్లలో 40% మంది మొదటిసారి కారు కొన్నవారే ఉన్నట్లు కంపెనీ వెల్లడించిన డేటా ద్వారా తెలుస్తోంది. తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లను అందించడం, మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువగా ఉండటంతో పాటు కిలోమీటర్లతో సంబంధం లేకుండా మూడేళ్ల వరకు వారంటీని అందించడం.. అమేజ్ పాపులారిటీ పెరిగింది. 2013లో లాంచ్ అయినప్పుడు అమేజ్‌లో ఆటోమేటిక్స్ వాటా 9% ఉండగా, ప్రస్తుతం 30% కంటే ఎక్కువకు పెరిగిందని డేటా వెల్లడించింది.
* కొత్త మోడల్ ప్రత్యేకతలు
2021లో వచ్చిన లేటెస్ట్ హోండా అమేజ్.. బెస్ట్ డిజైన్, విశాలమైన ఇంటీరియర్‌, ఇతర అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. దీంట్లో ఎన్నో లేటెస్ట్ ఫీచర్లను అందించారు. అమేజ్ డీజిల్ వెర్షన్ 1.5L i-DTEC ఇంజిన్‌తో రెండు ట్రిమ్స్‌లో అందుబాటులో ఉంది. పెట్రోల్‌ ఎడిషన్‌ 1.2L i-VTEC ఇంజిన్‌తో.. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, CVT వంటి రెండు ట్రిమ్స్‌లో లభిస్తుంది. వేరియంట్‌ను బట్టి దీని ధర రూ. 6.62 లక్షల నుంచి రూ.11.50 లక్షల మధ్య ఉంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Auto, Cars, Honda

ఉత్తమ కథలు