news18-telugu
Updated: November 6, 2020, 1:45 PM IST
ప్రతీకాత్మక చిత్రం
కరోనా ప్రభావం కాస్త తగ్గినా.. ప్రజలు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ప్రయాణించడానికి ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా బస్సు ఎక్కాలంటేనే అంటేనే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో టూ వీలర్ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో వాటి అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి. గేర్లు మార్చే పనిలేకుండా చాలా సులువగా డ్రైవ్ చేయవచ్చిని అనేక మంది స్కూటర్లు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. సిటీల్లో వీటి అమ్మకాలు అధికంగా ఉన్నాయి. అయితే పండుగ సీజన్లలో స్కూటర్ కొనేందుకు ప్లాన్ చేస్తున్న వారికి ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హోండా శుభవార్త చెప్పింది. యాక్టీవా కొనుగోళ్లపై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. తద్వారా తమ అమ్మకాలను పెంచుకునేందకు కంపెనీ ప్లాన్ చేసింది. ఆ ఆఫర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..
-హోండా యాక్టీవా స్కూటర్ కొనుగోలు చేసిన అనంతరం క్రెడిట్, లేదా డెబిట్ కార్డు ద్వారా చెల్లింపు చేస్తే అద్భుతమైన క్యాష్ బ్యాక్ పొందొచ్చు. ఇలా చెల్లింపులు చేసిన వారికి రూ.5,000 వరకు క్యాష్ బ్యాక్ అందుకునే అవకాశాన్ని కంపెనీ కల్పించింది.
-హోండా ఆక్టీవా కొనుగోలుపై క్యాష్ డిస్కౌంట్, కార్పొరేట్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ తదితర ఆఫర్లను కంపెనీ అందిస్తోంది. దీంతో రూ.11,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
-యాక్టీవా కొనుగోళ్లపై పేటీఎం సైతం సూపర్ ఆఫర్ అందిస్తోంది. హోండా యాక్టివా కొనుగోలు చేసిన అనంతరం పేటీఎం నుంచి డబ్బులు చెల్లిస్తే రూ.7,500 వరకు క్యాష్‌బ్యాక్ అందుకునే అవకాశం ఉంది.
-యాక్టీవా కొనుగోలుకు తక్కువ రుణాలను సైతం అందిస్తున్నారు. ఈ రుణాలపై కేవలం 7.99 శాతం నుంచి వడ్డీ ఉంటుంది. ఇతర ఫైనాన్స్ కంపెనీలతో పోలిస్తే ఈ వడ్డీ చాలా తక్కువ.
-మరో ఆఫర్ ను సైతం హోండా అందిస్తోంది. స్కూటర్ కొనడానికి సరిపడా డబ్బులు లేకపోతే లోన్ కూడా తీసుకోవచ్చు. తద్వారా స్కూటర్ ధరకు 100 శాతం ఫైనాన్స్ లభించనుంది.
-లోన్ తీసుకుని స్కూలర్ కొనేవారికి మరో ప్రయోజనాన్ని కూడా కంపెనీ అందిస్తోంది. తొలి మూడు నెలల పాటు సగానికి కన్నా తక్కువ ఈఐంఐ చెల్లించే అవకాశాన్ని కల్పిస్తోంది.
Published by:
Nikhil Kumar S
First published:
November 6, 2020, 12:37 PM IST