హోమ్ /వార్తలు /బిజినెస్ /

Honda Activa H-Smart: హోండా యాక్టీవా కొత్త మోడల్ వచ్చేసింది... అదిరిపోయిన స్మార్ట్ ఫీచర్స్

Honda Activa H-Smart: హోండా యాక్టీవా కొత్త మోడల్ వచ్చేసింది... అదిరిపోయిన స్మార్ట్ ఫీచర్స్

Honda Activa H-Smart: హోండా యాక్టీవా కొత్త మోడల్ వచ్చేసింది... అదిరిపోయిన స్మార్ట్ ఫీచర్స్
(Photo: Paras Yadav/News18.com)

Honda Activa H-Smart: హోండా యాక్టీవా కొత్త మోడల్ వచ్చేసింది... అదిరిపోయిన స్మార్ట్ ఫీచర్స్ (Photo: Paras Yadav/News18.com)

Honda Activa H-Smart | మార్కెట్లోకి కొత్త హోండా యాక్టీవా మోడల్ వచ్చేసింది. స్మార్ట్ ఫీచర్స్, పేటెంట్ టెక్నాలజీతో యాక్టీవా హెచ్-స్మార్ట్ (Activa H-Smart) రిలీజైంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

భారతీయ స్కూటర్ మార్కెట్‌లో హోండా యాక్టీవా (Honda Activa) స్కూటర్‌ది తిరుగులేని ఆధిపత్యం. ప్రతీ ఏటా భారతదేశంలో ఇతర బ్రాండ్ల స్కూటర్లు ఎన్ని అమ్ముడుపోతాయో, కేవలం యాక్టీవా యూనిట్స్ అన్ని అమ్ముడు పోతుంటాయి. తమ కస్టమర్ల అంచనాలను ఏమాత్రం తగ్గించకుండా హోండా టూవీలర్స్ ఇండియా యాక్టీవా హెచ్-స్మార్ట్ (Activa H-Smart) మోడల్‌ను తీసుకొచ్చింది. హోండా యాక్టీవా హెచ్-స్మార్ట్ ఢిల్లీలో ఎక్స్-షోరూమ్ ధర రూ.74,356. ఇది మూడు వేరియంట్లలో వస్తుంది. స్టాండర్డ్, డీలక్స్, స్మార్ట్ వేరియంట్లలో కొనొచ్చు. ఇందులో అనేక స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి. వీటిలో ఎక్కువగా హోండా పేటెంట్ పొందిన ఫీచర్స్ కావడం విశేషం.

హోండా యాక్టీవా హెచ్-స్మార్ట్ ప్రత్యేకతలివే

యాక్టీవా హెచ్-స్మార్ట్ మోడల్‌లో స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి. హోండా స్మార్ట్ కీ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇందులో స్మార్ట్ అన్‌లాక్, స్మార్ట్ ఫైండ్, స్మార్ట్ స్టార్ట్, స్మార్ట్ సేఫ్, ఇంజిన్ స్టార్ట్, స్టాప్ స్విచ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. 18-లీటర్ల అండర్ సీట్ స్టోరేజీని యాక్సెస్ కోసం ప్రత్యేకమైన డబుల్ లిడ్ ఫ్యూయెల్ ఓపెనింగ్ సిస్టమ్ ఉండటం విశేషం. లాక్ మోడ్‌లో 5 ఇన్ 1 లాక్ ఫంక్షన్ ఉంది.

Tax Saving Tips: పన్ను ఆదా చేయాలా? మరి ఈ అలవెన్సుల గురించి తెలుసా?

యాక్టీవా స్కూటర్ మార్కెట్‌ను తిరిగి యాక్టివేట్ చేసింది. ఇప్పుడు ఒక దశాబ్దానికి పైగా అత్యధికంగా అమ్ముడవుతున్న ద్విచక్ర వాహనాల్లో ఒకటిగా ఉంది. మా కస్టమర్ల ఎప్పటికప్పుడు మారుతున్న అంచనాలను అందుకోవడం కోసం అనేక అవతారాల్లో వస్తోంది. ఈ రోజు మేము కొత్త OBD2 అనుగుణంగా యాక్టీవా 2023ని తీసుకొచ్చాం. వినియోగదారులకు మరింత విలువను అందించే సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్‌లను ఆవిష్కరిస్తున్నాము.

అత్సుషి ఒగాటా, మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ అండ్ సీఈఓ, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా

స్కూటర్ కొత్తగా రూపొందించిన అల్లాయ్ వీల్స్‌పై ప్రయాణిస్తుంది. ఇతర స్టైలింగ్ హైలైట్స్ చూస్తే త్రీడీ చిహ్నం, సిల్వర్ గ్రాబ్రెయిల్, సైడ్ వింకర్‌లతో కూడిన టెయిల్-ల్యాంప్ ఉన్నాయి. కాంబి-బ్రేక్ సిస్టమ్ (CBS), టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, 3-స్టెప్ అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్, 12-అంగుళాల ఫ్రంట్ వీల్, సైడ్ స్టాండ్ విత్ ఇంజిన్ ఇన్హిబిటర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. యాక్టీవా హెచ్-స్మార్ట్ మోడల్‌లో 5 పేటెంట్ అప్లికేషన్స్ ఉండటం విశేషం.

IRCTC Tirupati Tour: ఈ వారం లాంగ్ వీకెండ్... తిరుపతి టూర్ ప్లాన్ చేసుకోండిలా

2023 హోండా యాక్టివాలో OBD2 అనుగుణంగా 110cc PGM-FI పెట్రోల్ ఇంజిన్‌ ఉంది. మెరుగైన స్మార్ట్ పవర్ అందించబడుతుంది. కలర్స్ విషయానికి వస్తే పెరల్ సిరెన్ బ్లూ, డీసెంట్ బ్లూ మెటాలిక్, రెబెల్ రెడ్ మెటాలిక్, బ్లాక్, పెరల్ ప్రీషియస్ వైట్, మ్యాటీ యాక్సిస్ గ్రే మెటాలిక్ కలర్స్‌లో లభిస్తుంది.

First published:

Tags: Auto News, Honda Activa, SCOOTER, Two wheeler

ఉత్తమ కథలు