హోమ్ /వార్తలు /బిజినెస్ /

హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌ రాబోతోంది.. ధర, ఫీచర్లు, లాంచింగ్, ఇతర వివరాలు..

హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌ రాబోతోంది.. ధర, ఫీచర్లు, లాంచింగ్, ఇతర వివరాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హోండా కంపెనీ హోండా యాక్టివాకి ఎలక్ట్రిక్ వెర్షన్‌ స్కూటర్ తెచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పుడున్న యాక్టివా మాదిరిగా కనిపించే హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ (Honda Activa Electric Scooter) రానుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada | Visakhapatnam | Guntur

టూవీలర్ల తయారీ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్ అండ్‌ స్కూటర్‌ ఇండియా (HMSI) పరిచయం చేసిన యాక్టివా స్కూటర్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. 20 ఏళ్ల కాలంలో ఎన్నో అప్‌డేట్స్‌తో వచ్చిన ఈ స్కూటర్ కోట్లాదిమంది భారతీయులకు ఫేవరెట్‌గా మారిపోయింది. అయితే ఇప్పుడు ప్రజలు పెట్రోల్‌తో నడిచే స్కూటర్ల కంటే విద్యుత్‌తో నడిచే ఈ-స్కూటర్లనే ఎక్కువగా కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. దీనిని గమనించిన హోండా కంపెనీ హోండా యాక్టివాకి ఎలక్ట్రిక్ వెర్షన్‌ స్కూటర్ తెచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పుడున్న యాక్టివా మాదిరిగా కనిపించే హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ (Honda Activa Electric Scooter) రానుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

తొలి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఫ్యూచరిస్టిక్ యాక్టివా

కంపెనీ నుంచి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌గా 'ఫ్యూచరిస్టిక్ యాక్టివా' 2023లో లాంచ్ చేస్తామని ఇటీవల హెచ్‌ఎంఎస్‌ఐ ఎండీ, ప్రెసిడెంట్, సీఈఓ అట్సుషి ఒగాటా ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. సిటీ, సెమీ-అర్బన్ ప్రాంతాలలో తక్కువ దూర ప్రయాణానికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బాగా ఉపయోగపడుతుందన్నారు. కంపెనీ ఇండియన్ మార్కెట్ కోసం తీసుకొస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీలో జపాన్ ఇంజనీర్ల సహాయాన్ని కూడా ప్రస్తుతం హెచ్‌ఎంఎస్‌ఐ తీసుకుంటోందని సమాచారం. ఇండియాలోని పరిస్థితులకు అనుకూలంగా ఈ-స్కూటర్ కోసం ఫండమెంటల్ టెక్నాలజీ, ప్లాట్‌ఫామ్‌ను డెవలప్ చేయడానికి ఒక జపనీస్ ఇంజనీర్ల టీమ్‌ను హెచ్‌ఎంఎస్‌ఐ కంపెనీ ఏర్పాటు చేస్తోందని సీఈఓ అట్సుషి తెలిపారు.

Kia Sonet X-Line: ఇండియాలో కియా సోనెట్ X-లైన్‌ ఎస్‌యూవీ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లపై ఓ లుక్కేయండి..


2023లోనే మార్కెట్‌లోకి లాంచ్‌?

హోండా ఇండియా అతిపెద్ద మోటార్‌సైకిల్ తయారీదారుగా ఉన్నందున.. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లోకి ఎప్పుడు అడుగు పెడుతుందా అని కొనుగోలుదారుల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2023లోగా తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేస్తామని సీఈఓ అట్సుషి క్లియర్ హింట్ ఇవ్వడంతో వారంతా ఖుషి అవుతున్నారు. అయితే కంపెనీ నుంచి వస్తున్న ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది హోండా యాక్టివాకి ఎలక్ట్రిక్ వేరియంటా కాదా అనేదానిపై పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. అయితే హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వెర్షన్ అందుబాటులోకి వచ్చిన సాధారణ పెట్రోల్ ఇంజన్ స్కూటర్ ఐదేళ్ల వరకు ఉత్పత్తి లోనే ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

Mahindra XUV 400: మహీంద్రా నుంచి ఆల్-ఎలక్ట్రిక్ XUV 400.. దీని ప్రత్యేకతలు అదుర్స్.. లాంచ్ ఎప్పుడంటే..ధర రూ.1.10 లక్షలుగా ఉండే అవకాశం

హోండా తన ఎలక్ట్రిక్ టూ వీలర్ల కోసం లోకల్ ప్రొడక్ట్స్ వినియోగించాలని ఆలోచిస్తోంది. దీంతో తక్కువ ఖర్చుతో ఈ స్కూటర్లను తీసుకు రావడం సాధ్యం అవుతుంది. దీనివల్ల ఈ స్కూటర్స్ పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి. మొట్టమొదటిగా తీసుకువచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ ధర వీలైనంత తక్కువగా ఉండేలా ఈ కంపెనీ జాగ్రత్తలు తీసుకుంటుంది. అలాగే ఒక చక్కటి రేంజ్ అందించేందుకు బ్యాటరీ ఎక్స్‌చేంజ్ ఆప్షన్స్ కూడా పరిశీలిస్తోంది. ఈ స్కూటర్ ఒక రూ.1.10 లక్షల ధరతో అందుబాటులోకి రావచ్చని అంచనా.

Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Electric bike, Electric Scooter, Electric Vehicle, Electric Vehicles, Honda

ఉత్తమ కథలు