Honda Electric Scooter | మీరు కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే శుభవార్త. దేశంలోనే బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ అయిన యాక్టివాలో ఎలక్ట్రిక్ వేరియంట్ మార్కెట్‌లోకి రాబోతోంది. కంపెనీ హోండా (Honda) యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్‌పై కీలక ప్రకటన చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎప్పుడు తీసుకువచ్చేది వెల్లడించింది. హోండా యాక్టివా (Activa) ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చే ఏడాది జనవరిలో మార్కెట్‌లోకి రాబోతోంది. అందువల్ల ఎవరైనా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తూ ఉంటే.. ఇంకొంత కాలం ఆగడం ఉత్తమం. హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనొచ్చు.
హోండా సీఈవో అత్సుశి ఓగాటా మాట్లాడుతూ.. హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చే ఏడాది జనవరి నెలలో మార్కెట్‌లో వస్తుందని ప్రకటించారు. మీడియా నివేదికల ప్రకారం చూస్తే.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో బ్యాటరీ స్వాపింగ్ ఫెసిలిటీ ఉండొచ్చు. దీని కోసం హోండా కంపెనీ బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్‌తో భాగ్వస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో స్వాపబుల్ బ్యాటరీ ఫీచర్‌తో వచ్చే తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే కానుంది.
150 కి.మి. రేంజ్‌తో అదరగొడుతున్న 3 టైర్ల ఎలక్ట్రిక్ స్కూటర్.. అస్సలు కింద పడరు!
యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఫ్లాట్ సీటు, ఇండికేటర్ మౌంటెడ్ ఫ్రంట్ ఎప్రాన్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. కంపెనీ అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా వీటిని విక్రయించనుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్, సింపుల్ ఎనర్జీ వన్, ఏథర్ 450 ఎక్స్, బౌన్స్ ఇన్‌ఫినిటీ ఈ1 వంటి మోడళ్లతో పోటీ పడనుంది.
భారీగా తగ్గిన బంగారం డిమాండ్.. కారణం ఇదే!
హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 50 కిలోమీటర్ల మేర ఉండొచ్చు. అలాగే కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ కన్నా ముందే దేశవ్యాప్తంగా బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. 6 వేల బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ 165 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చనే అంచనాలు ఉన్నాయి. అయితే కంపెనీ ఎంత రేంజ్‌ను అందిస్తుందో చూడాల్సి ఉంది.
మరోవైపు హోండా కంపెనీ ఇటీవలనే యాక్టివాలో హెచ్ స్మార్ట్ వేరియంట్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 74,536గా ఉంది. కీలెస్ ఆపరేషన్, అలాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ వస్తున్న తొలి ఓబీడీ2 కాంప్లియెంట్ టూవీలర్ ఇదే కావడం గమనార్హం. స్మార్ట్ లాక్, స్మార్ట్ స్టార్ట్, స్మార్ట్ సేఫ్ వంటి పీర్లు కూడా ఉన్నాయి. ఇందులో 110 బీఎస్ 6 ఇంజిన్ ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: E scootor, Electric Scooter, Electric Vehicles, Ev scooters, Honda, Honda Activa, SCOOTER