హోమ్ /వార్తలు /బిజినెస్ /

Honda Activa 6G: రూపాయి కట్టకుండానే ఇంటికి తీసుకెళ్లొచ్చు, పైగా క్యాష్ బ్యాక్

Honda Activa 6G: రూపాయి కట్టకుండానే ఇంటికి తీసుకెళ్లొచ్చు, పైగా క్యాష్ బ్యాక్

Honda Activa 6g (Image: Honda Mobiles India/Twitter)

Honda Activa 6g (Image: Honda Mobiles India/Twitter)

2020 సంవత్సరానికి మరికొన్ని రోజుల్లో ముగింపు పలకనుండడంతో కార్లు, బైక్‌ల కంపెనీలు పెద్ద ఎత్తున ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ జాబితాలో ప్రముఖ హోండా కంపెనీ కూడా కొన్ని ఆఫర్లను ప్రకటించింది. హోండా యాక్టివ్ 6జీ మోడల్ మీద కూడా ఈ ఆఫర్‌ను ప్రకటించింది.

ఇంకా చదవండి ...

  2020 సంవత్సరానికి మరికొన్ని రోజుల్లో ముగింపు పలకనుండడంతో కార్లు, బైక్‌ల కంపెనీలు పెద్ద ఎత్తున ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ జాబితాలో ప్రముఖ హోండా కంపెనీ కూడా కొన్ని ఆఫర్లను ప్రకటించింది. ప్రస్తుతం అత్యధికంగా అమ్ముడవుతున్న హోండా యాక్టివ్ 6జీ మోడల్ మీద కూడా ఈ ఆఫర్‌ను ప్రకటించింది. కంపెనీ అధికంగా రూ.5000 క్యాష్ బ్యాక్ కూడా ఆఫర్ చేస్తుంది. అయితే, అందుకు ఒక చిన్న కండిషన్ ఉంది. హోండా కంపెనీతో పార్టనర్ బ్యాంక్స్‌కు సంబంధించిన క్రెడిట్ కార్డులు, లేదా డెబిట్ కార్డులు ఉంటే చాలు. ఈ ఆఫర్ కింద కస్టమర్లకు కేవలం రూ.5000 క్యాష్ బ్యాక్ మాత్రమే కాదు. డాక్యుమెంటేషన్‌కి సంబంధించి ఎలాంటి తలనొప్పులు లేకుండా లోన్ తీసుకోవచ్చు. ఒక్క రూపాయి కూడా డౌన్ పేమెంట్ కట్టకుండా మీరు హోండా యాక్టివ్ 65 స్కూటర్‌ను ఇంటికి తీసుకుని వెళ్లవచ్చు.

  హోండా యాక్టివా 6జీ భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఫ్యామిలీ స్కూటర్. మహిళలు, పురుషులు, యువత, వృద్ధులు అన్ని వర్గాల వారికి అంత భారీ సంఖ్యలో కొంటున్నా కూడా దీనిపై ఆఫర్ ప్రకటించడం విశేషం. BS6 ట్రాన్సిషన్‌లో భాగంగా చాలా పార్ట్‌లు మార్పులు చేసింది. 12 అంగుళాల ఫ్రంట్ వీల్, టెలిస్కోపిక్ ఫోర్క్స్, 110 సీసీ ఇంజిన్ సామర్థ్యం ఉన్న యాక్టివా 6జీ 7.68bhp, 8.79Nmతో పనిచేస్తుంది. దీనికి పెట్రోల్ ట్యాంక్ క్యాప్ కూడా బయట నుంచే ఇచ్చారు. పెట్రోల్ కోసం ఆగిన ప్రతిసారీ సీటు ఓపెన్ చేయాల్సిన పనిలేదు. ఇంజిన్ స్టార్ట్, స్టాప్ స్విచ్ ఉంది. సైలెంట్ స్టార్టర్ కూడా ఉంది.

  హోండా యాక్టివా 6జీ రెండు వేరియంట్లలో ఆఫర్లు ఇస్తోంది. స్టాండర్డ్, డీల్స్ మోడళ్లపై లభిస్తుంది. స్టాండర్డ్ మోడల్ ధర రూ.65892, డీలక్స్ మోడల్ ధర రూ.67,392 (హైదరాబాద్‌లో కొంచెం రూ.100, రూ.200 తేడా ఉంటుంది). యాక్టివా 6జీలో ఆరు కలర్స్ అందుబాటులో ఉన్నాయి. బ్లూ, రెడ్, పసుపు, బ్లాక్, వైట్, గ్రే కలర్స్ లో లభిస్తుంది.

  హైదరాబాద్‌లో హోండా యాక్టివా 6జీ ధర

  ఎక్స్ షో రూం ధర రూ. 67,528

  ఆర్టీఓ ట్యాక్స్ రూ. 7,578

  ఇన్సూరెన్స్ రూ. 6,054

  హైదరాబాద్‌లో ఆన్ రోడ్ ధర రూ.81,160

  హోండా కంపెనీ పార్ట్‌నర్ బ్యాంక్స్

  బ్యాంక్ ఆఫ్ బరోడా, యెస్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్, ఫెడరల్ బ్యాంక్

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Auto News, Automobiles, Bike, Honda

  ఉత్తమ కథలు