HONDA ACTIVA 125 PREMIUM EDITION LAUNCHED IN INDIA HERE PRICE AND OTHER DETAILS NS GH
Honda Activa 125: హోండా యాక్టీవా ఫాన్స్ కు శుభవార్త.. 125 ప్రీమియం ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ధర, ఇతర వివరాలివే..
హోండా యాక్టీవా ఫాన్స్ కు శుభవార్త.. 125 ప్రీమియం ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ధర, ఇతర వివరాలివే
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్స్ ఇండియా తాజాగా యాక్టివా (Activa) 125 ప్రీమియం ఎడిషన్ స్కూటర్ల(Scooter) ను విడుదల చేసింది. కొత్త హోండా యాక్టివా 125 మొత్తం రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. దీని డ్రమ్ బ్రేక్స్ ఎడిషన్ రూ. 78,725, డిస్క్ బ్రేక్ ఎడిషన్ రూ. 82,280 వద్ద విడుదలయ్యాయి.
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్స్ (Honda Motors) ఇండియా తాజాగా యాక్టివా 125 (Activa 125) ప్రీమియం ఎడిషన్ స్కూటర్ల(Scooter) ను విడుదల చేసింది. కొత్త హోండా యాక్టివా 125 మొత్తం రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. దీని డ్రమ్ బ్రేక్స్ ఎడిషన్ రూ. 78,725, డిస్క్ బ్రేక్ ఎడిషన్ రూ. 82,280 వద్ద విడుదలయ్యాయి. స్టాండర్డ్ యాక్టివా 125 ఎడిషన్‌కు కాస్మెటిక్ అప్డేట్ను చేర్చి తాజా వెర్షన్లను కంపెనీ విడుదల చేసింది. ఈ రెండు వేరియంట్లు కొత్త డ్యుయల్ టోన్ కలర్ షేడ్స్‌లో అందుబాటులో ఉంటాయి. ఇందులో మ్యాట్ మాగ్నిఫిసెంట్ కాపర్ మెటాలిక్/ పెర్ల్ అమేజింగ్ వైట్, మ్యాట్ ఎర్ల్ సిల్వర్ మెటాలిక్/ మ్యాట్ స్టీల్ బ్లాక్ మెటాలిక్ అనే రెండు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. స్టైలింగ్ అప్డేట్స్ పరంగా చూస్తే.. ఈ తాజా యాక్టివా స్కూటర్ డ్యుయల్-టోన్ బాడీ కలర్ స్కీమ్‌తో వస్తుంది. దీనిలో 125 సీసీ గేర్‌లెస్ స్కూటర్ బాడీ ప్యానెల్స్, బాడీ-కలర్ గ్రాబ్ రైల్, బ్లాక్-కలర్ ఫ్రంట్ సస్పెన్షన్, బ్లాక్-అవుట్ ఇంజన్‌పై కొత్త డీకాల్స్ వంటి అద్భుతమైన ఫీచర్లను హెండా మోటార్స్ చేర్చింది.
యాక్టివా125 ప్రీమియం వేరియంట్లోని మిగిలిన ఫీచర్స్ స్టాండర్డ్ వేరియంట్ మాదిరిగానే ఉంటాయి. యాక్టివా 125 భారతదేశంలో మొట్టమొదటి బీఎస్6 కంప్లైంట్ స్కూటర్‌గా విడుదలైంది. ఇది 123.97cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ మోటార్‌తో పనిచేస్తుంది. 8.18 hp వద్ద 10.3 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజిన్ సీవీటీతో జతచేసి ఉంటుంది. హోండా యాక్టివా 125 ప్రీమియం ఎడిషన్ లాంచింగ్ సందర్భంగా హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ & సీఈఓ అట్సుషి ఒగాటా మాట్లాడారు. హోండా యాక్టివా నుంచి విడుదలయ్యే అన్ని మోడళ్లకు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని చెప్పారు. ఇవి కూడా చదవండి: Yamaha Aerox 155 Review: మార్కెట్లోకి యమహా ఏరోక్స్ 155 స్కూటర్.. ఇది నిజంగా గేమ్ ఛేంజరా?
‘నాణ్యత, విశ్వసనీయత పరంగా హోండా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. అందుకే, మా యాక్టివా కుటుంబానికి ఇప్పుడు కొత్త ప్రీమియం వేరియంట్‌ను జోడిస్తున్నాం. ఈ కొత్త యాక్టివా125 ప్రీమియం ఎడిషన్ కస్టమర్లను ఆకట్టుకుందని ఆశిస్తున్నాం.” అని వివరించారు. కొత్త యాక్టివా125 ప్రీమియం ఎడిషన్ లాంచింగ్‌పై హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ & మార్కెటింగ్ డైరెక్టర్ యద్వీందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ ‘‘హోండా సంస్థ మిలియన్ల కొద్దీ భారతీయులకు నిజమైన తోడుగా నిలుస్తూ వాహనదారుల విభిన్న అవసరాలను తీర్చింది. ఇప్పడు మా కంపెనీ నుంచి మరో ప్రొడక్ట్‌ను లాంచ్ చేస్తున్నాం. విలక్షణమైన డిజైన్, కలర్ స్కీమ్‌లతో యాక్టివా 125 ప్రీమియం ఎడిషన్‌ను రూపొందించాం.” అని చెప్పారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.