Honda Super 6 offer: రూ.11,000 ఆఫర్స్ ప్రకటించిన హోండా టూ వీలర్స్

Honda 2 Wheeler India Super 6 offer | హోండా యాక్టీవా బండి కొనాలనుకుంటున్నారా? రూ.11,000 వరకు ఆఫర్స్ ప్రకటించింది హోండా టూ వీలర్ ఇండియా.

news18-telugu
Updated: October 22, 2020, 10:54 AM IST
Honda Super 6 offer: రూ.11,000 ఆఫర్స్ ప్రకటించిన హోండా టూ వీలర్స్
Honda Super 6 offer: రూ.11,000 ఆఫర్స్ ప్రకటించిన హోండా టూ వీలర్స్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
హోండా టూ వీలర్ ఇండియా సంస్థ బైకర్ల కోసం సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. పండుగ సీజన్‌లో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ద్విచక్ర వాహనాలపై ‘హోండా సూపర్ 6’ ఆఫర్‌ను ఇస్తామని ప్రకటించింది. మొత్తం ఆరు ఆఫర్ల ద్వారా కస్టమర్లు రూ.11 వేల వరకు లబ్ధి పొందవచ్చని సంస్థ తెలిపింది. వీటితో ఫెస్టివ్‌ సీజన్లో ఎక్కువ బైక్‌ల అమ్మకాలను నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. హోండా కస్టమర్లు వాహన విలువలో 100 శాతం వరకు ఫైనాన్స్ పొందవచ్చని ఆ సంస్థ చెబుతోంది. వీటిపై 7.99 శాతం నుంచి ప్రారంభమయ్యే అతి తక్కువ వడ్డీ రేటు, మొదటి మూడు నెలలకు EMIలపై 50 శాతం తగ్గింపు వంటి ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. హోండా కంపెనీ ఫైనాన్స్ పార్ట్‌నర్లైన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఎల్ అండ్ టి ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ముథూట్ క్యాపిటల్, చోళమండలం ఫైనాన్స్, టాటా క్యాపిటల్ టూ వీలర్ లోన్స్.. వంటి సంస్థల నుంచి ఫైనాన్స్ పొందవచ్చు. వీటి ద్వారా కస్టమర్లు రూ.11,000 వరకు లబ్ధి పొందవచ్చని హోండా పేర్కొంది.

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకుంటే మీకే లాభం

EPF Account Transfer: మీ ఈపీఎఫ్ అకౌంట్‌ను ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేయండి ఇలా

డెబిట్, క్రెడిట్ కార్డులపై క్యాష్‌బ్యాక్


క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా బైక్‌లు కొనేవారికి హోండా ఐదు శాతం క్యాష్‌బ్యాక్‌ను (రూ.5,000 వరకు) అందిస్తోంది. EMI ఆప్షన్‌లో బైక్ కొనేవారికి ఈ ఆఫర్ మరింత లబ్ధి చేకూరుస్తుంది. ఈ ఆఫర్ ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యెస్‌ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్... మొత్తం ఐదు బ్యాంకుల క్రెడిట్ కార్డ్ ఈఎంలపై వర్తిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ఐదు శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా (EMI ఆప్షన్ కాదు) వర్తిస్తుంది. దీంతో పాటు ఐసీఐసీఐ కస్టమర్లు డెబిట్ కార్డ్ ఈఎంఐలపై క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. హోండా వినియోగదారులు పేటీఎం ద్వారా రూ.2,500 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

SBI Debit Card: షాపింగ్‌కు డబ్బులు లేవా? రూ.1,00,000 వరకు ఇస్తున్న ఎస్‌బీఐ

Samsung Galaxy M31 Prime: సాంసంగ్ గెలాక్సీ ఎం31 ప్రైమ్ సేల్ మొదలైంది... అమెజాన్‌లో భారీ డిస్కౌంట్

హోండా జాయ్ క్లబ్ బెనిఫిట్స్


హోండా జాయ్ క్లబ్‌ ద్వారా మరిన్ని రివార్డులు, ప్రయోజనాలను ఆ సంస్థ వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. జాయ్ క్లబ్లో సభ్యత్వానికి రూ.349 చెల్లించాలి. ఈ మెంబర్లు మొబిక్విక్‌లో 200 రూపాయల క్యాష్‌బ్యాక్, 340 హోండా కరెన్సీ క్రెడిట్, రూ.1 లక్ష వరకు పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్‌ వంటి ప్రయోజనాలు పొందవచ్చు. దీంతో పాటు సర్వీసింగ్, పార్ట్స్, లేబర్ ఛార్జీలు, హోండా నెట్‌వర్క్‌లో ఫ్రీ పిక్ అప్ అండ్ డ్రాపింగ్.. వంటి సేవలపై జాయ్ క్లబ్ కస్టమర్లు అదనంగా డిస్కౌంట్ పొందవచ్చు. రిఫరల్స్, హోండా 2 వీలర్ ఎక్స్‌చేంజ్‌ ద్వారా బోనస్ పాయింట్లను సాధించవచ్చు. ఈ బోనస్ పాయింట్లను లైఫ్‌స్టైల్, దుస్తులు, రెస్టారెంట్లు, ఫార్మసీ, ఎంటర్‌టైన్‌మెంట్ విభాగాల్లో మొత్తం 30 బ్రాండ్లపై ఖర్చు చేసుకోవచ్చని హోండా సంస్థ తెలిపింది.
Published by: Santhosh Kumar S
First published: October 22, 2020, 10:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading