హోమ్ /వార్తలు /బిజినెస్ /

Income Tax Benefits: హోమ్‌ లోన్‌పై ఇన్‌కం ట్యాక్స్‌ బెనిఫిట్స్‌.. తప్పక తెలుసుకోవాల్సిన డిడక్షన్స్‌ ఇవే

Income Tax Benefits: హోమ్‌ లోన్‌పై ఇన్‌కం ట్యాక్స్‌ బెనిఫిట్స్‌.. తప్పక తెలుసుకోవాల్సిన డిడక్షన్స్‌ ఇవే

Income Tax Benefits: హోమ్‌ లోన్‌పై ఇన్‌కం ట్యాక్స్‌ బెనిఫిట్స్‌.. తప్పక తెలుసుకోవాల్సిన డిడక్షన్స్‌ ఇవే!

Income Tax Benefits: హోమ్‌ లోన్‌పై ఇన్‌కం ట్యాక్స్‌ బెనిఫిట్స్‌.. తప్పక తెలుసుకోవాల్సిన డిడక్షన్స్‌ ఇవే!

Income Tax Benefits: ఇండియాలో సొంతిల్లు ఉండటాన్ని హోదాగా, గౌరవంగా భావిస్తారు. చాలా మంది తమ సొంతింటి కలను హోమ్‌ లోన్‌ ద్వారా నెరవేర్చుకుంటారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు నిర్దేశించిన అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వ్యక్తులకు హోమ్‌ లోన్‌లు సులభంగా అందుబాటులో ఉంటాయి. హోమ్‌ లోన్‌లు పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇండియా (India)లో సొంతిల్లు ఉండటాన్ని హోదాగా, గౌరవంగా భావిస్తారు. చాలా మంది తమ సొంతింటి కలను హోమ్‌ లోన్‌ (Home Loan) ద్వారా నెరవేర్చుకుంటారు. బ్యాంకులు (Banks), ఆర్థిక సంస్థలు నిర్దేశించిన అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వ్యక్తులకు హోమ్‌ లోన్‌లు సులభంగా అందుబాటులో ఉంటాయి. హోమ్‌ లోన్‌లు పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తాయి. హోమ్ లోన్‌పై చెల్లించే ప్రిన్సిపల్‌ అమౌంట్‌, వడ్డీపై ఆదాయ పన్ను చట్టంలోని వివిధ సెక్షన్‌ల కింద ట్యాక్స్‌ డిడక్షన్‌ పొందవచ్చు. 2020-21లో హోమ్‌ లోన్‌లపై ఆదాయ పన్ను రాయితీల అన్ని పాత విధానాలు 2024 సంవత్సరం వరకు వర్తిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. హోమ్ లోన్‌ EMIలో ప్రిన్సిపల్ అమౌంట్‌, ఇంట్రెస్ట్ అమౌంట్‌ అనే రెండు భాగాలు ఉంటాయి. ఇప్పుడు హోమ్‌ లోన్‌ ద్వారా లభించే ట్యాక్స్‌ బెనిఫిట్స్‌ ఏంటో పరిశీలిద్దాం.

* మొదటిసారి గృహ కొనుగోలుదారులకు డిడక్షన్‌

ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80EEA ప్రకారం, మొదటిసారిగా గృహ కొనుగోలుదారు హోమ్‌ లోన్‌ కింద చెల్లించిన వడ్డీపై రూ.1.5 లక్షలు వరకు అడిషనల్‌ డిడక్షన్‌ను క్లెయిమ్ చేయవచ్చు. సెక్షన్ 24 కింద పొందే రూ.2 లక్షల డిడక్షన్‌ కంటే ఎక్కువ ఉంటే ఇది అందుబాటులో ఉంటుంది.

హోమ్ లోన్‌తో రెండో ఇంటిని కొనుగోలు చేస్తే, సొంతంగా వినియోగించుకున్నా, అద్దెకు ఇచ్చినా రూ. 1.5 లక్షల వరకు హౌసింగ్ లోన్ ట్యాక్స్‌ బెనిఫిట్‌ పొందవచ్చు. అలాగే హోమ్ లోన్ EMIల వడ్డీ భాగంపై సెక్షన్ 80EE కింద గరిష్టంగా రూ.50,000 డిడక్షన్‌ క్లెయిమ్ చేయవచ్చు. ఈ డిడక్షన్‌ ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 24(బి) కింద వడ్డీ మొత్తంపై క్లెయిమ్ చేసిన దానికంటే ఎక్కువగా ఉంటుంది.

అయితే ఈ సెక్షన్‌లలో ఒకదాని కింద మాత్రమే డిడక్షన్‌ క్లెయిమ్ చేయవచ్చు. సెక్షన్ 80EE, సెక్షన్ 80 EEA సెక్షన్లు హోమ్ లోన్ ఎప్పుడు మంజూరు అయింది అనే దానిపై ఆధారపడి ఉంటాయి. సెక్షన్ 80EE ప్రకారం.. గృహ రుణాలు తప్పనిసరిగా 2013-14, 2014-15, 2016-17 ఆర్థిక సంవత్సరాల్లో మంజూరై ఉండాలి. రుణ మొత్తం రూ.35 లక్షలకు మించకూడదు. ఆస్తి విలువ రూ.50 లక్షలకు మించకూడదు.

సెక్షన్ 80EEAలో, హోమ్‌ లోన్‌లు తప్పనిసరిగా 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలలో తీసుకొని ఉండాలి. సెక్షన్ 80EE వలె, ఇది కూడా మొదటిసారిగా గృహ కొనుగోలుదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికి ఏ ఇంటికీ యజమాని అయి ఉండకూడదు. రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ స్టాంప్ డ్యూటీ విలువ రూ.45 లక్షలు కంటే ఎక్కువ ఉండకూడదు.

ఇది కూాడా చదవండి : నెలకు రూ.300 పొదుపుతో కోటీశ్వరులు కావొచ్చు ఇలా

* పోస్ట్‌ కన్‌స్ట్రక్షన్‌ ఫేజ్‌

ఐటీ చట్టంలోని సెక్షన్ 24బి కింద చెల్లించిన హోమ్‌ లోన్‌ వడ్డీపై రూ.2 లక్షల వరకు డిడక్షన్‌ క్లెయిమ్‌ చేయవచ్చు.

* ప్రిన్సిపల్‌ రీపేమెంట్‌పై ట్యాక్స్‌ డిడక్షన్‌

ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80Cలో, హోమ్‌ లోన్‌ ప్రిన్సిపల్‌ రీపేమెంట్‌ కింద రుణగ్రహీత రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్‌ డిడక్షన్‌ పొందవచ్చు. రెసిడెన్షియల్‌ ప్రాపర్టీని కొనుగోలు చేయడం లేదా నిర్మించడం కోసం రుణం తీసుకుంటే మాత్రమే ఈ డిడక్షన్‌ క్లెయిమ్ చేయవచ్చు.

* చెల్లించిన వడ్డీపై ట్యాక్స్‌ డిడక్షన్‌

ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం.. రుణగ్రహీత హోమ్‌ లోన్‌పై చెల్లించే వడ్డీపై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల వరకు డిడక్షన్‌ క్లెయిమ్‌ చేయవచ్చు. రుణగ్రహీత రెసిడెన్షియల్‌ ప్రాపర్టీని కొనుగోలు చేయడం లేదా నిర్మించడం కోసం రుణం తీసుకుంటే మాత్రమే ఈ డిడక్షన్‌ క్లెయిమ్ చేయవచ్చు.

First published:

Tags: Home loan, Income tax, Personal Finance, Taxes

ఉత్తమ కథలు