HOME »NEWS »BUSINESS »home loans aggressive home loan prepayment can hurt other money goals sk gh

Home Loans: గృహరుణాలు ముందుస్తుగా చెల్లిస్తే లాభమా? నష్టమా? ఖచ్చితంగా తెలుసుకోండి

Home Loans: గృహరుణాలు ముందుస్తుగా చెల్లిస్తే లాభమా? నష్టమా? ఖచ్చితంగా తెలుసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

Home Loans: రుణాలు త్వరగా చెల్లించడానికి ప్రయత్నించడం ద్వారా మీ ఆర్థిక జీవితంలో ఇతర అంశాల మధ్య సమతూల్యత దెబ్బతినకూడదు. ఈ అంశంపై ప్రముఖ ఆర్థిక సలహాదారు దేవ్ ఆశిష్ ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం.

  • Share this:
మన దైనందిన జీవితంలో నిత్యావసరాలతో పాటు రుణాలు కూడా భాగమైపోయాయంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ఈ రోజుల్లో రుణాలు బ్యాంకుల నుంచి అధికంగా తీసుకుంటున్నారు. ప్రతి చిన్న దానికీ లోన్‌లపైనే అధారపడుతున్నారు. అంతేకాకుండా ఆ లోన్లు కట్టేందుకు ఎంతగానో తాపత్రయపడుతున్నారు. ఎక్కువగా గృహరుణాలను తీసుకొని కట్టేందుకు నానా తంటాలు పడుతున్నారు. రుణరహిత జీవితాన్ని గడపడమంటే లెక్కలేసుకున్నంత సులభం కాదు. అయితే రుణం లేకపోవడమనేది మనశ్శాంతికి కారణమవుతుంది. ఈ కారణంగానే(Home Loan Prepayments) చాలా మంది తమ గృహరుణాలు తిరిగి చెల్లించడానికి ప్రయత్నించడం పట్ల చాలా దూకుడుగా ఉన్నారు. కొన్నిసార్లు ఈ దూకుడు ఎక్కువైతే ఇబ్బందే. ఎందుకంటే రుణాలు త్వరగా చెల్లించడానికి ప్రయత్నించడం ద్వారా మీ ఆర్థిక జీవితంలో ఇతర అంశాల మధ్య సమతూల్యత దెబ్బతినకూడదు. ఈ అంశంపై ప్రముఖ ఆర్థిక సలహాదారు దేవ్ ఆశిష్ ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం.

జీవనశైలిలో రాజీపడటం..


నేను ఇటీవల కాలంలో ఓ వ్యక్తి చూశా. సాధ్యమైనంత వరకు తన గృహరుణాన్ని ముందస్తుగా చెల్లించడానికి ప్రయత్నిస్తున్నాడు. అతడు తన నెలవారీ ఆదాయంలో ఏమైనా మిగిలితే దాన్ని రుణానికే మళ్లిస్తున్నాడు. తన వార్షిక్ బోనస్ ను కూడా తిరిగి లోన్ కట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే అది అతడి వ్యక్తిగత విషయమే అయినప్పటికీ ఇక్కడ ఓ విషయం పరిశీలించాలి. హోంలోన్ ఈఎంఐ చెల్లించాలి అనేది తప్పకుండా చెయ్యాలి. ఇందులో సందేహమేమి లేదు. ఇది చట్టపరమైన అంశం. అయితే రుణాన్ని జప్తు చేయడానికి మీరు సాధారణ ఈఎంఐలు కంటే ఎక్కువ చెల్లించాలా లేదా అనేదే ఇక్కడ ప్రశ్న. ఒకవేళ అవును అంటే ఎంతమేరకు ఉండాలి అనేది తెలుసుకోవాలి.
గృహరుణాలు(Home loans) ముందస్తుగా చెల్లించాలి అనుకునేవాళ్లు కొన్ని సమయాన్ని డబ్బు ఆదా చేయాల్సిన ఇతర లక్ష్యాలు ఉన్నయనే విషయాన్ని విస్మరిస్తారు. అత్యవసర నిధిని కలిగి ఉండటం చాలా అవసరం. మీ ఇంటి రుణాన్ని ముందస్తుగా చెల్లించడానికి, ఎప్పుడూ పొరపాటు చేయకండి. లేదా అత్యవసర నిధిని ఉపయోగించవద్దు. ఆర్థిక అత్యవసరాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. కాబట్టి మీరు కచ్చితంగా ఆర్థిక తటస్థతను కోరుకుంటారు.

ఇతర లక్ష్యాల కోసం ఆదా..
పిల్లల ఉన్నత విద్య కోసం ఖర్చులు ఆకాశాన్నంటుతున్నాయి. కాబట్టి దాన్ని మీరు తెలుసుకోవాలి. మొదటగా మీరు గృహ రుణాన్ని క్లియర్ చేసి ఆపై ఇతర పనులు చేయాలనుకుంటున్నారు. కాబట్టి దాని కోసం ఆదా చేయాలి. ఇలా చేయడం ద్వారా సమయం తగ్గుతుంది. అంతేకాకుండా మీరు ఒకేసారి లక్ష్యం కోసం ఆదా చేయాలి. పదవీ విరమణ అనేది మరోక లక్ష్యం. చాలా మంది తమ కెరీర్ ప్రారంభ దశలోనే దీన్ని విస్మరిస్తారు. పదవీ విరమణ కోసం పొదుపు తర్వాత వేచి ఉండవచ్చని, గృహరుణాన్ని ముందస్తుగా చెల్లించాలని అనుకుంటున్నారు. అయితే పదవీ విరమణ దగ్గర పడుతున్నప్పుడు మీరు ఎక్కువ మొత్తాన్ని ఆదా చేయాల్సి ఉంటుంది. కాబట్టి అది వ్యక్తిగత ఎంపిక మాత్రమే.
ఈ రోజుల్లో గృహ రుణాలపై వడ్డీరేట్లు చాలా తక్కువగా ఉన్నాయని మీకు తెలుసు. వాస్తవానికి చాలా తక్కువగా ఉన్నాయి. మీరు పన్ను ప్రయోజనాలను జోడిస్తే, పన్ను అనంతర రుణ వడ్డీరేట్లు మరింత తగ్గుతాయి. కాబట్టి ఊహజనితంగా మీరు పోస్ట్ టాక్స్ లోన్లు రేట్ల కంటే మెరుగైన రాబడిని పొందగలిగే డబ్బును వేరేచోట పెట్టుబడి పెట్టగలిగితే అప్పుడు గృహరుణాన్ని ముందుస్తుగా చెల్లించే లెక్కలను పరిగణనలోకి తీసుకోవచ్చు. అయితే ఈ ఇన్వెస్ట్ ప్రీపే చర్చ అందరికీ వర్తించదు.

ముందస్తు రుణ చెల్లింపులు చేయడానికి సరైన మార్గం..
మీరు రెగ్యూలర్ గా హోంలోన్ ఈఎంలు కొనసాగించేలా చూడటం. ఇందులో మీ కుటుం ప్రాథమిక జీవనవ్యయాలు లాంటి చర్చించలేని వాటికి చెల్లించడం కొనసాగించాలి.

ఇది పూర్తయిన తర్వాత ముందస్తు చెల్లింపులను ప్రారంభించడానికి మిగిలినవి ఎత్తివేయాల్సిన పనిలేదు. మొదట మీరు అత్యవసరాల కోసం కొంత డబ్బు ఆదా చేశారని నిర్ధారించుకోవాలి. ఆరునెలల ఖర్చులు అత్యవసర నిధిగా ఉండటం మంచిదని నిపుణులు అంటున్నారు.

అత్యవసర నిధి సిద్ధంగా ఉంటే మీకు మిగులు ఉన్న తర్వాతా పిల్లల చదువులు, పెట్టుబడులు లాంటి ఇతర లక్ష్యాల కోసం పెట్టుబడులు ప్రారంభించండి. గృహరుణాన్ని ముందుస్తుదా చెల్లించడానికి మీరు శోధించవచ్చు. అయితే మొదట ఈ లక్ష్యం కోసం ఆదా చేయడం ప్రారంభించండి.

ఇది పూర్తయిన తర్వాత కూడా మీ దగ్గర మిగులు నిధులు ఉన్నాయనుకుంటే రుణాన్ని ముందుస్తుగా చెల్లించాలా వద్ద అనే విషయం గురించి ఆలోచించాలి.

గృహరుణాన్ని త్వరగా చెల్లించడం ప్రాధాన్యత ఇచ్చే విషయమైన అయినప్పటికీ మీరు ఈ మిగులును ప్రతి నెలా ప్రీపే చెల్లించడానికి ఉపయోగించవచ్చు. లేదా మీరు కొంతకాలం మిగులను కూడబెట్టి ఆపై దాన్ని ఒకసారి ప్రీపే చేయండి.

ఇంతకు ముందు చెప్పినట్లుగా మరో ఆప్షన్ కూడా ఉంది. ప్రతి నెలా ప్రీపేయింగ్ చేయడానికి బదులుగా మీరు మిగులను ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. రాబడి సహేతుకమైందని, మీరు చాలా సంవత్సరాలు పెట్టుబడులు పెడుతూ ఉంటే మీరు తగినంత మొత్తాన్ని ఆదా చేస్తారు. అప్పుడు బకాయి పడిన రుణం పెద్దదిగా ఉన్న్పపుడు ఒకే షాట్లో మూసివేయడానికి ఉపయోగించవచ్చు. ఈ విధానం వల్ల మరో ప్రయోజనముంది. మీరు ఎల్లప్పుడూ ఒకే విధమైన తటస్థత ఉంటుంది. ఇది అవసరమైన సమయాల్లో ఉపయోగించవచ్చు. లేదా గృహ రుణరేట్లు పెరగడం ప్రారంభమైతే మీరు ముందస్తు చెల్లింపులు చేయడానికి ఆదా చేసిన డబ్బును ఉపయోగించవచ్చు.

కాబట్టి కొంత సమయం కేటాయించి మీ కోసం ఉత్తమమైన విధానాన్ని మెరుగుపరచడం గురించి ఆలోచించండి. మీకు కచ్చితంగా తెలియకపోతే సమర్థవంతమైన పెట్టుబడి సలహాదారుల నుంచి సహాయం తీసుకోవడానికి వెనకాడకూడదు.
Published by:Shiva Kumar Addula
First published:January 20, 2021, 09:45 IST

टॉप स्टोरीज