• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • HOME LOAN TRANSFER THESE ARE THE FACTORS TO CONSIDER BEFORE SHIFTING LENDERS NS GH

Home Loan: హోమ్ ‌లోన్లపై తగ్గిన వడ్డీరేట్లు... తక్కువ వడ్డీ రుణదాతకు మారాలనుకుంటురా? ఈ విషయాలు తెలుసుకోండి

Home Loan: హోమ్ ‌లోన్లపై తగ్గిన వడ్డీరేట్లు... తక్కువ వడ్డీ రుణదాతకు మారాలనుకుంటురా? ఈ విషయాలు తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుత రుణదాత నుంచి మరో సంస్థకు మారేందుకు కొన్ని ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇది రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం కూడా కావడంతో వినియోగదారులు సర్వీస్ రూల్స్‌పై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు.

  • Share this:
కరోనా తర్వాత ప్రజలకు సొంత ఇంటి విలువ తెలిసొచ్చింది. ప్రస్తుతం ఉన్న ఊర్లో సొంతంగా ఇళ్లు కొనాలనుకునేవారి సంఖ్య పెరుగుతోంది. తక్కువ వడ్డీ రేట్లతో పాటు బిల్డర్లు కూడా మంచి ఆఫర్లను ప్రకటించడంతో ఇంటి కోసం ప్రజలు లోన్‌ తీసుకుంటున్నారు. ప్రస్తుతం బ్యాంకులు అతి తక్కువ వడ్డీ రేట్లతో హోమ్‌లోన్లను అందిస్తున్నాయి. గత ఏడాది బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు సంవత్సరానికి 6.75-6.9 శాతం నుంచి హౌజింగ్ లోన్లను కస్టమర్లకు అందించగలిగాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎక్కువ వడ్డీతో హోమ్ లోన్‌లను తీసుకున్నవారు తక్కువ వడ్డీతో, మెరుగైన సేవలను అందించే రుణదాతలకు తమ లోన్‌లను మార్చుకుంటున్నారు. ప్రస్తుత రుణదాత నుంచి మరో సంస్థకు మారేందుకు కొన్ని ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇది రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం కూడా కావడంతో వినియోగదారులు సర్వీస్ రూల్స్‌పై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు.

వడ్డీ మిగులు అంచనా వేయాలి
కస్టమర్లు చెల్లించాల్సిన మొత్తం ఇంట్రస్ట్ కాస్ట్‌ తక్కువగా ఉంటేనే వేరే రుణదాతకు హోమ్ లోన్‌ను మార్చుకోవాలి. మొదట్లో ఎక్కువ వడ్డీతో లోన్‌ తీసుకున్నవారికి హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌తో (HLBT) ప్రయోజనం ఉంటుంది. HLBT ద్వారా కస్టమర్ల లిక్విడిటీ, ఇప్పటికే ఉన్న పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం పడకుండా హౌజింగ్ లోన్‌పై మొత్తం వడ్డీని సులభంగా చెల్లించవచ్చు. కానీ లోన్ ట్రాన్స్‌ఫర్ కోసం కొత్త రుణదాతకు కస్టమర్లు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆ సంస్థలు కూడా కొత్త కస్టమర్లపై ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీలను విధిస్తాయి. ఇలాంటి ఛార్జీలు, లోన్‌పై చెల్లించాల్సిన వడ్డీ కలిపి ఎంత అవుతుందో వినియోగదారులు తెలుసుకోవాలి. ఈ మొత్తాన్ని ప్రస్తుతం ఉన్న రుణదాతకు చెల్లించాల్సిన వడ్డీతో పోల్చి చూసి ఎంత వరకు ఆదా అవుతుందో ఆరా తీయాలి. మొత్తం వడ్డీ చెల్లించిన తరువాత లబ్ధి చేకూరుతుందని భావిస్తేనే లోన్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి.

ఓవర్‌డ్రాఫ్ట్‌ను ఎంచుకోవచ్చు
HLBTని ఎంచుకునేవారు కొత్త రుణదాత అందించే హోమ్ లోన్ ఓవర్‌డ్రాఫ్ట్ ఆప్షన్‌ను కూడా ఎంచుకోవచ్చు. ఈ సందర్భంలో సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ రూపంలో ఓవర్‌డ్రాఫ్ట్ అకౌంట్‌ను ఓపెన్ చేసి దాన్ని హోమ్ లోన్ అకౌంట్‌తో అనుసంధానం చేస్తారు. కస్టమర్లు తమ మిగులు నిధులను ఓవర్‌డ్రాఫ్ట్ అకౌంట్‌లో జమ చేయవచ్చు. ఎమర్జెన్సీ అవసరాల కోసం ఈ అకౌంట్ నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ ఓవర్‌డ్రాఫ్ట్ అకౌంట్‌ బ్యాలెన్స్ వడ్డీని, కస్టమర్లు బకాయి ఉన్న లోన్‌ నుంచి తీసివేస్తారు. ఇది కస్టమర్లపై హోమ్‌ లోన్‌ వడ్డీ భారాన్ని మరింత తగ్గిస్తుంది. ఈ ఆప్షన్‌ ద్వారా కస్టమర్లు లిక్విడిటీని పరిరక్షించుకుంటూ ముందస్తు చెల్లింపుల ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

ప్రస్తుత రుణదాతతో చర్చించాలి
HLBTకి దరఖాస్తు చేసుకోవడానికి ముందే కస్టమర్లు వడ్డీ రేటు తగ్గింపులకోసం ప్రస్తుత రుణదాతను సంప్రదించాలి. ఇతర సంస్థలు తక్కువ వడ్డీని ఆఫర్ చేస్తున్న వివరాలను వారి ముందు ఉంచాలి. ప్రస్తుత రుణదాత వడ్డీ రేటును తగ్గించడానికి, మెరుగైన సేవలను అందించడానికి అంగీకరించకపోతేనే లోన్ ట్రాన్స్‌ఫర్‌ కోసం ముందుకెళ్లాలి. కానీ ఈ ఆప్షన్‌ను ఎంచుకున్న తరువాత ట్రాన్స్‌ఫర్ చేసిన లోన్‌పై కొత్త సంస్థ తమ సొంత నియమ నిబంధనలు, షరతులను విధిస్తుంది. అందువల్ల కొత్త నిబంధనలను ఖరారు చేయడానికి ముందే టాప్- అప్ లోన్ రూపంలో ఎక్కువ మొత్తంలో లోన్‌ తీసుకునే అవకాశం ఉందేమో తెలుసుకోవాలి. లోన్ గడువును రీసెట్‌ చేసే అవకాశం ఉందేమో ఆరా తీయాలి.

లోన్ గడువుతో సంబంధం
సాధారణంగా హోమ్ లోన్ తీసుకున్న ప్రారంభ దశల్లోనే, దానిపై బ్యాంకులు, హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఎక్కువ వడ్డీలు విధిస్తాయి. మొదట్లో ఎక్కువ వడ్డీలు కట్టిన వినియోగదారులు, తరువాతి దశల్లో లోన్‌ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్‌ను ఎంచుకుంటే పెద్దగా ఫలితం ఉండదు. ఎందుకంటే అప్పటికే వారు ఎక్కువ మొత్తంలో వడ్డీలు చెల్లించి ఉంటారు. దీనికి తోడు కొత్త రుణదాతకు చెల్లించే వడ్డీ విషయంలో పెద్దగా ప్రయోజనం కూడా ఉండదు.

ఉదాహరణకు.. ఒక వ్యక్తి 20 సంవత్సరాల గడువుతో, 8.5 శాతం వడ్డీ రేటుతో రూ.50 లక్షల హోమ్ లోన్‌ తీసుకున్నాడనుకుందాం. ఇదే గడువుతో మరో సంస్థ 7.25 శాతం వడ్డీని విధిస్తుందని అనుకుందాం. ఇలాంటప్పుడు లోన్ ట్రాన్స్‌ఫర్ వల్ల మొత్తం టెన్యూర్‌పై కస్టమర్లకు రూ.9.29 లక్షలు మిగులుతాయి. కానీ చివరి ఐదు సంవత్సరాల్లో కొత్త రుణదాతకు లోన్ ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటే 7.25 శాతానికి కేవలం రూ.1.79 లక్షలు మాత్రమే పొదుపు చేయగలరు. కానీ లోన్ గడువుతో సంబంధం లేకుండా వడ్డీ చెల్లింపుల విషయంలో మిగులు ఉన్నప్పుడు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దీనివల్ల ఇప్పటికే చెల్లించిన అధిక వడ్డీ భారం కొంతవరకైనా తగ్గుతుంది. ఎక్కువ గడువు ఉండే లోన్‌లపై వడ్డీ కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అందువల్ల మిగులు నిధులు ఉన్నప్పుడల్లా లోన్‌ను సాధ్యమైనంత వరకు ముందస్తుగా చెల్లించడానికి ప్రయత్నించాలి.
Published by:Nikhil Kumar S
First published:

అగ్ర కథనాలు