హోమ్ /వార్తలు /బిజినెస్ /

Home Loan Top- Up: టాప్-అప్ హోమ్ లోన్ అంటే ఏంటి ?..దాని ప్రయోజనాలు, వడ్డీ రేట్లు, అర్హత ప్రమాణాలు ఇవే..

Home Loan Top- Up: టాప్-అప్ హోమ్ లోన్ అంటే ఏంటి ?..దాని ప్రయోజనాలు, వడ్డీ రేట్లు, అర్హత ప్రమాణాలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Home Loan: కొంతమంది రుణగ్రహీతలు హోమ్ లోన్ EMIలను తిరిగి చెల్లించడం కోసం టాప్-అప్ లోన్‌ను ఉపయోగిస్తారు. అయితే తక్కువ వడ్డీ రేటుతో రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఎక్కువ రేటుకు రుణం తీసుకోవడం సరైన నిర్ణయం కాదు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

సొంతిళ్లు చాలా మంది కల. ఇందుకోసం ఎంతో శ్రమిస్తుంటారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకొని మరీ తమ కలను నెరవేర్చుకుంటారు. అయితే ఇంటి కొనుగోలు కోసం ఇప్పటికే బ్యాంకుల్లో చాలా అప్పు చేశారా? అయినా ఇంకా డబ్బు అవసరం ఉందా? అయితే మీకు మరో ఆప్షన్ ఉంది. అదే టాప్ -అప్ హోమ్ లోన్. ఎక్కువ డాక్యుమెంటేషన్, వెరిఫికేషన్ లేకుండా డబ్బును అప్పుగా తీసుకునే సులభమైన మార్గాల్లో టాప్-అప్ హోమ్ లోన్ ఒకటి. ఇది ఇతర రుణ సాధనాల కంటే ఎక్కువ సౌలభ్యాన్ని, మెరుగైన ఫీచర్లను కూడా అందిస్తుంది. అయితే ఇందుకు సంబంధించిన ప్రధాన అర్హత అవసరాల్లో ఒకటి... మీరు ఇప్పటికే హోమ్ లోన్ రుణగ్రహీత అయి ఉండాలి. టాప్ -అప్ లోన్ వివరాలు, దాని ప్రయోజనాలను ఇప్పుడు పరిశీలిద్దాం.


* టాప్-అప్ లోన్ ఎలా పని చేస్తుంది?
బ్యాంకులు తమ ప్రస్తుత హోమ్ లోన్ గ్రహీతలకు మాత్రమే టాప్ -అప్ రుణాలను ఇస్తుంటాయి. గరిష్ట టాప్-అప్ లోన్ మొత్తాన్ని అంచనా వేయడం కోసం చెల్లించాల్సిన హోమ్ లోన్‌ను, మొత్తం ఆస్తి విలువ నుంచి తగ్గిస్తారు. టాప్-అప్ తర్వాత బాకీ ఉన్న మొత్తం బ్యాలెన్స్, లోన్ జారీ చేసిన LTV పరిధిలో ఉండాలి.కొత్త హోమ్ లోన్ ఖాతాతో పోలిస్తే పాత హోమ్ లోన్ ఖాతాతో ఎక్కువ టాప్-అప్ హోమ్ లోన్‌లను పొందటానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా, హోమ్ లోన్‌పై టాప్-అప్‌ను అనుమతించడం కోసం బ్యాంకులకు కనీసం ఒక సంవత్సరం పాటు రెగ్యులర్ రీపేమెంట్ చేయడం తప్పనిసరి.* సులువుగా జారీ

టాప్-అప్ హోమ్ లోన్స్ సులభంగా మంజూరు అవుతాయి. రుణగ్రహీతలు లోన్ కోసం కచ్చితమైన కారణాలను పేర్కొనాల్సిన అవసరం లేదు. స్కూల్ ఫీజులు, వివాహ ఖర్చులు, వ్యాపార అవసరాలు వంటి వాటికోసం దీన్ని ఉపయోగించవచ్చు.టాప్-అప్ హోమ్ లోన్ ద్వారా టర్మ్ లోన్ లేదా ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా పొందవచ్చు. అయితే టర్మ్ లోన్‌లను అంగీకరించిన రీపేమెంట్ వ్యవధిలోపు ఈఎంఐలలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా, ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాన్ని 20 సంవత్సరాల వరకు లేదా హోమ్ లోన్ గడువు ముగిసే వరకు పొందవచ్చు. బకాయి ఉన్న వడ్డీని సకాలంలో చెల్లించడం, హోమ్ లోన్ ఈఎంఐలను క్రమం తప్పకుండా తిరిగి చెల్లించడం వంటి వాటికి లోబడి ఇది ఉంటుంది.దీనిబట్టి మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఇతర రిటైల్ లోన్ సాధనాలతో పోలిస్తే, టాప్-అప్ లోన్ ఎక్కువ రీపేమెంట్ కాలవ్యవధిని అనుమతిస్తుంది.

టాప్-అప్ లోన్‌పై ప్రాసెసింగ్ ఛార్జీ దాదాపు 0.50% ఉంటుంది. ఇక వడ్డీ రేటు విషయానికి వస్తే... హోమ్ లోన్‌పై వర్తించే వడ్డీ రేటు, రీపేమెంట్ కాలవ్యవధి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.


* టాప్-అప్ హోమ్ లోన్‌పై వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు

బ్యాంక్ ఆఫ్ ఇండియా - 8.30 శాతం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 8.45 శాతం

పంజాబ్ నేషనల్ బ్యాంక్- 8.50 శాతం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్- 8.25 శాతం

బ్యాంక్ ఆఫ్ బరోడా- 8.80 శాతం

కెనరా బ్యాంక్- 8.85శాతం


KYC: ఆ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఆ తేదీలోపు కేవైసీ చేయకపోతే మీ అకౌంట్స్ ఫసక్..


Tata Motors: అదిరే ఫీచర్లతో టాటా సఫారీ, హారియర్, నెక్సాన్ కార్లకు జెట్ ఎడిషన్‌ లాంచ్.. ధరల వివరాలివే..


* ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఆప్షన్

టాప్-అప్ హోమ్ లోన్, రీపేమెంట్ పరంగా గొప్ప సౌలభ్యాన్ని అందిస్తుంది. సాధారణంగా, రుణదాతలు టాప్-అప్ లోన్‌పై ఎలాంటి ముందస్తు చెల్లింపు పెనాల్టీని విధించరు. మీరు ఇంటి పునరుద్ధరణ లేదా పునర్నిర్మాణ ప్రయోజనాల కోసం టాప్-అప్ లోన్‌ను ఉపయోగించాలని ప్లాన్ చేస్తే, హోమ్ లోన్ కింద నిర్దేశించిన పరిమితికి లోబడి u/s 80C- Sec 24 ద్వారా పన్ను ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.కొంతమంది రుణగ్రహీతలు హోమ్ లోన్ EMIలను తిరిగి చెల్లించడం కోసం టాప్-అప్ లోన్‌ను ఉపయోగిస్తారు. అయితే తక్కువ వడ్డీ రేటుతో రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఎక్కువ రేటుకు రుణం తీసుకోవడం సరైన నిర్ణయం కాదు.

First published:

Tags: Home loan